Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
dikku kaadu dikkayinavaadu mukhyam

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (నవంబర్ 22 - నవంబర్ 28) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున బంధువులతో, మిత్రులతో మాటపట్టింపులు పొందుటకు అవకాశం ఉంది వారితో నిదానంగా వ్యవహరించుట మంచిది. పనులు కొంత ఆలస్యంగా ముందుకు కొనసాగడం చేత ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. శని,ఆదివారాల్లో ఒకవార్త కొంత మానసికంగా భాదను కలిగించే అవకాశం ఉంది జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో మాత్రం సరైన జాగ్రత్తలు పాటించుట మంచిది. సోమ, మంగళ, బుధవారాల్లో ఆశించిన ఫలితాలు కలుగుతాయి. పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు పెరిగనను ఇబ్బందులు కలుగకపోవచ్చును. గురువారం నలుగురిలో గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. వారంమొత్తం మీద తలపెట్టిన విషయాల పట్ల సరైన అవగాహనా పెంచుకొనే ప్రయత్నం చేయండి మంచిది. పనులలో అనుకోని కష్టాలను పొందుటకు అవకాశం ఉంది. సమయానికి  భోజనం చేయుట వలన మేలుజరుగుతుంది. అధికారులతో మిశ్రమఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో నిదానంగా వ్యవహరించుట అనేది సూచన. అకారణంగా కలుగు కలహములకు దూరంగా ఉండుట మంచిది. గతంలో మీరు అనుకున్న ఆలోచనలకు సంభందించిన వాటిలో ధనము వచ్చుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ప్రయాణాలు సాధ్యమైనంత వరకు చేయకపోవడం మంచిది.  

వృషభ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున మాటను పొదుపుగా వాడుట వలన తప్పక మేలుజరుగుతుంది. సమయానికి భోజనం చేయుట వలన తప్పక మేలుజరుగుతుంది. అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది వాటిని అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. శని, ఆదివారాల్లో ఇష్టమైన వారిని కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. నచ్చిన పనులను చేపట్టుటకు ఆసక్తిని చూపిస్తారు.  మనోదైర్యంను కలిగిఉండి పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. సోమ,మగళ,బుధవారాల్లో పనులు ముందుకు వెళ్ళడంలో ఆటంకాలు పొందుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు చేయకండి వాయిదా వేయుట మూలాన తప్పక మేలుజరుగుతుంది. బంధు,మిత్రులతో మాటపట్టింపులు కలుగుటకు అవకాశం ఉంది కావున సర్దుబాటు విధానం ఆవలంభించుట మూలాన తప్పక మేలుజరుగుతుంది. గురువారం ఒక విషయంలో కొంత ఇబ్బందిని పొందుతారు. ఆరోగ్యం విషయంలో తప్పక జాగ్రత్తలు పాటించుట చేత మేలుజరుగుతుంది. సమయానికి భోజనం చేయుట మంచిద. వారంమొత్తం మీద తలపెట్టిన పనులలో మొదట్లో ఉన్న ఉత్సాహం చివరివరకు కొనసాగించే ప్రయత్నం చేయండి మంచిది. మీ  భాగస్వామికి ఆరోగ్యసమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. పనులలో శ్రమను పొందుటకు అవకాశం ఉంది చేపట్టుటకు ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుట ఉత్తమం. విందులు,వినొదముల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు వాటికి కొంత దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. ధార్మిక సంభందమైన విషయాలలో పాల్గొనుట మంచిది. వివాదములకు దూరంగా ఉండుట మంచిది.

