Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Book Review - CS Rao Stories

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (డిసెంబర్ 20 - డిసెంబర్ 26) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు శుక్ర, శని, ఆదివారాల్లో చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుట చేత ఆందోళన చెందుతారు. పనుల పట్ల అధికమైన శ్రద్ధను కలిగి ఉండుట అనేది సూచన. ఒకటికి రెండుసార్లు చేస్తేగాని పనులు ముందుకు కదలవు. మానసిక సమస్యలు తప్పక పోవచ్చును నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. సోమ,మంగళ వారాల్లో అనారోగ్యం మూలాన శ్రమను పొందుతారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నూతన ప్రయత్నాలు చేయకపోవడం అనేది సూచన. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఖర్చు పెరిగే సూచనలు కనబడుతున్నవి. బుధ,గురువారాల్లో కొంత మెరుగైన ఫలితాలను పొందుతారు అని చెప్పుకోవచ్చును. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. కుటుంబజీవితంలో సౌఖ్యంను పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఆశించిన ఫలితాలు కలుగుతాయి. వారం మొత్తం మీద అనుకోని ఖర్చులు పొందుటకు అవకాశం కలదు. సాధ్యమైనంత వరకు తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. అపకీర్తిని మూటగట్టుకొనే ఆస్కారం కలదు నిదానంగా వ్యవహరించుట మంచిది. ఇష్టమైన పనులయందు ఆసక్తిని కనబరుస్తారు కాకపోతే వేచిచూసే దోరణి మంచిది. ఉద్యోగంలో మీదైన ఆలోచనలు కలిగి ఉండి ఆదిశగా ముందుకు వెళ్తారు.

వృషభ రాశి
ఈవారం మీరు శుక్ర, శని, ఆదివారాల్లో ఇష్టమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. నచ్చిన పనులను చేపట్టి వాటిని అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. అధికారుల సహాయసహకారాల వలన లాభంను పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభం ఉంటుంది, కాకపోతే ఖర్చును తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. సోమ, మంగళవారాల్లో నూతన ప్రయత్నాలు చేయకండి, నిదానంగా అడుగులు ముందుకు వేయుట మంచిది. బంధుమిత్రులతో మాటపట్టింపులకు పోకపోవడం ఉత్తమం. పనులలో ఆలస్యం అవుతుంది. బుధ,గురువారాల్లో ఆరోగ్యపరమైన సమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు, తగిన జాగ్రత్తలు తీసుకోండి ఉత్తమం. మనోవిచారంను పొందుతారు. ఆశించిన లాభాలు రాకపోవడం వలన ఇబ్బందులు తప్పవు. వారం మొత్తం మీద చేపట్టిన పనులలో కష్టములు పెరుగుటకు అవకాశం ఉంది. ఇబ్బందులు పొందుతారు కావున పనులను తలపెట్టునపుడు జాగ్రత్త అవసరం. అకారణంగా తిరగవలసి రావోచ్చును. సమయానికి భోజనం చేయుట అనేది సూచన. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును. ప్రయాణాలు చేయవలసి రావోచ్చును ఆచారవ్యవహరాల యందు ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారు. ధార్మిక కార్యక్రమాలను చేపడుతారు వాటిలో పాల్గొంటారు.

మిథున రాశి
ఈవారం మీరు శుక్ర, శని, ఆదివారాల్లో సరైన ఆహారాన్ని కనుక తీసుకోక పోతే ఆరోగ్యసమస్యలు తప్పక పోవచ్చును జాగ్రత్త. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం పెద్దల సూచనలు పాటించుట తప్పక మేలుచేస్తుంది. సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుట మంచిది. సోమ,మంగళ వారాల్లో నూతన వస్త్ర లాభంను పొందుతారు. ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. నచ్చిన పనులను చేపట్టు ఆస్కారం కలదు. అనుభవజ్ఞుల సూచనలు పాటించుట చేత లాభంను పొందుతారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు కాకపోతే ఖర్చుల విషయంలో మాత్రం తొందరపాటు పనికి రాదు. బుధ, గురువారాల్లో అనుకొని ఖర్చులను పొందుతారు జాగ్రత్త అవసరం. పనులలో ఓపికను కలిగి ఉండుట అనేది సూచన. వారం మొత్తం మీద వివాదములు కలుగుటకు అవకాశం ఉంది. వివాదములకు మీరు కేంద్ర బిందువు కాకుండా చూసుకోవడం మంచిది. కుటుంబసభ్యులతో చర్చలు చేసాక కాని ఎటువంటి నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది కలిసి వస్తుంది, అలాగే మేలుచేస్తుంది. ఉత్సాహంను కోల్పోకుండా ఉండే ప్రయత్నం చేయండి మంచిది, నిదానం అవసరం.

