Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope February 21- February 27

ఈ సంచికలో >> శీర్షికలు >>

దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణమూర్తి

duradrushtapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!

______________________________________________________________________

ఇంగ్లాండ్ లోని హేంస్టన్ నగరంలోని షాపింగ్ మాల్ లోని ఓ దుకాణానికి తుపాకీతో వెళ్ళి బెదిరించి కొంతడబ్బుని ఓ దొంగ దొంగిలించాడు. అయితే అవి కొత్త నోట్లు, దొంగ వాటితో ఆ దుకాణం పక్క దుకాణంలోనే తన సెల్ ఫోన్ బిల్ ని చెల్లించడానికి దొంగిలించిన ఆ కేష్ నే ఉపయోగించాడు. వాళ్ళకి అనుమానం వచ్చి ఆ నగదుని పోలీసులకి ఇస్తే ఆ పౌండ్ల నోట్ల మీద నంబర్లు దొంగిలించిన నోట్ల నంబర్లలోవే కావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.


బల్గేరియా దేశానికి చెందిన ఓ కస్టమ్స్ ఆఫీసర్, అమెరికన్ అంబాసిడర్ సామానుని చెక్ చేస్తూ అతని సెల్ ఫోన్ ని నొక్కేశాడు. అయితే ఆ ఫోన్ జి.పి.ఎస్. (గ్లోబల్ పొజిషినింగ్ సిస్టం) గల సెల్ ఫోన్. దాంతో పోలీసులముందు అంబాసిడర్ తన లేప్ టాప్ ని తీసి తన సెల్ ఫోన్ లోని జి.పి.ఎస్.ని ఏక్టివేట్ చేస్తే, అది తన ఎదురుగా ఉన్న కస్టమ్స్ ఆఫీసర్ జేబులో ఉన్న సంగతి బయటపడింది.
 

మరిన్ని శీర్షికలు
daachukovadaalu