Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

బాధ్యులా? బాధితులా!

badhylaa? badhitulaa!

"సార్! కొద్దిగా కొబ్బరినీరుత్రాగుతారా!"అంటూ ఆదమరచినిద్రపోతున్న నన్ను లేపాడు మాడ్రైవర్ మురళి. ముందురోజు హైకోర్టులో పెద్ద కేసు వాదించి నేరుగా అక్కడి నుంచే ప్రయాణం చేయడంవల్ల బాగా అలసిపోయి ఉన్నాను.

"అలాగే ! కాస్త అలసట గాకూడా ఉంది."అంటూ మాధవ్ అందించిన కొబ్బరి బోండాలో నీరుత్రాగి తేటపడ్డాను.మురళి తిరిగి కారు నడపసాగాడు.

"ఎంత సార్ ! మరో అర్ధగంటలో ఆనందగిరి చేరిపోతాం. అత్తమ్మ గారుకూడా చేరారని  రవి ఫోన్ చేశాడు. "అంటూ సన్నగా భజన క్యాసెట్ ఆన్ చేశాడు. మురళి ను చూస్తూ ఉంటే నాకు గతం జ్ఞాపకం రాసాగింది.ఎంతమార్పు! 

అవి నేను నా న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకుని పేరుగాంచిన న్యాయవాది నారాయణ గారివద్ద పనిచేస్తున్న రోజులు. పట్టా ఐతే వచ్చిందికానీ ప్రాక్టీసు ముఖ్యమని తెలుసు కుంటున్న కాలం. ఎంతో కాలం తర్వాత మేనత్త పండుక్కి తమ ఇంటికి వస్తున్నదనీ, తనను చూడా లని కోరుతున్నదనీ నాన్నగారు ఫోన్ చేసిన మీదట ,బాస్ నడిగి సెలవు పొంది ఇంటి కి వచ్చాడుతాను .తాను వచ్చినందుకు అత్త ఎంతో సంతోషపడింది.

పండుగ కాగానే అత్త తిరుగు ప్రయాణం .నాన్నగారు  “నాయనా మూర్తీ! వసంత త్తను కార్లో ఊర్లో వదిలేసి వస్తావా!పాపం వచ్చేప్పుడు బస్సులోవచ్చి చాలా కష్టపడింది రా!' అన్నారు.యదార్ధానికి నేను ఆరోజు వెళ్ళి ఆఫీసులో రిపోర్ట్ చేయాలి.ఐతే నాన్న గారి మాట కదనలేక 'సరే 'నన్నాను. ఆ ‘సరే ‘నా జీవితాన్ని ఎంత సరిచేసిందో చెప్పలేను .అందుకే పెద్దలమాట పెరుగ న్నపు మూట ' అన్న సామెతను నిజంచేస్తూ అత్తను ఆమె ఊర్లోదింపే సంఘటన రుజువుచేసింది.

అత్త ఊరుకు వెళ్ళింది తన చిన్నతనంలోనే. మొబైల్లో మ్యాప్ వేసుకుని బయల్దేర గా,అత్త తమ చిన్నప్పటి కబుర్లు చెప్తూ తన అన్న ఐన మానాన్నగారూ తానూ ఎలా ఆడుకుందీ ,పోట్లాడుకుందీ చెప్తూకూర్చుంది.

వసంతత్త చాలాకష్టాలేపడింది. ఆమె అమ్మానాన్నా చాలా గారాబంగా పెంచారు. అప్పటికింకా పెద్దగా పల్లెల్లో చదువులకు అవకాశాలు పెరగలేదు.ఆఊరి పక్కనే ఉన్న హైస్కూల్లో పదోతరగతి వరకూ చదివాక ఇక కాలేజీ చదువు ఒద్దనేసి నగరంలో బ్యాంక్ ఉద్యోగం చేస్తున్న నాగేశం గారికిచ్చి వివాహంచేశారు.

ఆమెకు ఇద్దరుపిల్లలు.మూడేళ్ళ మురళి, ఐదేళ్ళఅరుణ. ఆమె కాపురం మూడు పూవులూ ఆరుకాయలుగా  ఉన్న సమయంలో కారు యాక్సిడెంట్లో నాగేశం పోయారు. బ్యాంక్ లో ఆమెకు సరిపోయే ఉద్యోగం ఇస్తామన్నా ఆమె చేసే స్థితిలోలేనందున , ఆమె కుమార్తె చదువయ్యాక ఉద్యోగం ఇచ్చే లాగా ఒప్పందం చేసుకుని ఆమెను తెచ్చి దగ్గరే పెట్టుకున్నారు తాతగారు. 