కర్కాటక రాశి
ఈవారం మీరు శుక్ర, శని, ఆదివారాల్లో భోజనం విషయంలో ప్రత్యేకశ్రద్ధను చూపిస్తారు వాటికి ప్రాధాన్యం ఇస్తారు. పనులలో ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. ఆర్థికపరమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. నూతన అవకశాలు కలిసి వస్తాయి. తోటివారిలో మంచి గుర్తింపును పొందుతారు ఇతరులు మీ సహకారం ఆశిస్తారు. సోమ, మంగళ వారాల్లో స్వల్ప ఆరోగ్యసమస్యలు కలుగుజేసే అవకాశం ఉంది జాగ్రత్త. ప్రయాణాలు చేయకపోవడం అనేది మంచిది. నూతనపనులను చేపట్టకుండా గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుట ద్వారా లాభంను పొందవచ్చును. బుధ, గురువారాల్లో నచ్చిన పనులలో ఆశించిన లాభాలు రావడం చేత సంతృప్తిని కలిగి ఉంటారు. ధనలాభంను పొందుతారు, నూతన ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రయత్నం చేయుట సూచన. నూతన వస్త్రలాభంను పొందుతారు. వారం మొత్తం మీద ప్రయత్నకార్యములలో విజయం ఉంటుంది. నూతన పనులను ఆరంభించాలనే కోరికను కలిగి ఉంటారు. శరీరసౌఖ్యంనకు ప్రాధాన్యత ఇస్తారు. ఉత్సాహంను కలిగి ఉండి సమయాన్ని నచ్చిన విధంగా గడుపుతారు. ధన, ధాన్య సంవృద్ధిని కలిగి ఉండే అవకాశం ఉంది. విందులు, వినోదాల పట్ల మక్కువను చూపిస్తారు. షాపింగ్ చేసే అవకాశం ఉంది.

సింహ రాశి
ఈవారం మీరు శుక్ర, శని, ఆదివారాల్లో బంధుమిత్రులతో మాటపట్టింపులకు పోకపోవడం ఉత్తమం. ధనము విషయంలో జాగ్రత్త వహించక పోతే నష్టపోయే అవకాశం ఉంది. ప్రయాణాల మూలాన అలసి పోయే అవకాశం ఉంది. పనులలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుట చేత ఆందోళన చెందుతారు. దగ్గరివారి అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం లేకపోలేదు. సోమ, మంగళ వారాల్లో ఉత్సాహంను చూపిస్తారు అనుకున్న సమయానికి పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. గుర్తింపు కోసం చేయు ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అభివృద్దిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది అందరిని కలుపుకొని వెళ్ళుట మూలాన ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చును. బుధ, గురువారాల్లో వ్యాపారంనకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయకండి నిదానంగా వ్యవహరించుట మంచిది. ఖర్చులను నియత్రించే ప్రయత్నం చేయుట మంచిది. పనులలో నిదానం అవసరం. వారం మొత్తం మీద బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులలో అధికమైన ధనవ్యయం పొందుతారు వాటిని తగించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. చంచల మస్సును కలిగి ఉంటారు. సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును జాగ్రత్త.
 

కన్యా రాశి
ఈవారం మీరు శుక్ర, శని, ఆదివారాల్లో బంధువులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు వాటికి  ప్రాముఖ్యత ఇస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. మానసిక సౌఖ్యంను కలిగి ఉంటారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకుంటారు అందుచేత లాభంను పొందుతారు. సోమ, మంగళ వారాల్లో అనుకోని ఖర్చులను కలిగి ఉంటారు. ఆలోచనలను అదుపులో ఉంచుకోనుటలో విఫలం అయ్యే అవకాశం కలదు. ప్రయాణాల మూలాన అలాగే పనుల మూలాన అలసి పోయే అవకాశం కలదు. బుధ,గురువారాల్లో  ఉత్సాహంను కలిగి ఉండి పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. మృష్టాన్నభోజన ప్రాప్తిని కలిగి ఉంటారు. మంచి ఆలోచనలు చేయుట వలన నలుగురిలో మీకంటూ మంచి పేరును కలిగి ఉండే అవకాశం ఉంది. వారం మొత్తం మీద తలపెట్టిన పనులలో అనుకోని ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. ప్రయాణాలలో ఇబ్బందులు తప్పక పోవచ్చును వాయిదా పడుట చేత మనోవిచరంను కలిగి ఉంటారు. మాటను పొదుపుగా వాడుట అనేది అన్నివిధాల శ్రేయస్కరం. నిదానంగా ప్రవర్తించుట చేత వివాదములు తగ్గుటకు అవకాశం ఉంది. అధికారుల మూలాన స్వల్ప ఇబ్బందులు పొందుతారు,వ్యతిరేక వర్గం నుండి చిన్న చిన్న ఇబ్బందులు తప్పక పోవచ్చును.

