Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
uyyaalaina jampaalaina

ఈ సంచికలో >> సినిమా >>

ఆ హీరోని మర్చిపోలేని హీరోయిన్‌

in memory of that hero

సాధారణంగా పేరున్న హీరోలను గుర్తు పెట్టుకోవడం తప్ప, గతంలో నటించిన సినిమాల్లోని హీరోలను గుర్తుపెట్టుకోరు అందాల భామలు. లైమ్‌ లైట్‌లో వున్న హీరోలతో కాస్త రాసుకు పూసుకు తిరిగితే అవకాశాలెక్కువ వస్తాయనీ, ఫేడయిపోయిన హీరోలను తలచుకుంటే కెరీర్‌ ముందుకు సాగదని చాలామంది హీరోయిన్లు భావిస్తారు.

కానీ, జూనియర్‌ ఐశ్వర్యారాయ్‌గా పేరొందిన స్నేహా ఉల్లాల్‌ అలా కాదు. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ ఫేం యశో సాగర్‌ని ఇంకా తలచుకుంటూనే వుంది. యశో సాగర్‌తో ఆ సినిమా షూటింగ్‌లో తనకు చాలా మెమరబుల్‌ మూమెంట్స్‌ వున్నాయనీ, అతని అకాల మరణం తనకు చాలా బాధ కలిగిస్తోందనీ ట్వీట్‌ చేసింది స్నేహా ఉల్లాల్‌.

చాలా గొప్ప విషయమే ఇది. కరుణాకరన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ పెద్ద విజయాన్నే సాధించింది. దురదృష్టవశాత్తూ ఇటీవలే యశో సాగర్‌ ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ సినిమా యశో సాగర్‌కే కాక, స్నేహా ఉల్లాల్‌కీ నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.

మరిన్ని సినిమా కబుర్లు
Bezawada again?