మిథున రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున నూతన పనులను చేపట్టుట యందు ఆసక్తిని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది నూతన అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తారు. శని,ఆదివారాల్లో వ్యాపారపరమైన నిర్ణయాలు తీసుకోకండి. ధనముకు సంభందించిన లవాదేవిల్లో నిదానంగా వ్యవహరించుట వలన తప్పక మేలుజరుగుతుంది. సోమ,మంగళ,బుధవారాల్లో పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. తప్పక ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుటకు అవకాశం ఉంది. నూతన పనులను ఆరంభించి విజయాలను పొందుటకు అవకాశం కలదు. గురువారం మాత్రం కొంత ఇబ్బందులు కలుగుటకు అవకాశం కలదు. పనులలో అనుకోని ఆటంకాలు కలుగుటకు ఆస్కారం కలదు నిదానంగా వ్యవహరించుట మూలాన తప్పక మేలుజరుగుతుంది. అందరిని కలుపుకొని వెళ్ళండి మంచిది. వారంమొత్తం మీద తలపెట్టిన పనులలో ఒకింత వరకు అనుకూలమైన ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. పనులను ఆరంభించే ముందు బాగాఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. సౌఖ్యవంతమైన జీవితానికి ప్రాముక్యతను ఇస్తారు. ఉల్లాసంగా గడుపుటకు అవకాశం ఉంది,బంధువులను కలుస్తారు. అకారణంగా ఏర్పడు కలహముల పట్ల మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. ఉద్యోగంలోమాత్రం మిశ్రమ ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది, అధికారులకు అనుగుణంగా నడుచుకొనే ప్రయత్నం చేయండి మేలుజరుగుతుంది.

కర్కాటక రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాలు చేయాలన్న తలంపు ఉంటుంది కాకపోతే ముందుకు వెల్లుటలో ఇబ్బందులు తప్పక పోవచ్చును. శని,ఆదివారాల్లో ఆర్థికపరమైన విషయాల్లో తప్పక లాభంను పొందుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో బాగుంటుంది. నూతన అవకశాలు కలుగుటకు ఆస్కారం ఉంది. సోమ, మంగళ, బుధ వారాల్లో మాటలను మాత్రం పొదుపుగా వాడుట మూలాన తప్పక మేలుజరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు నిదానంగా వ్యవహరించుట సూచన. గురువారం బంధువులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. గతంలో తలపెట్టిన పనులకు గాను అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వారంమొత్తం మీద బంధు,మిత్రులతోకలిసి నూతన పనులను వాయిదా వేయుట వలన లాభంను పొందుతారు. అకారణంగా భయంను పొందుతారు. మిత్రుల వలన  ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండుట సూచన. మాత్రుసంభందమైన విషయాల్లో ఉత్సాహంగా పాల్గొనే అవకాశం ఉంది. ధార్మిక సంభందాలకు సమయాన్ని ఇవ్వడం వలన తప్పక మేలుజరుగుతుంది. అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. కోపంను పొందుటకు అవకాశం ఉంది జాగ్రత్త అదుపులో ఉంచుకొనే ప్రయత్నం వలన మేలుజరుగుతుంది.
  

సింహ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున బంధువులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. శని,ఆదివారాల్లో ఆలోచనల మూలాన ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. బంధువులను కలుస్తారు వారితో మాటపట్టింపులు వచ్చుటకు అవకాశం ఉంది. ఖర్చులకు సంభందించిన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట అలాగే వాటిని అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి. సోమ, మంగళ, బుధవారాల్లో నూతన ఉత్సాహంను కలిగి ఉండి పనులలో విజయంను పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది, గతంలో చేపట్టిన పనులకు సంభందించిన అనుకూలమైన ఫలితాలు కలుగుటకు ఆస్కారం ఉంది. గురువారం మాటలను పొదుపుగా వాడుట అలాగే పెద్దలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, అనేది సూచన. ముఖ్యంగా ధనమునకు సంభందించిన వాటిలో నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది ఉత్తమం. వారం మొత్తం మీద తలపెట్టిన పనులకు ఆటంకాలు కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్తగా ప్రణాళికా ప్రకారం ముందుకు వెళ్ళుట మంచిది. ప్రయాణాలను వాయిదా వేయుట మూలాన తప్పక మేలుజరుగుతుంది. కుటుంభంలో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం కలదు అందరిని కలుపుకొని వెళ్ళండి చిన్న చిన్న విషయాలకు స్పందించకపోవడం ఉత్తమం. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు కలుగుటకు ఆస్కారం ఉంది అధికారులతో నిదానంగా వ్యవహరించుట మేలు. గౌరవంను పొందుతారు శుభాకార్యములలో పాల్గొంటారు.

