Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Thanikellabharani

ఈ సంచికలో >> సినిమా >>

గొంతిచ్చిన అల్లరి నరేష్‌

Allari Naresh

‘జల్సా’ సినిమాకి మహేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం అందరికీ తెలుసు. అలాగే ‘మర్యాదరామన్న’ సినిమాకి రవితేజ వాయిస్‌ ఇచ్చాడు. వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడమంటే ఆ రేంజ్‌ స్టార్‌ డమ్‌ ఉండాలనే అభిప్రాయం ఉంది. సందీప్‌ కిషన్‌ హీరోగా రూపొందుతున్న ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాకి కామెడీ హీరో అల్లరి నరేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడన్న విషయం విస్మయం గొలుపుతుంది.

యాక్షన్‌ ఫిలింగా అనిపిస్తోంది ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమా ప్రోమోస్‌ చూస్తోంటే. అలాంటి సినిమాకి కామెడీ హీరో అల్లరి నరేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం ఆశ్చర్యకరంగా అనిపించడం తప్పు కాదు. కాని అల్లరి నరేష్‌ వాయిస్‌ ఓవర్‌ తమ సినిమాకి అదనపు ఆకర్షణ అవుతుందని చిత్ర దర్శక నిర్మాతలు భావించారు.

కామెడీ హీరోగా ఏడాదికి చాలా ఎక్కువ సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న అల్లరి నరేష్‌, స్టార్‌ హీరోలకు ధీటుగా కాకపోయినా, నిర్మాతలకు కాసులు రాల్చే సినిమాలు ఎక్కవే చేశాడు. అలా స్టార్‌ హీరో రేంజ్‌కి ఏమాత్రం తక్కువ కాకుండా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్‌ మూలంగా, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’కి హైప్‌ క్రియేట్‌ అయితే వింతేముంటుంది?

మరిన్ని సినిమా కబుర్లు
Ramcharan favourite song