Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
gaddam

ఈ సంచికలో >> సినిమా >>

రిలీజ్‌ అవ్వని సినిమాలు 300 పైనే

300 movies on release pending

ఏడాదికి పెద్ద సంఖ్యలో సినిమాలు విడుదలవడం పట్ల గర్వ పడుతుంటారు తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు. సక్సెస్‌ రేట్‌ తగ్గుతున్నా, ప్రతి ఏడాదీ విడుదలవుతున్న సినిమాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. అలాగే నిర్మితమవుతున్న సినిమాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇది ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైపోయింది.

రిలీజ్‌ అవుతున్న సినిమాలకన్నా, విడుదలకు నోచుకోని సినిమాలే ఎక్కువగా ఉన్నాయని ఓ అంచనా. సుమారు 300 సినిమాలు బాక్సాఫీస్‌ మొహం చూడలేదని తెలుస్తున్నది. డిజిటల్‌ ఫార్మాట్‌లో సినిమాలు రూపొందించడం మొదలైన తరువాత, ప్రతి ఒక్కరూ ప్లానింగ్‌ లేకుండా సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారు.

సినిమా రిలీజ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీసేవారికే నిర్మాణం కష్టమవుతోంటే, ఎలాంటి ప్లానింగూ లేకుండా కేవలం డిజిటల్‌ సహాయంతో లాగించేద్దామనుకుంటే ఇలాంటి కష్టాలే తలెత్తుతున్నాయి. ఎంత డిజిటల్‌ అయినప్పటికీ ఎంతోకొంత ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు కారణంగా కొందరి జీవితాలూ ఆర్థికంగా చితికిపోతున్నాయంట. వీటిల్లో కొన్ని సెన్సార్‌ వరకూ వచ్చి ఆగిపోతున్నాయి. కొన్ని సినిమాలైతే సెన్సార్‌ సభ్యులను టార్చర్‌ పెడ్తున్నాయట. కంటెంట్‌ వీక్‌గా ఉండడమే దానికి కారణం.

మరిన్ని సినిమా కబుర్లు
Ideppudostundo