Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kaakoolu

ఈ సంచికలో >> శీర్షికలు >>

బూంది కర్రీ - పి. శ్రీనివాసు

కావలసిన పదార్థాలు :
కారబూందీ, ఉల్లి పాయలు, పచ్చి మిర్చి, నూనె, నీళ్ళు, ఉప్పు (తగినంత) కారం పొడి (చిటికెడు) మసాలా పొడి.

తయారు చేయు విధానం :
ముందుగా గిన్నెలో నూనె వేసుకుని, కొంచెం వేడి కాగానే ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేయాలి. అవి బాగా వేగాక, తగినంత నీరు పోయాలి. ఉల్లిపాయలకు సరిపడినంత ఉప్పు, చిటెకెడు కారం పొడి వేయాలి. ఆ నీరు మరిగాక కారం బూందీని వేయాలి. నీటిలో ఉడికిన బూందీ కాస్త ఉబ్బుతుంది. రుచికోసం మసలా పొడిని వేసి కలిపితే కారం బూందీ కర్రీ తయారు.

 



 

మరిన్ని శీర్షికలు