Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
haasya dhorani

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (జనవరి 24 - జనవరి 30) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు నూతనప్రయత్నాలు ఆరంభించి వాటిని సకాలంలో పూర్తిచేయగలుగుతారు. నలుగురిలో చేపట్టిన ఆలోచనల వలన గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. వారం మధ్యలో కొంత పనిఒత్తిడి మూలాన అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. ఇష్టమైన వారిని కలిసి వారితో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. ధనమునకు సంబంధించిన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. వారం మొత్తంమీద విధ్యార్థులకు ఆశించిన ఫలితాలు కలిగుతాయి. పెద్దలలో మంచి పేరును తెచ్చుకుంటారు. పోటిపరిక్షలకు ప్రణాళికతో ముందుకు వెళితే విజయం దక్కుతుంది. ఉన్నతవిధ్యను చదివే వారు మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారస్థులు నూతన ఆలోచనలు చేయకపోవడం మంచిది. ధనమునకు సంభందించిన విషయాల్లో బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగులకు అధికారులతో ఉన్న సంబంధాలు ఉపయోగపడుతాయి. స్థలమార్పిడికి అవకాశం ఉంది. గతకొంతకాలంగా ఎదురుచూస్తున్న ట్రాన్స్ఫర్స్ వచ్చుటకు అవకాశం ఉంది. కళారంగంలో ఉన్నవారికి పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. నూతన అవకశాలు కలుగుతాయి.

వృషభ రాశి
ఈవారం మీరు నూతన పనులను చేపట్టుట యందు ఆసక్తిని కలిగి ఉంటారు. నలుగురిలో గుర్తింపును కలిగి ఉంటారు. ఊహించిన దానికన్నా అధికమైన ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది కావున జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి ఉత్తమం. భోజనం విషయంలో అశ్రద్ద వద్దు సమయానికి భోజనం చేయుట మంచిది. పనుల విషయంలో మొదట్లో ఉన్న ఉత్సాహం చివరి వరకు ఉండకపోవచ్చును. వారం మొత్తంమీద విధ్యార్థులు ప్రణాళికను కలిగి ఉండుట మంచిది. సమయపాలన పాటించుట చేత మేలుజరుగుతుంది. గుర్తింపును కోరుకుంటారు. ఉన్నతవిధ్యను అభ్యసించే వారికి బాగుంటుంది. వ్యాపారస్థులకు ఖర్చులు కలిగినను ప్రయత్నాలు కలుగుతాయి అలాగే నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారుల వలన అనుకున్న పనులు నెరవేరుటకు అవకాశం ఉంది. తోటిఉద్యోగులను కలుపుకొని వెళ్ళుట వలన పనులు పూర్తిఅయ్యే అవకాశం ఉంది. కళారంగంలో ఉన్నవారికి పెద్దల చేత లాభంను పొందుతారు. నిదానంగా ముందుకు వెళ్ళితే అనుకున్న పనులు నెరవేరుతాయి.

మిథున రాశి
ఈవారం మీరు ఉద్యోగంలో అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. తలపెట్టిన పనులను పూర్తిచేయుటలో స్వల్ప ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. వ్యతిరేక వర్గం వలన ఇబ్బందులు తప్పకపొవచ్చును. ఊహించని ఫలితాలు కలగుట వలన కొంత ఆందోళన చెందుతారు. ప్రతిపనిని ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయుట మంచిది. వారం మొత్తంమీద విధ్యార్థులు మిశ్రమఫలితాలు పొందుతారు. చదువు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను చూపుట వలన మేలుజరుగుతుంది. ఉన్నతవిధ్యను అభ్యసించే వారికి అననుకూల కాలం, నిదానంగా వ్యవహరించుట సూచన. పెద్దల సూచనలు పాటించుట మంచిది. వ్యాపారస్థులకు మిశ్రమఫలితాలు పొందుతారు. నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మంచిది. ఉద్యోగులకు పనిభారం ఉంటుంది. తలపెట్టిన పనులలో ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది ఓపిక అవసరం. కళారంగంలో ఉన్నవారికి అనుభవజ్ఞుల సలహాలు ఉపయోగపడుతాయి, అలాగే ప్రయత్నం పెంచుట వలన పనులు పూర్తిఅయ్యే అవకాశం ఉంది.