తహసీల్దారుగా ఉద్యోగం చేస్తున్న తన నాన్న గారి కి ప్రెమోషన్ మీద దూర ప్రాంతానికి బదిలీకావటంతో   వసంతత్త ను దగ్గరుంచుకుని పిల్లలను చదివిస్తున్న తాతగారిని, బామ్మను వదలి తండ్రి ఉద్యోగరీత్యా దూరం వెళ్ళవలసి వచ్చింది. రామాపురం చేరి ఇంటి గల్లీలోకి వెళ్ళేసరికి జనంఅంతా ఇంటిముందు పోగై ఉన్నా రు.అత్తకు కంగారైంది.కారాగగానేదిగి గేటు దాటి  పరుగుతో వెళ్ళింది.తానూ కారు గిది లోనికెళ్ళాడు.

 "అమ్మా! వసంతమ్మ తల్లీ!ఘోరంజరిగిపోయిందమ్మా! మీరు ఊర్లోలేని విషయం కలిపెట్టి ఆ యదవలు ఇంటె నకాల్నుంచీ దూరి దొరికింది ఎత్తుకుపోయారమ్మా!" అంటూ ఊరి పెద్ద అతత్తో చెప్పాడు.

అత్త తనదగ్గరున్న సింహద్వారం   తలుపుతీసి లోనికెళ్ళగానే అంతా ఆమెతో పాటే లోనికి నడిచారు. అత్త ఒక్కోగదీ  తిరుగుతూ ,తన పడగ్గదిలో ఆగిపోయింది.బీరువా పగలగొట్టి ఉంది. వెనకే వెళ్ళినతాను "  అత్తా! ఖరీదైనవి పోయాయా!"అని అడిగాడు.

"లేదురా! అన్నీ బ్యాంకులోనే ఉంచాను.కొద్దిమొత్తం డబ్బూ, కొద్దిగ వెండి సామా నూ,రోజూ దేవుని కొలిచే వెండిపాత్రలూ మాత్రం పోయాయి."అంది.

"వసంతమ్మ తల్లీ!ఇంతవరకూ మీ ఇంటి ఛాయలకే రానివారు ఈనాడు అడుగు పెట్టారంటే బాగా ఆలోచించాల్సి ఉందితల్లీ. మీరొక్కరే ఇక్కడ ఉండటం  క్షేమం కాదేమో! "అన్నాడుమరో ఊరిపెద్ద. అత్త హాల్లోకి నడిచింది. అక్కడున్న కుర్చీలు, బల్లలమీద కూర్చోమని అందరికీ చెప్పి

"బసన్నా! మీ ఆవిడ్ని అందరికీ టీకాచి తెమ్మను" అని ఇంట్లోనే అన్నిపనులూ చూసే పాలేరుకు చెప్పింది.

"అమ్మా!  నిన్న మా మావగారింటికెళ్ళానమ్మా, నేనింట్లో ఉంటే ఇంతజరిగేదికాదు . యదవల్ని నాకర్రతో చావగొట్టేటోడ్ని.మన్నించండమ్మా!" అన్నాడు బసన్న.

"అసలు మనం ఆలోచించాల్సింది  మన చుట్టుపక్కల ఊర్ల గురించీ.ఎవరైనా ఇత రుల ఇంళ్ళలొ దొంగతనానికి ఎందుకు దూరుతారు?అవసరంకోసం.ఆకలి తీర్చు కోను. ఆ అవసరాలూ,ఆకళ్ళూ తీరితే అంతా గౌరవంగానే బతుకుతారు. దాన్ని గురిం చీ  అంతా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి."అంది అత్త.  ఊరివారంతా "అమ్మా! ముందు పోలీసు రిపోర్టివ్వరా! "అన్నారు.

"దానివల్ల ఏంలాభం ఉంటుందో మీకూ తెలీందికాదు.మనం ముందు వారికి అలాం టిపనులు చేయను అవసరం లేకుండా చేయాలి. దానికోసం మా మూర్తీ ఈ రోజు మనతో ఉన్నాడు.ఇతను ఒక లాయరు.ఆలోచిద్దాం ,అంతా టీ తీసుకోండి" అంది అత్త. అదే శుభముహూర్తం లాగా అత్తా , ఊరిపెద్దలు ఒక ఐదుమందీ నేనూ కలసి చర్చిం చాం.ఆచర్చలఫలితంగా నాకు 'పక్కనే ఉన్న ‘చీకటి తోపు ‘ అనే ఊరిలో  ఉన్న యువకులంతా   చదువూలేక పనులు చేయనూ అవకాశంలేక బలాదూరుగా తిరుగు తూ , అవసరాలకు మరోదిక్కులేక ఇలా తాళాలేసి ఉన్న ఇళ్ళలోదూరి దొరికింది ఎత్తుకెళ్ళి అమ్ముకుని ఆసొమ్ము ఐపోగానే మళ్ళా ఇంకో ఇంట్లో కి దూరడం అలవాటై పోయి, బతుకు తెరువులేక ఇలా బతుకుతున్నారని నాకు అర్ధం అయ్యాక , అత్త ఆలోచనను ఆచరణలో పెట్టను అంగీకరించాను.

