డిసెంబర్ నుంచి తెలుగు సినీ పరిశ్రమలో కొత్త జోష్ కన్పిస్తుంది. సంక్రాంతి రిలీజ్‌లు... ఏడాదిలో చివరి నెల అయిన డిసెంబర్‌లో భారీ సినిమాల రిలీజ్‌లు ఇలా ఆసక్తికరమైన వాతావరణం వుంటుంది. పెద్ద సినిమాల గురించే ఎక్కువ చర్చ జరుగుతుందిప్పుడు. కానీ ఓ చిన్న సినిమా కూడా సినీ పరిశ్రమలో ఆసక్తిని రేపుతోంది.
అదే ‘ప్రేమ ఇష్క్ కాదల్’. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా గురించి, తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్స్‌కి నిర్మాతలు ఈ సినిమాని ఇటీవలే చూపించగా, వారంతా సినిమాని మెచ్చుకుని, నిర్మాత చెప్పిన రేటుకి సినిమాని కొనుక్కున్నారు. దాంతో, విడుదలకు ముందే కోటి రూపాయల వరకూ నిర్మాత లాభ పడ్డట్లు సమాచారమ్.
సినిమా విడుదలకు ముందు వస్తున్న మంచి పాజిటివ్ టాక్‌తో శాటిలైట్ రైట్స్ కూడా బాగానే వర్కవుట్ అవుతాయని తెలుస్తోంది. చిన్న సినిమాల్లో పెద్ద సెన్షేన్ అవుతుందని అనుకుంటున్నారు ‘ప్రేమ ఇష్క్ కాదల్’ గురించి సినిమా వర్గాలకు చెందినవారు. డి. సురేష్‌బాబు, మధుర శ్రీధర్ సంయుక్తంగా సమర్పిస్తోన్న ఈ చిత్రానికి బెక్కం వేణుగోపాల్ నిర్మాత. పవన్ సాధినేని చిత్ర దర్శకుడు.
|