Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

రూలర్ వచ్చేస్తున్నాడు..

rular comming

నందమూరి బాలకృష్ణ సినిమాలంటే అభిమానులకు పండగే....పవర్ ఫుల్ డైలాగులు..కేకపుట్టుంచే సీన్లు..బాలయ్య సినిమాల్లో పుష్కలంగా ఉంటాయి...డిక్టేటర్...లయన్ లాంటి సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో మార్మోగుతూనే ఉన్నాయి.... అదే కోవలో ఇప్పుడు రాబోతున్న రూలర్ పై ప్రేక్షకులకు అంచనాలు భారీగానే ఉన్నాయి...భారీ సినిమాల దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న రూలర్ చిత్రం ఈనెల 20న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 14న ప్రి-రెలీజ్ ఫంక్షన్ విశాఖలో ప్లాన్ చేస్తున్నారు...

రెండు కోణాల్లో బాలయ్య పాత్ర సాగుతుందని చెప్పాడు దర్శకుడు. మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ చిత్రంలో సెకండాఫ్ లో కుటుంబ అనుబంధాలు కూడా ఉంటాయట...సోనాల్ చౌహాన్, వేదిక నాయికలుగా నటించిన ఈ రూలర్ లో భూమిక, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారట.... అంతకుముందు బాలయ్య, కె.ఎస్.రవికుమార్ ల  కాంబినేషన్ లో వచ్చిన జై సిమ్హా కంటే ఇది ఇంకా బాగుంటుందనీ, మరింత పెద్ద హిట్ అవుతుందనీ ఎదురుచూస్తున్నారంతా..

మరిన్ని సినిమా కబుర్లు
Encounter