కర్కాటక రాశి

ఈవారం మీరు ఇష్టమైన వారిని కలుస్తారు వారితో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. ధనము విషయంలో ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. నలుగురిలో చేపట్టిన పనుల వలన గుర్తింపును పొందుతారు కాకపోతే ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. చేపట్టిన పనులలో ఉత్సాహం మొదట్లో ఉన్నంతగా చివరివరకు కొనసాగించే ప్రయత్నం చేయండి. వారం మొత్తంమీద విధ్యార్థులు పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. ఓపికను కలిగి ఉండి పనుల పట్ల శ్రద్ధను చూపుట మంచిది. ఉన్నతవిధ్యను అభ్యసించువారు సమయాన్ని వృధాచేయకండి సమయపాలన అవసరం. వ్యాపారస్థులకు ఊహించని ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. పనులలో ఫలితాలు జాప్యంగా వస్తాయి. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. శ్రమను కలిగి ఉన్నను అధికారులలో గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. కళారంగంలో ఉన్నవారికి వ్యతిరేకవర్గం వలన సమస్యలు కలుగుతాయి నిదానంగా వ్యవహరించుట చేత వాటిని ఎదుర్కొనే అవకాశం ఉంది.


సింహ రాశి

ఈవారం మీరు తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ధనధాన్య వృద్దిని పొందుతారు నూతన అవకాశాలు వస్తాయి. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సంతోషంగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు ఈవిషయంలో జాగ్రత్త. అకారణంగా భయంను పొందుతారు. చర్చలలో పాల్గొనుటకు ఆసక్తిని కనబరుస్తారు ఆలోచనలను అందరితో పంచుకొనే ఆస్కారం ఉంది. వారం మొత్తంమీద విధ్యార్థులకు అనారోగ్యం కలుగుటకు అవకాశం ఉంది, ఈ కారణం వలన ఇబ్బందులు పొందుతారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉన్నతవిధ్యను అభ్యసించే వారు ఖర్చులు పెరుగుట వలన ఇబ్బందులు పొందుతారు. వ్యాపారస్థులకు ఆశించిన ఫలితాలు నిదానంగా వస్తాయి. ఖర్చులు పెట్టునపుడు మాత్రం నిదానం అవసరం. పెద్దలను కలిసి నిర్ణయాలు తీసుకోండి మంచిది. ఉద్యోగులకు చేపట్టిన పనులను పూర్తిచేయుట వలన మంచి పేరును సంపాదించుకొనే అవకాశం ఉంది. నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. కళారంగంలో ఉన్నవారికి పెద్దలను కలిసే అవకాశం లభిస్తుంది. వారితో కలిసి నూతన పనులను చేపడుతారు.

కన్యా రాశి
ఈవారం మీరు బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనుల వలన ధనంను నష్టపోయే అవకాశం ఉంది. స్థిరమైన ఆలోచనలు చేయుటకు ప్రయత్నం చేయండి. ఒకావార్త మిమల్ని భాధకు గురిచేసే అవకాశం ఉంది. మాటలను పొదుపుగా వాడుట వలన మేలుజరుగుతుంది. నూతనవస్త్ర లాభంను పొందుటకు అవకాశం ఉంది. వాహనముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. వారం మొత్తంమీద విధ్యార్థులకు బాగుంటుంది కాకపోతే శ్రద్ద, ఓపికను కలిగి ఉంటే ఇంకా మంచి ఫలితాలు పొందుటకు ఆస్కారం ఉంది. ఉన్నతవిధ్యను అభ్యసించే వారికి ఆటంకాలు కలుగుతాయి,ఆలోచనల్లో స్థిరత్వం అవసరం. వ్యాపారస్థులకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. నూతన ఆలోచనలు కలిగి ఉండి వాటిని పూర్తిచేసే దిశగా అడుగులు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు అధికారులతో గల సంబందాలు ఉపయోగపడుతాయి కావున మాటలలో నిదానం అవసరం. కళారంగంలో ఉన్నవారికి కుటుంబసభ్యుల నుండి నూతన విషయాలు తెలిసే ఆస్కారం ఉంది. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు.