 

కన్యా రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున అధికారులకు అనుగుణంగా పనులను చేపట్టుట మూలాన మంచిపేరును తెచ్చుకొనే అవకాశం కలదు. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుట మూలాన మేలు జరుగుతుంది. శని,ఆదివారాల్లో బంధువులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. చర్చలకు సమయాన్ని కేటయించే అవకాశం కలదు. పెద్దల ద్వార నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. సోమ, మంగళ, బుధవారాల్లో చేపట్టిన పనుల మూలాన ఆలోచనలు కలిగి ఉంటారు. అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది వాటిని అదుపులో ఉంచుకొనే ప్రయత్నం తలపెట్టుట మంచిది. ప్రయాణాల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును అవసరమైతేనే ప్రయాణం చేయుట ఉత్తమం. వారంమొత్తం మీద బంధుమిత్రులతో కలిసి తలపెట్టిన పనులకు సంభందించిన విషయాల్లో మంచి ఫలితాలు కలుగుతాయి. అధికారులతో గతంలో ఉన్న ఇబ్బందులు తొలగుటకు అవకాశం కలదు. మార్పును కోరుకొనే అవకాశం ఉంది మార్పు కలుగుతుంది. స్వల్పఅనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. వాటిపట్ల శ్రద్ధను చూపుట మేలు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. పెద్దలతో కలిసి పనులను చేపట్టుటకు ఆస్కారం కలదు వారికీ అనుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. కుటుంబంలో అనుకూలమైన మార్పులు కలుగుటకు అవకాశం ఉంది.

తులా రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున కుటుంబంలో చిన్న చిన్న మార్పులు పొందుటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో నిదానంగా వ్యహరించుట మూలాన మేలుజరుగుతుంది అలాగే సర్దుబాటు విధానం ఆవలంభించుట మేలు. స్వల్ప అనారోగ్య సమస్యలు భాదిస్తాయి కావున తగిన జాగ్రత్తలు తీసుకోండి. శని, ఆదివారాల్లో పనులలో వేగం ఉంటుంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుటకు అవకాశం ఉంది. ఉత్సాహంను కలిగి ఉండి అందరిని కలుపుకొని వెళ్ళుట మూలాన మేలుజరుగుతుంది. సోమ, మంగళ, బుధవారాల్లో బంధువుల గృహంలో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. మీయొక్క ఆలోచనలను వారితో పంచుకొనే అవకాశం కలదు. నూతన అవకాశాలను అందిపుచ్చుకొనే అవకాశం ఉంది. ప్రణాలికా ప్రకారం ముందుకు వెళ్ళుట మూలాన మేలుజరుగుతుంది. గురువారం ఆలోచనలు పెరుగుటకు అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు కలుగుతాయి. ప్రయాణాల మూలాన ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. మానసికంగా దృడంగా ఉండుట అనేది సూచన. వారంమొత్తం మీద చేయు వ్రుత్తిలో ధనమును కోల్పోయే అవకాశం ఉంది, అనుకోని ఖర్చులు కలుగుతాయి. అధికారులతో మాత్రం నిదానంగా వ్యవహరించుట మూలాన తప్పక మేలుజరుగుతుంది. అనుకోని ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. నచ్చిన పనులకు సమయాన్ని ఇస్తారు. పెద్దలకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన తప్పక విజయాన్ని పొందుతారు కాకపొతే నిదానం అవసరం.