తులా రాశి
ఈవారం మీరు శుక్ర, శని, ఆదివారాల్లో ఇష్టమైన పనులను చేపట్టుట యందు ఆసక్తిని కలిగి ఉంటారు. వాటికి సమయన్ని ఇచ్చు అవకాశం ఉంది. బంధువుల యెడల ప్రీతిని కలిగి ఉంటారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. నూతన ప్రయత్నాలు ఆరంభిస్తారు వాటిలో మంచి ఫలితాలను పొందుతారు. సంతృప్తికరమైన ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. సోమ, మంగళ వారాల్లో భోజనం విషయంలో మీకంటూ ప్రత్యేకమైన ఇష్టాలను కలిగి ఉంటారు వాటికి సమయన్ని ఇచ్చు సూచనలు కలవు. కొన్ని విషయాల్లో నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. బుధ, గురువారాల్లో అధికమైన ఆలోచనలు కలిగి ఉండే అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట అనేది ఉత్తమం. అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది వాటిని తగించుకొనే ప్రయత్నం చేయండి మంచిది. అకారణంగా తిరగడం మూలాన స్వల్ప ఇబ్బందులు తప్పక పోవచ్చును తగిన జాగ్రత్తలు అవసరం. వారం మొత్తం మీద బంధువులను,మిత్రులను కలుస్తారు వారితో మీరు సమయాన్ని సంతోషంగా గడుపుటకు అవకాశం ఉంది. ప్రయత్నకార్యముల యందు విజయంను పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మంచి ఫలితాలను పొందుతారు బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద వద్దు.


వృశ్చిక రాశి
ఈవారం మీరు శుక్ర, శని, ఆదివారాల్లో కుటుంబంలో నిర్ణయాలు తీసుకొనే ముందు అందరిని సంప్రదించుట అనేది సూచన, లేకపోతే వివాదములు కలుగుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో చిన్న చిన్న మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం కలదు, కావున నిదానంగా వ్యవహరించుట మంచిది. ప్రయాణాలు చేయకపోవడం అనేది సూచన. సోమ,మంగళ వారాల్లో కొంత అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అనుకున్న పనులను పూర్తిచేయుట ద్వారా మంచి పేరును కలిగి ఉంటారు. ఆర్ధికపరమైన విషయాలలో నూతన అవకాశాల మూలన ఊరట చెందుతారు. బుధ, గురువారాల్లో బంధువులతో మిత్రులతో సమయాన్ని మీకు నచ్చిన విధంగా గడుపుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి కాకపోతే ఆలోచించి మొదలు పెట్టుట అనేది సూచన. భోజనం విషయంలో సౌఖ్యంను కలిగి ఉంటారు. వారం మొత్తం మీద స్వల్ప ఆరోగ్య సమస్యలు తప్పక పోవచ్చును,శిరోవ్యాది మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. వ్యాపారస్తులు మాత్రం తొందరపాటు నిర్ణయాలు చేయకండి. కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. అర్థికపరమైన విషయాల్లో మాత్రం తొందరపాటు నిర్ణయాలు వద్దు. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో కలిసి పనులను ఆరంభించే అవకాశం కలదు.

ధనస్సు రాశి
ఈవారం మీరు శుక్ర, శని, ఆదివారాల్లో స్వల్ప ఆరోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది, తగిన జాగ్రతలు తీసుకోవడం అనేది మంచిది. సరైన సమయానికి భోజనం చేయుట మూలాన మేలుజరుగుతుంది ఆ దిశగా ప్రయత్నం చేయుట మంచిది. తలపెట్టిన పనులలో పనిభారంను పొందుతారు పనులలో ఆటంకాలు కలుగుటకు ఆస్కారం ఉంది. సోమ,మంగళ వారాల్లో కుటుంబంలో నూతన ఆలోచనలు చేయకండి అందరిని కలుపుకొని వెళ్ళండి. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం తొందరపాటు వద్దు. మరొక ప్రదేశంలో నివసించ వలసి రావొచ్చును. ప్రయాణాలు చేస్తారు వాటికి సమయాన్ని ఇచ్చుటకు అవకాశం కలదు. బుధ,గురువారాల్లో ప్రయత్నాల్లో లాభం ఉంటుంది. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత లాభం ఉంటుంది. పనులలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వారం మొత్తం మీద సమయానికి భోజనం చేయండి. పనులలో ఒత్తిడిని కలిగి ఉంటారు కావున ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట అనేది తప్పక సహాయం చేస్తుంది. బంధువులతో విభేదాలు కలుగుటకు అవకాశం కలదు, నిదానంగా వ్యవహరించుట అనేది సూచన. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పని సరి అనుభవజ్ఞుల సలహాలను పాటించుట మంచిది. పెద్దల సూచనలు తీసుకొని పనులను ఆరంభిస్తే మంచిది.

