Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
annamayya pada seva

ఈ సంచికలో >> శీర్షికలు >>

శతాయువృద్ధి అంజీర - జంపని జయలక్ష్మి

Health Benefits of Figs or Anjeer

భగవంతుడు మనకు ఇచ్చిన మధుర ఫలాలలో అంజీరా పండు చాల గొప్పది. దీనిని కొన్ని ప్రాంతాలలో అత్తి పండు అని కూడా అంటారు. ఇంగ్లీష్ లో ఫిగ్స్ అని పిలిచే ఈ పండుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

అంజీరా పుట్టినిల్లు అరేబియన్ దేశం. అక్కడ నుండి ఎన్నో దశాబ్దాల  క్రితం మన దేశం వచ్చేసింది. ఇది ఎక్కువ ఉష్ణ ప్రాంతాలలో మరియు శీతల ప్రాంతాలలో బాగా విస్తారంగా పెరుగుతుంది. అత్తి పండు ఎక్కువగా పక్వానికి వచ్చిన పండు కంటే ఎండు ఫలాలుగ బాగా వాడుకలో ఉంది. అత్తి పండు ఎంతో మృదువుగ మధురముగ ఉంటుంది. పండులోని గుజ్జు పంచదారకు బదులుగా వాడుతుంటారు.అంజీర్ పండును కేకులు, జాం, జెల్లీ, జూస్ ఇలా రకరకాలుగా వాడుతుంటారు.

అంజీరలో పీచు పదార్ధం అధికంగా ఉంది. ఫిగ్స్ లో విటమిన్ ఎ, బి1, బి2, కాల్షియం, ఫాస్పరస్, ఇరన్, మాంగనీసు, సోడియం, పొటాషియం, మినరల్సు చాలా అధికంగా ఉంటాయి.

కేవలం అంజీర పండు మాత్రమే కాదు, వాటి ఆకులు కూడా చాలా ఉపయోగపడతాయి. శాస్త్రవేత్తల పరిశోధనల అనంతరం అంజీర పండు కంటే కూడా ఆకుల్లో పోషకాలు అత్యంత అధికంగా ఉన్నాయని కనుగొన్నారు.

అంజీర పండులోని ఉపయోగాలు:-

1.ఇరన్:- ఎండు అంజీరాలో మనకు అత్యంత అవసరమైన ఇరన్ పుష్కలంగా ఉంది.

2.సెక్సు సామర్ధ్యం:- పూర్వకాలం నుండి కూడా అంజీరాను సెక్సు బలహీనతలు ఉన్నవారికి వాడేవారు. పాలల్లో రాత్రంతా ఎండు  అంజీరాలను నానబెట్టి పరగడుపున సేవిస్తే పురుషులలో సెక్సు సామర్ధ్యం బాగా పెరుగుతుంది.

3.ఎముకలు పటిష్టం:-  ఎముకల బలానికి అవసరమయ్యే కాల్షియం అంజీరలో అధిక మోతాదులో ఉంది.

4.షుగరు పేషెంట్లకు దివ్యౌషధం:- అంజీర ఆకులు మరియు పండ్లు షుగరు పేషెంట్లకు అల్పాహారం క్రింద వాడుకొవచ్చు. ఫిగ్స్  ఆకులు  ఇన్సులిన్ మోతాదును  క్రమబద్ధీకరించుటలో వీటి పాత్ర అధికం. బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చెయ్యడంలో ఆకుల పాత్ర అధికం. బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చెయ్యగల పొటాషియం ఆకులలో లభిస్తుంది.

5.లో.బి.పి.:- ఎండు అంజీరలను క్రమం తప్పకుండా సేవిస్తే రక్తప్రసరణ సక్రమంగా ఉండి మెటబాలిజం రేటులో ఒడిదుడుకులు లేకుండా తోడ్పడుతుంది.

6.లో కొలెస్ట్రాల్:- అంజీరలో ఉండే పీచుపదార్ధం పెక్టిన్ వలన మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.

7.కొలోన్ కాన్సర్:- ఇందులో లభ్యమయ్యే పీచుపదర్ధం వలన హానికారక టాక్సిన్స్ ను వ్యర్ధ పదార్ధాలుగా బయటకు పంపివేయబడతాయి. దీనివలన ప్రేగులలో ఏర్పడే కొలోన్ కాన్సర్ ను నియంత్రించవచ్చు.

8.మలబద్ధకం:-  పీచు అధికంగా ఉండటం వలన మలబద్ధకం అనే సమస్య దరి చేరదు.

9.గుండె జబ్బులు:- ఎండు అంజీరాలలో ఫెనాల్, ఒమేగ3 మరియు ఒమెగ6 ఫ్యాటీ ఆసిడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల గుండె జబ్బుల రిస్క్ నుండి బయట పడవచ్చు.

10.హైపర్ టెన్షన్:- ఫిగ్స్ లో పొటాషియుం మరియు అతి తక్కువ సోడియం  ఉండటం వలన హైపర్ టెన్షన్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.

కాకపొతే ఇవి అధిక మోతాదులో తీసుకుంటే డయోరియా కు గురి అవ్వచ్చు. అంతే కాకుండా ఎండుఫలాలలో ఉండే చక్కెరకు పళ్ల గట్టిదనం కూడా తగ్గుతుంది. తగిన మోతాదు వరకు అత్తి పళ్లు తీసుకోవచ్చు.   

మరిన్ని శీర్షికలు
araku valley tourism