Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
kodalu diddina kapuram

ఈ సంచికలో >> కథలు >> ఆత్మ తృప్తి

aatmatrupti

పరంధామయ్య గారి ఇంట్లో దసరా ప్రతి సంవత్సరం కన్నా ఎంతో వేడుకగా జరిగింది. కొడుకులు,  కోడళ్ళు, కూతురూ, అల్లుడూ, వాళ్ళందరి పిల్లలతో ఆ ఇల్లు కళ కళ లాడింది. పరంధామయ్య గారిది ఆ వూళ్ళో గౌరవ, మర్యా దలున్న కుటుంబం. భార్య రెండేళ్ల క్రితమే కాలం చేసింది. ఇద్దరు కొడుకులు, కూతురూ అంతా ఉద్యోగస్తులు కావడంతో, అంతా వున్నా,  వంటిరి గా వుంటున్నాడు పరంధామయ్య. ఏదో పండగలకు పబ్బాలకు అంతా ఇల్లు చేరుతారు, ఆ తరువాత ఎవరి దారి వారిది.

తెల్లవారితే అందరూ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పరందా మయ్య గారి కి, ఆ రాత్రి నిద్ర పట్టలేదు, చాతి లో బరించలేని బాధగా అనిపించింది, పిల్లలంతా ఘాడ నిద్రలో ఉన్నారు, ఎవరిని లేపలనిపించలేదు, రేపు ఉదయం డాక్టర్ ను కలవొచ్చు అనుకోని, కాస్తా జండుబాం రాసుకోని, కొన్ని మంచినీళ్లు తాగి పడుకున్నాడు. మరునాడు ఇక లేవలేదు.

ఇల్లంతా గొల్లుమంది, వూరంతా ఒక్క దగ్గరి కొచ్చింది. నిన్నటిదాకా బాగానే ఉన్నాడు, ఏమైందో ఏమో అని ఒకరంటే, అదృష్ట వంతుడు అందరినీ దగ్గర పెట్టుకొని నిద్రలోనే హాయిగా కన్ను మూసాడు అని మరొకరు, రక రకాలుగా మాట్లాడు  కుంటున్నారు. బంధువులు, స్నేహితులు అంతా చేరుకున్నారు.  అంతిమ యాత్రకు ఏర్పాట్లు మొదలు పెట్టారు.

కార్యక్రమాలన్నీ , బంధువు లు వూరి పెద్దలు, పరంధామయ్య గారి స్నేహితులు, దగ్గరుండి చేస్తున్నారు. ఇంతలో వూరిలో వుండే వ్యాపారి శంకర య్య అక్కడి కి వచ్చి, అరేయ్ అబ్బాయిలు మీరిద్దరూ ఒకసారి రండి అంటూ పరాం దామయ్య గారి కొడుకులను పిలిచాడు, మీరూ వినండయ్య పెద్దమనుషులు అంటూ, ఈ పరంధామయ్య గారు నా దగ్గర  పదిహేను  లక్షలు అప్పుగా తీసుకున్నాడు, ముందు నా బాకీ సంగతి తేల్చండి అంటూ కొడుకులిద్దరిని నిలదీశాడు.  ఇస్తారు లేవయ్యా, డబ్బులెక్కడికి పోతాయి, ఇదేనా అడిగే సమయం అంటూ అక్కడున్న వాళ్లంతా గట్టిగా శంకరయ్య ను మందలించారు.

శంకరయ్య కూడా ఏమాత్రం తగ్గకుండా నేనేమీ డబ్బులిప్పుడే కట్టమనడం లేదాయ్యా, మీ అందరి ముందు నీ అప్పు భాధ్యత మాదే అని ఒక్క మాట చెప్ప మం టున్నానానంతే అన్నాడు . పరంధామయ్య పెద్దకొడుకు పౌరు షంగా ముందుకొచ్చి, అసలు మా నానా అప్పు తీసుకున్నాడని రుజువేంటి అన్నాడు, అయ్యా అన్ని రుజువులు చూపిస్తాను, అవి చూశాకే ఇవ్వండి అన్నాడు శంకరయ్య. ఇంకేం ఆలోచిస్తున్నా రయ్యా, మీ తండ్రి చేసిన అప్పు మీరు కాక ఎవరు కడతారు చెప్పండయ్యా అన్నారు పెద్దలంతా. అన్నా తమ్ములిద్దరు ఇంట్లోకి వెళ్ళారు, వారితో పాటే వారి భార్యలు కూడా వెళ్ళారు. ఒకటే మంతనాలు, బైట వున్న పెద్దలంతా ఏంటయ్యా ఆలస్యం, త్వరగా చెప్పండి అని మందలించగానే, అంతా బైటికి వచ్చారు. మా నానా ఈ అప్పు ఎందుకు చేశాడో మాకు తెలియదు, మాకు మాట మాత్ర మైన చెప్పలేదు, అసలు ఆయనకు అప్పు చేయాల్సిన అవసరం లేనేలేదు, కాబట్టి ఈ అప్పుకు మాకు ఎలాంటి సంబంధమూ లేదు అని ముక్త కంఠం తో అన్నదమ్ములిద్దరూ తేల్చి చెప్పారు.