మకర రాశి
ఈవారం మీరు శుక్ర, శని, ఆదివారాల్లో నలుగురిలో మీరు చేపట్టిన పనుల మూలాన మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికంగా నూతన అవకశాలు పొందుతారు కాని వాటిని నిలబెట్టుకొనే విధంగా ముందుకు వెళ్ళండి మంచిది. అధికారులకు దగ్గర అయ్యే పనులను చేపట్టి ఆశించిన ఫలితాలను పొందుతారు. సోమ, మంగళ వారాల్లో పనులలో శ్రమను పొందుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు ఇష్టం లేకున్నా చేయవలసి వస్తుంది. అలాగే ప్రయాణాల్లో సల్ప ఆరోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. మాటలను పొదుపుగా వాడుట వలన తప్పక మేలుజరుగుతుంది. బుధ, గురువారాల్లో కుటుంభంలో మార్పులు కలుగుటకు అవకాశం ఉంది. అనవసరపు చర్చలకు తావివ్వకుండా తెలివిగా మెలగడం మంచిది. ఉద్యోగంలో నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళట అనేది సూచన. వారం మొత్తం మీద అధికంగా ప్రయాణాలు చేయుట వలన అలసిపోయే అవకాశం ఉంది. మీ దగ్గరివారి ఆరోగ్యం విషయంలో ఆందోళన తప్పక పోవచ్చును. స్థానచలనం కలుగుతుంది, మార్పును కోరుకుంటారు. ఆర్థికంగా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం చేత మేలుజరుగుతుంది. పెద్దలతో మంచి సంబంధాలు కలిగి ఉంటే మేలు జరుగుతుంది.


కుంభ రాశి
ఈవారం మీరు శుక్ర, శని, ఆదివారాల్లో ఉత్సాహంను కలిగి ఉండి పనులలో మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుటకు ఆస్కారం ఉంది. కుటుంబ జీవితంలో సౌఖ్యంను కలిగి ఉంటారు. సంతానమూలక సౌఖ్యంను కలిగి ఉంటారు. ఉద్యోగంలో బాగుంటుంది. అధికారులతో మంచి అనుబంధాలు కలిగి ఉంటారు. సోమ,మంగళ వారాల్లో నలుగురిలో మీరు చేసిన పనుల వలన గుర్తింపును పొందుతారు. ధనాదాయం బాగుంటుంది, చేపట్టిన పనులలో లాభంను పొందుతారు. సౌఖ్యంను పొందుతారు. అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. బుధ, గురువారాల్లో పనులలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం నిధానంగా వ్యవహరించుట అనేది సూచన. వాహనముల విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించుట మంచిది. వారం మొత్తం మీద అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన కలుగు మార్పులు మీకు సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది. నూతన ఆలోచనలు కలిగి ఉండి, ముందుకు వెళ్లి, అనుకూలమైన ఫలితాలు పొందు అవకాశం ఉంది. మధురపదార్థముల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. భోజనంకు ప్రాముఖ్యత ఇస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండుట సూచన.

మీన రాశి
ఈవారం మీరు శుక్ర, శని, ఆదివారాల్లో తలపెట్టిన ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. పనిభారంను కలిగి ఉంటారు. నిదానంగా అడుగులు వేయుట వలన మేలుజరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది సూచన. సోమ, మంగళ వారాల్లో తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. నలుగురితో కలిసి నూతన పనులను చేపడుతారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుటుంది. ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం కలదు. మీ వలన ఇతరులు లాభంను పొందుతారు. కుటుంబంతో సమయాన్ని సంతోషంగా గడుపుటకు ఆస్కారం కలదు. మిత్రులతో కలిసి చర్చలలో పాల్గొనే ఆస్కారం కలదు. బుధ, గురువారాల్లో చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి పేరును  సంపాదించుకొనే అవకాశం ఉంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. దూరపు బంధువుల నుండి సంతోషకరమైన వార్తను వినే అవకాశం కలదు. చిన్న చిన్న పనులకు సమయాన్ని ఇస్తారు. ఉద్యోగంలో మంచి ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది. నూతన అవకాశాలు కలుగుతాయి. వారం మొత్తం మీద బంధుమిత్రులను కలుస్తారు, వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. రాజకీయవ్యవహారాల్లో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉండే అవకాశం ఉంది. అకారణంగా కోపం కలిగి ఉండే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఉత్తమం. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Unnannallu Pattinchukoru