వృశ్చిక రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది కావున నూతన ప్రయత్నాలు చేయకండి మంచిది. ఆరోగ్యపరమైన సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది. శని,ఆదివారాల్లో కుటుంభంలో మనస్పర్థలు కలుగుటకు ఆకాశం ఉంది. మీయొక్క ఆలోచనలు తోటివారికి నచ్చకపోవచ్చును సర్దుకుపొండి. వివాదములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. ఆర్థికపరమైన విషయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది తప్పక మేలుచేస్తుంది. సోమ,మంగళ,బుధవారాల్లో అధికారులతో ప్రణాళికా ప్రకారం నడుచుకొనుట మూలాన తప్పక మేలుజరుగుతుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కాస్తా ఊరట చెందుటకు అవకాశం ఉంది. గురువారం బంధువులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు వారితో నిదానంగా వ్యవహరించుట మంచిది. వారంమొత్తం మీద ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది. పనులను ఒక్కొక్కటిగా పూర్తిచేసే ప్రయత్నం చేయండి పనిఒత్తిడిని పెట్టుకోకపోవడం అనేది సూచన. సమయానికి భోజనమ చేయండి మంచిది. సంచారం చేయుట మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును. ప్రయాణాలు వాయిదా వేయుట అనేది మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు కూడదు. నూతన పరిచయాలకు ప్రాముఖ్యతను ఇస్తారు.


ధనస్సు రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున చేపట్టిన పనుల మూలాన నలుగురిలో గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది ఆర్థికపరమైన విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. శని,ఆదివారాల్లో కుటుంబంలో మార్పులు కలుగుటకు అవకాశం కలదు వాటి మూలాన స్వల్ప ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. మరొక ప్రదేశంలో నివసించవలసి రావోచ్చును, నచ్చకపోవచ్చును. సోమ, మంగళ, బుధవారాల్లో నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన మేలుజరుగుతుంది. అనుకోని ప్రయాణాలు చేయవలసి రావొచ్చును వాటి మూలాన ఇబ్బందులు పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు కాకపోతే కొంత కాలం ఆగడం మంచిది. గురువారం అనుకున్న పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. అధికారుల మూలాన నూతన అవకశాలు కలుగుటకు ఆస్కారం ఉంది. ఆర్థికంగా చిన్న చిన్న అవకశాలు పొందుతారు.  వారం మొత్తం మీద అధికమైన ప్రయాణాలు చేయవలసి రావోచ్చును వాటి మూలాన కొంత అలసి పోయే అవకాశం ఉంది. ధనము విషయంలో అనుకోని వ్యయం కలుగుతుంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి మంచిది. స్థానమార్పిడిని పొందుతారు. ఇతరులతో స్వల్ప విరోదములు పొందుటకు అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. పెద్దల మూలాన కొంత సహాయం అందుతుంది.

మకర రాశి

ఈవారం మీరు శుక్రవారం రోజున పనులలో ఉత్సాహంను కలిగి ఉండి వాటిని విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. నూతన పనులయందు ఆసక్తిని కలిగి ఉంటారు. వాటికి సమయాన్ని కేటయించే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషంగా గడుపుటకు అవకాశం ఉంది. శని,ఆదివారాల్లో చేపట్టిన పనుల మూలాన మంచిపేరును కలిగి ఉండే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు పొందుతారు వాటిని పెద్దల సూచనలతో ముందుకు వెళ్ళినచో లాభంను పొందుటకు అవకాశం ఉంది. సోమ, మంగళ, బుధవారాల్లో ఆరోగ్యం విషయంలో తప్పక జాగ్రత్తలు పాటించుట చేయండి లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును. పనులలో అధికమైన శ్రమను పొందుటకు అవకాశం ఉంది జాగ్రత్త. సమయానికి భోజనం చేయుట అనేది సూచన. గురువారం కలుగు మార్పుల పట్ల ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉండుట అనేది మేలుచేస్తుంది. సర్దుబాటు విధానం అవసరం కోపం వద్దు. వారంమొత్తం మీద అధికారులతో కలిసి తలపెట్టిన పనులలో అనుకూలమైన ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మంచి అవకాశాలు కలుగుటకు అవకాశం ఉంది. మధురపదార్థముల యందు ఆసక్తిని కలిగిఉంటారు ,మృష్టాన్నభోజన ప్రాప్తిని కలిగి ఉంటారు. తలపెట్టిన పనులను మీ అశ్రద్ద మూలాన మధ్యలో ఆపివేసే అవకాశం ఉంది జాగ్రత్త. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం కలదు కావున నిదానంగా వ్యవహరించుట మంచిది.


