Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
young hero

ఈ సంచికలో >> సినిమా >>

మోహన్‌బాబుతో సర్కార్‌

mohanbabu with sarkar

మంచు విష్ణు హీరోగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. వర్మతో విష్ణు సినిమా చేస్తున్నాడనగానే అందరూ ఈ సినిమా గురించే చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఇది రేర్‌ కాంబినేషన్‌ అని చెప్పవచ్చు. అదలా వుంచితే ఈ సినిమాకి సంబంధించి లభిస్తోన్న ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ సమాచారం ఆసక్తికరంగా వుంటోంది.

అదేమిటంటే, ఇది రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నదట, ‘సర్కార్‌’ ఛాయలు సినిమాలో కనిపిస్తాయట. వర్మ కెరీర్‌లో వచ్చిన అద్భుతమైన సినిమాల్లో ‘సర్కార్‌’ ఒకటి. అలాంటి ఛాయలు విష్ణు సినిమాలో కన్పిస్తే అతని అభిమానులకి పండగే. తెలుగులో చాలా కాలం తర్వాత వర్మ సూపర్‌ హిట్‌ కొట్టబోతున్నారని అంచనాలు వేసుకుంటున్నారు ఈ సినిమా గురించి.

‘రక్తచరిత్ర’ తర్వాత ‘అప్పల్రాజు’ సినిమాతో నిరాశపర్చిన వర్మ, ఈసారి అద్భుతమే సృష్టించబోతున్నాడట. విష్ణు కూడా వర్మతో సినిమాని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడని సమాచారమ్‌. ఈ సినిమాలో మోహన్‌బాబు కూడా నటిస్తున్నారు. మోహన్‌బాబు గనుక ‘సర్కార్‌’ పాత్రలో కన్పిస్తే ఇంకేమన్నా వుందా? అది అద్భుతం కాకుండా ఎలా వుంటుంది?

మరిన్ని సినిమా కబుర్లు
the director become to set a way