తులా రాశి

ఈవారం మీరు తలపెట్టిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుతాయి. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగప్రయత్నాలు ఆశించిన విధంగా ఫలితాలు ఇవ్వకపొవచ్చును, దైవధ్యానం అవసరం మేలుజరుగుతుంది. భోజనం విషయంలో ప్రత్యేకశ్రద్ధను కలిగి ఉంటారు. పెద్దలను కలిసే అవకాశం ఉంది. వారం మొత్తంమీద విధ్యార్థులకు విద్యపట్ల శ్రద్ద తగ్గుటకు అవకాశం ఉంది. ఇతర విషయాలపైన మక్కువను కలిగి ఉండే అవకాశం ఉంది. ఉన్నతవిద్యను అభ్యసించే వారికి నూతన పరిచయాలు కలుగుతాయి వారితో మీ ఆలోచనలను పంచుకునే ఆస్కారం ఉంది. వ్యాపారస్థులకు పనులలో శ్రమను పొందుతారు. ప్రయాణాల వలన నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త. ఉద్యోగులకు ఖర్చులు తప్పక పోవచ్చును అలాగే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చును సర్దుబాటు విధానం అవసరం. కళారంగంలో ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు కొంత వేచిచూసే దోరణి ఆవలంభించుట వలన తప్పక మేలుజరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త.


వృశ్చిక రాశి

ఈవారం మీరు బంధువులను, మిత్రులను కలుస్తారు వారితో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. అధికమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. ధనలాభంను పొందుతారు ఆశించిన లాభం రావడం వలన సంతృప్తిని పొందుతారు. వారం మొత్తంమీద విధ్యార్థులకు కష్టకాలంగా చెప్పుకోవచ్చును, పెద్దల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకొనే ప్రయత్నం చేయుట వలన తప్పక మేలుజరుగుతుంది. ఉన్నత విద్యను అభ్యసించే వారు మాత్రం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు ఆశించిన విధంగా ధనమును పొందుతారు కొత్త పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు అనవసరపు ప్రయాణాలు తప్పక పోవచ్చును వాటి మూలాన అలసిపోయే అవకాశం ఉంది. ఆలోచనలు తగ్గించుకొనే ప్రయత్నం వలన తప్పక మేలుజరుగుతుంది.  కళారంగంలో ఉన్నవారికి ఆర్థికపరమైన అవకాశాలు పెరుగతాయి అదేవిధంగా అనుకోని ఖర్చులు కూడా కలుగుతాయి.


ధనస్సు రాశి

ఈవారం మీరు బంధువులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ఆరంభించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుట మంచిది. ఊహించని ఖర్చులు పొందుతారు తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. పెద్దలను కలుస్తారు వారితో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. స్నేహితుల విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. వారం మొత్తంమీద విధ్యార్థులకు వారిఅభిరుచుల పట్ల మక్కువ పెరుగుతుంది, ఆ దిశగా సమయాన్ని గడుపుతారు. చదువును మాత్రం అశ్రద్ద చేయకండి. ఉన్నత విధ్యను అభ్యసించే వారు మాత్రం శ్రమను పొందుట ద్వార తమ లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు తలపెట్టిన పనులలో లాభం వస్తుంది పెద్దల పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు రాజకీయ రంగాలలో ఉన్న వారితో పరిచయాలు కలుగుతాయి. పనులలో నూతన అవకశాలు పెరుగుటకు అవకాశం ఉంది. కళారంగంలో  ఉన్నవారికి నూతన అవకాశాలు కలుగుతాయి, కాకపోతే అత్యాశను కలిగి ఉంటే మాత్రం నష్టపోతారు జాగ్రత్త.