కుంభ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ఒకవార్త కొంత ఇబ్బందికి గురిచేస్తుంది. అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. పనుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తడబాటు కలిగి ఉంటారు. శని,ఆదివారాల్లో ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆవకాశాలు కలుగుటకు అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకున్న పనులను చేపట్టుటకు ఆస్కారం కలదు. సోమ, మంగళ, బుధవారాల్లో ప్రతిపనిలో విజయంను పొందాలనే తలంపును కలిగి ఉండుట వలన ఒత్తిడిని పొందుటకు అవకాశం ఉంది. కావున ప్రణాళికతో ముందుకు వెళ్ళుట చేత విజయంను పొందుతారు. నలుగురిలో గుర్తింపును కలిగి ఉంటారు. తోటివారికి సహయం చేసే అవకాశం ఉంది. గురువారం మాత్రం ఆరోగ్యం విషయంలో అశ్రద్ద చేయకండి అలాగే ఖర్చులు కలుగుటకు ఆస్కారం కలదు. వారంమొత్తం మీద ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. రాజకీయవ్యవహారాల యందు ఆసక్తిని కలిగి ఉంటారు వాటికోసం సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది. అధికారులతో కలిసి నూతన ఆలోచనలు చేస్తారు. కొంత అసంతృప్తిని కలిగి ఉంటరు వచ్చిన ఫలితాల పట్ల సర్దుబాటు అవసరం. పనులలో మొదట్లో ఉన్న ఉత్సాహం చివరి వరకు కొనసాగించే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో మంచి మార్పుకు ప్రయత్నం చేస్తారు. భోజనం విషయంలో మీదైన ఇష్టం కలిగి ఉంటారు. చిన నాటి మిత్రులను కలుస్తారు వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది.

మీన రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున బంధుమిత్రులతో చిన్న చిన్న విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది వారి ఆలోచనలు నచ్చక పోవచ్చును. నూతన నిర్ణయాలు చేయకపోవడం ఉత్తమం . శని, ఆదివారాల్లో ఆశుభవార్తను వినే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దగా సంతృప్తిని పొందలేరు. మానసికంగా దృడంగా ఉండుట అనేది సూచన. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు అవకాశం కలదు. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. సోమ,మంగళ,బుధవారాల్లో మంచి మార్పులు మీ ఆలోచన సరళి మూలాన వచ్చే అవకాశం కలదు. ఉద్యోగంలో పనిలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను నిదానంగా పూర్తిచేస్తారు. అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశముంది. గురువారం నలుగురిలో మంచి పేరును,గుర్తింపును పొందుతారు. దూరప్రదేశం నుండి అనుకూలమైన వార్తను వినే అవకాశం ఉంది. ధనమునకు సంభందించిన విషయాల్లో సంతృప్తిని పొందుతారు.  వారంమొత్తం మీద అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం కలదు వాటిని నియత్రించే ప్రయత్నం చేయండి మంచిది. అకారణంగా కలుగు కలహముల పట్ల నిదానంగా వ్యవహరించుట సూచన. నచ్చిన పనుల కోసం సమయాన్ని కేటాయిస్తారు. భోజనం విషయంలో సమయపాలన అవసరం. ఉద్యోగంలో పనిభారంను కలిగి ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకోండి తప్పక మేలుజరుగుతుంది. శత్రువుల మూలాన చిన్న చిన్న సమస్యలు తప్పక పోవచ్చును.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
paisa kharchuleni pani