ఈ మాటలు విన్న వూరి వాళ్లంతా నిర్ఘాంత పోయా రు. ఎం కొడుకులయ్యా మీరు , మిమ్మల్ని అడిగి మీ నానా మిమ్మల్ని కన్నాడ, మిమ్మల్ని అడిగే ప్రయోజకులను చేశా డా,  బుద్ది ఉండాలయ్యా  మాట్లాడేటప్పుడు,అన్నం తినట్లే,సరే ఇదే మీ నిర్ణయం అయితే శవం ఎట్లా లేస్తుందో నేను చూస్తాను అంటూ కటువుగా మాట్లాడాడు శంకరయ్య. వూరి వాళ్ళు, బంధు వులు, స్నేహితులు ఎన్నో రకాలుగా కొడుకులకు నచ్చ చెప్పినా ససేమీరా అన్నారు, ఎం ప్రయోజనం లేక పోయింది. కొడుకులిద్దరూ ఏమి పట్టనట్టే ఉన్నారు తప్ప ఒక్క మాట మాట్లాడటం లేదు.సరే పడందయ్యా పోదాం, మనం మాత్రం ఏం చేస్తాం, వాళ్ళు వాళ్ళు తెల్చుకుంటారు మనకెందుకు, కానీ ఒక్కటి మాత్రం నిజం గొప్పగా బ్రతికిన పరంధామయ్య ఆత్మ కు  మాత్రం శాంతి లేకుండా చేస్తున్నా రాయ్యా . అంటూ వూరి వాళ్లంతా అక్కడనుంచి వెళ్ళబోయారు..ఇంతలో పరంధామయ్య గారి కూతురు ఆగండయ్య ఒక్కసారి దయచేసి నా మాట వినండి , ఎవ్వరూ వెళ్లకండి అంటూ చేతులు జోడించి వేడుకుంది.
శంకరయ్యా  గారు ఇదిగోండి నా నగలు ఇప్పుడే తీసుకోండి, ఇవిపోను ఇంకా మీకు రావాల్సిన డబ్బులన్నీ అణా పైసలతో సహా నేను చెళ్ళిస్తాను , కాస్త గడువివ్వండి, ఇది అందరిముందూ చెప్తున్న మాట నమ్మకం లేకుంటే, దస్తావేజులు తెప్పిo చండి, సంతకాలు పెడతాను అంటూ ప్రాధేయ పడింది. ఏంటమ్మా నువ్వు కడతావ, అందరూ వినండయ్యా, ఎం చేయమంటారు అన్నాడు శంకరయ్య. ఎవరైతే ఏంటయ్యా ,ఆమె మాత్రం ఆ తండ్రి బిడ్డకాదా, అందరి ముందు చెప్పింది గా, నీ డబ్బులు ఎక్కడికి పోవు ఇక తప్పుకో అన్నారు.

కూతురు చెప్పిన మాటలు విని అందరూ ఎంతో మెచ్చు కున్నారు, నువ్వేనమ్మా మీ నాయన వారసు రాలివి.నీ లాంటి ఒక్క కూతురు చాలమ్మ ఎందుకూ, పనికి రాని పదిమంది కొడుకులు అన్నారు అందరూ. ఇంతలో శంకరయ్య ఇలా అన్నాడు, అందరూ  నా మాట వినాండయ్య. ముందుగా పెద్దలంతా నన్ను మన్నించాలి,అసలు పరంధామయ్య  గారు నాదగ్గర అప్పు చెయ్య నేలేదు,   ఆయనే కొద్ది కొద్దిగా కూడబెట్టి నాదగ్గర పదిహేను లక్షలు దాచి పెట్టాడు, ఎన్నిసార్లు అడిగినా, సరైన సమయంలో ఇద్దువుగాని నీ దగ్గరే ఉంచు అనేవాడు, మా మధ్య నోటి మాటలే కానీ ఏ ఆ దారంలేదు. అది నా పైన అతనికున్న నమ్మకం . అందుకే ఈడబ్బు నమ్మకంగా అసలైన వారసులకు ఇస్తేనే అతని ఆత్మకు తృప్తి అనుకున్నాను, అందుకే ఇంత చేశాను. ఇప్పుడు మీరే చెప్పండి ,ఈ డబ్బు ఎవరికివ్వమంటారో అన్నాడు. అంతా ఆ డబ్బు కు నిజమైన వారసురాలు కూతు రేనని, ఆమేకి స్తేనే న్యాయం అన్నారు.అం తే కాదు మిగిలిన ఆస్తి పాస్తులన్ని ఆమెకే చెందాలని, ఇది వూరి నిర్ణయమని తేల్చి చెప్పారు. కొడుకులను చూసి అంతా తూ అన్నారు. పరంధామయ్య గారి అంతిమ యాత్ర పూర్తి అయింది. పరంధామయ్య గారి ఆత్మ తృప్తి గా నవ్వుకుంది.

మరిన్ని కథలు