మకర రాశి

ఈవారం మీరు అధికారులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకొనుట వలన లాభంను పొందుతారు. నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. స్థానచలనం కలుగుటకు ఆస్కారం ఉంది. సమయానికి భోజనం చేయుట మంచిది. చిన్న చిన్న విషయాలకే విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది నిదానంగా వ్యవహరించుట మంచిది. వారం మొత్తంమీద విధ్యార్థులకు చదువు పట్ల శ్రద్ద పెరిగేలా చర్యలు తీసుకోవాలి వారికి అవగాహన పెంచు ప్రయత్నం చేయండి మంచిది. ఉన్నతవిధ్యను అభ్యసించే వారికి మాటల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త. వ్యాపారస్థులకు నూతన అవకాశాలు కలుగుతాయి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన లాభం ఉంటుంది అదేవిధంగా శ్రమను పొందుతారు. ఉద్యోగులకు ప్రయాణాల వలన అనుకోని ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఖర్చులు పెరుగుతాయి తగ్గించుకొనే ప్రయత్నం చేయండి మంచిది. కళారంగంలో ఉన్నవారికి అవకాశాల విషయంలో ఇబ్బందులు తప్పవు అలాగే ధనమునకు సంబంధించిన విషయాల్లో మంచి అవగాహన సహాయపడుతుంది.

కుంభ రాశి

ఈవారం మీరు మంచి ఆలోచనలు కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. తరుచూ ప్రయాణాలు చేయుట వలన స్వల్ప ఇబ్బందులు పొందుతారు కావున వీలయితే వాయిదా వేయుట మంచిది. ఊహించిన దానికన్నా అధికమైన ఖర్చును పొందుటకు ఆస్కారం ఉంది. గతంలో తీసుకున్న రునములకు సంబంధించిన విషయాల్లో మాటను పడవలసి రావొచ్చును జాగ్రత్త. వారం మొత్తంమీద విధ్యార్థులకు చక్కటి ఆలోచనలు ఉండుటకు ఆస్కారం ఉంది. పెద్దల అనుభవాలను పరిగణలోకి తీసుకొని ప్రయత్నం చేస్తే మంచిఫలితాలు వస్తాయి. ఉన్నతవిధ్యను అభ్యసించే వారికి నూతన అవకశాలు కలుగుతాయి అభివృద్ధి ఉంటుంది. వ్యాపారస్థులకు ప్రయాణాలు పెరుగుటకు అవకాశం ఉంది. ఆశించిన విధంగా లాభాలు రాకపోవచ్చును కనుక నూతన ప్రయత్నాలు చేయకండి. ఉద్యోగులకు ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చును అదేవిధంగా అనుకోకుండా విభేదాలు అవుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త. కళారంగంలో ఉన్నవారికి గట్టిప్రయత్నం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతారు లాభం ఉంటుంది.

 

మీన రాశి
ఈవారం మీరు శుభకార్యములలో పాల్గొనే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి దూరప్రదేశం నుండి వార్తను వినే అవకాశం ఉంది. చర్చలకు సంబంధించిన విషయాల్లో పాల్గొనాలనే ఆలోచన కలిగి ఉంటారు. వారం మొత్తంమీద విధ్యార్థులకు శ్రద్ద అవసరం అలాగే ప్రణాళిక కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ద అవసరం. ఉన్నత విద్యను అభ్యసించే వారికి అనుభవజ్ఞుల సలహాలు సూచనలు బాగాఉపయోగపడుతాయి. ప్రణాళిక అవసరం. వ్యాపారస్థులకు పెద్దల పరిచయాలు కలుగుతాయి వారితో కలిసి నూతన ప్రయత్నాలు ఆరంభిస్తారు. ధనమునకు సంబంధించిన విషయాల్లో ఆలోచనలు మారుతాయి. ఉద్యోగులకు ఆలోచనల్లో పరిణతి అవసరం నిదానంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో మీ ఆలోచనలు పంచుకొనుట మేలుచేస్తుంది. కళారంగంలో ఉన్నవారికి శ్రమ పెరుగుతుంది నిదానంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. నూతన అవకాశాలు పెరుగుతాయి.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Handkerchief history