అసలు అత్త నన్ను చూసి,కలసి చెప్పాలను కున్నది ఇదేట. మన పిల్లలతోపాటుగా సమాజంలోని పిల్లలనూ బాగుచేసినపుడే ,సమాజంలో సంస్కారమూ, భద్రతా నెల కొంటాయని అత్త ఆలోచన.తప్పు చేసిన వారిని శిక్షించడంకాక ,తప్పు చేసే అవకాశ మే లేకూండా చేయాలనే ఆమె యోచన నాకెంతో నచ్చింది. పెద్దపెద్ద నాయకులు చేయాల్సిన పనిని మా అత్త చేయబూనడం ,దాన్లో నన్నూ భాగస్వామిని చేయడం నాకెంతో గర్వంగా ఉంది.

వెంటనే తాను చకచకా మా తండ్రిగారితోనూ ఆలోచించి ఆఊర్లోనే  ముందుగా ఒక కార్యాలయం స్థాపించడం ,దాన్లో యువకులందరినీ సభ్యులుగాచేర్చి వారికి ఉచిత ఆహారం, యూనిఫాం ఇస్తూ వారికి ఇష్టమైన, వారు ఆసక్తి కనబరిచే రంగంలో శిక్షణ నిచ్చే ఏర్పాట్లు గావించాము.మెకానిజం, డ్రైవింగ్,టైలరింగ్,కార్పెంటరీ, సెక్యూరిటీ లు గా ఎలక్ట్రీషియన్స్ గా ఇంకా అనేక పనుల్లో ఉచిత శిక్షణ ఏర్పాటుచేసి, చదువు కూడా నేర్పిస్తూ ,ఆసక్తి చూపినవారికి కంప్యూటర్ విద్య లోనూ శిక్షణ నిస్తూ ,వారి శిక్ష ణాకాలంలో కొంత వేతనం ఇస్తూ మూడు నాలుగేళ్ళలో  తాము నేరుస్తున్న పనిలో సర్టిఫికేట్స్  పొందినవారిని  నగరాల్లో పనుల్లో పెడుతూ ,ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ పనుల్లో చేర్పించి , వారి జీవితాలకో రుజుమార్గం చూపడంలో తనవంతు పూర్తి బాధ్య త వహించి,ఆర్ధికసాయం అందించిన మా అత్త నిజంగా ఒక మహా మనీషి అని పించింది నాకు..

పదేళ్ళలో ఆఊరి రూపురేఖలేమారిపోయాయి.వారంతాకలిసి వారి ఊరిపేరును 'ఆనందగిరి ' గా బోర్డు వ్రాయించుకుని  మా అత్తచేత దాన్ని ప్రారంభించారు. నేను రికార్డుల్లో పేరుమార్చను నావంతు సాయంచేశాను. ఒక రోజున వారిలో ఒక యువకుడు వచ్చి మా అత్తకాళ్ళ మీదపడి"అమ్మా! మీ ఇంట్లో దొగతనం చేసింది నేనే. మన్నించండి. రోగంతో తీసుకుంటున్న మా అయ్య ప్రాణం  కాపాడనునాకు దొంగతనం కంటే దారిలేకపోయింది.అవి అమ్మి వాటితో వైద్యం చేయించినా మానాయన నాకు దక్కలేదు.పాడుపని చేసి సంపాదించిన సొమ్ము అచ్చిరాదని అర్ధమైంది.మీ వస్తువులు అమ్మగా వచ్చిన సొమ్ము మూడు వేలే.” అంటూ మూడువేలరూపాయలు అత్త పాదాలవద్ద ఉంచాడు.

అత్త వాడి  భుజంతట్టి "నరేష్! నీవు నిజమైన మానవుని గామారడం మాకెంతో సంతోషంగా ఉంది.దీంతో మంచి బట్టలుకుట్టించుకో.నీవు ఆరోజు చేసిన పనే నాకు చాలా కాలంగా చేయాలనుకుంటున్న ఆలోచన అమలు చేయడాన్ని వేగవంతం చేసింది." అంటూ ఆసొమ్ము అతడికే ఇచ్చేసింది.   

***

"సార్ వచ్చేశాం "అంటూ మురళి పిలవడంతో ఆలోచనల్లోంచీ బయట పడ్డాను. నాడ్రైవర్ మురళికూడా ఆ ఊరి యువకుల్లో ఒకడు. ఊరి పేరు మార్చుకుని పదేళ్ళైన సందర్భంగా ఆ ఊరి యువకులంతా చేసుకుంటు న్న వార్షికోత్సవానికి ముఖ్య అతిధులం నేను మాను, అత్తా.     రాష్ట్రానికి పదిమంది మా అత్తలాంటి వాళ్ళున్నా  తమతప్పులకు తాము బాధ్యు లుకాని బాధితులంతా సజావుగా, సత్య మార్గంలో జీవితాలు గడిపి చక్కని సభ్యులుగా జీవించగలరని మాకృషి ఋజువుచేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది..

మరిన్ని యువతరం
pall pilustondi