Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with Swathi

ఈ సంచికలో >> సినిమా >>

బంగారు కోడిపెట్ట చిత్ర సమీక్ష

bangaru kodipetta review

చిత్రం: బంగారు కోడిపెట్ట
తారాగణం: నవదీప్‌, స్వాతి, సంతోష్‌, హర్షవర్ధన్‌, రామ్‌, లక్ష్మణ్‌, సంచలన తదితరులు
ఛాయాగ్రహణం: సాహిర్‌ రాజా
సంగీతం: మహేష్‌ శంకర్‌
నిర్మాణం: గురు ప్రొడక్షన్స్‌
దర్శకత్వం: రాజ్‌ పిప్పాళ్ళ
నిర్మాత: తాటి సునీత
విడుదల తేదీ: 7 మార్చి 2014
క్లుప్తంగా చెప్పాలంటే
వంశీ (నవదీప్‌) ఓ మాజీ దొంగ. భాను (స్వాతి)ని ఇష్టపడ్తాడు వంశీ. ఇద్దరూ ఒకే కంపెనీలో కలిసి పనిచేస్తారు. అనుకోకుండా భాను ఉద్యోగం పోగొట్టుకుంటుంది. భాను ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించడానికి, తాము పనిచేసే కంపెనీలో లూటీకి ప్లాన్‌ చేస్తాడు వంశీ. తమ కంపెనీలో వున్న గోల్డెన్‌ గిఫ్ట్స్‌ని దొంగిలించడానికి భాను, వంశీ సిద్ధపడ్తారు. మరోవైపున పెదబాబు, దొరబాబు (రామ్‌ లక్ష్మణ్‌) కవలలు. వీరిద్దరికీ కొన్ని సమస్యలుంటాయి. వేణు (సంతోష్‌) హీరో కావాలని కలలు కంటుంటాడు. అలా మూడు బ్యాచ్‌లు తమ తమ సమస్యలతో సతమతమవుతుంటారు. ముగ్గురి జీవితాలకీ డబ్బుతో లింక్‌ వుంది. ఈ మూడు జంటలకీ లింక్‌ కలిసిందా? వంశీ ` భాను ప్లాన్‌ చేసిన దొంగతనం వర్కవుటయ్యిందా? అన్నది తెరపై చూడాల్సిన విషయం.

మొత్తంగా చెప్పాలంటే
నవదీప్‌ సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మంచి పాత్ర కూడా దక్కిందతనికి. స్వాతి నటిగా ఇదివరకే ప్రూవ్‌ చేసుకుంది. సహజంగానే క్యూట్‌గా కన్పించే స్వాతి ఈ సినిమాలో ఇంకా క్యూట్‌గా కన్పించింది. సంతోష్‌ తన పాత్రలో ఒదిగిపోయాడు. కాన్ఫిడెంట్‌గా కన్పించాడు. రామ్‌ లక్ష్మణ్‌ ఓకే. మిగతా పాత్రధారులకు పెద్దగా స్కోప్‌ దక్కలేదు.
సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుందిగానీ, పాటలు అంత ఎఫెక్టివ్‌గా లేవు. కథ మామూలుగానే వున్నా, స్క్రీన్‌ప్లేతో సినిమాలో పేస్‌ పెంచారు. డైలాగ్స్‌ బాగున్నాయి. ప్రెజెంటేషన్‌ బావుంది. నేరేషన్‌ ఆకట్టుకుంటుంది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వర్క్‌ ఇంప్రెస్‌ చేస్తుంది. కాస్ట్యూమ్స్‌ సినిమాకి తగ్గట్టుగా వున్నాయి.
ఫన్నీగా సాగే థ్రిల్లర్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్స్‌ బాగానే వస్తున్నాయి తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్య. ఈ తరహా సినిమాలకి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంత అవసరమో, గ్రిప్పింగ్‌గా సినిమా తెరకెక్కించడమూ అంతే అవసరం. ఈ సినిమాకి కావాల్సినవన్నీ వున్నా, సినిమాలో ఎనర్జీ కంటెంట్‌ మిస్‌ అయ్యిందనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో కాస్తంత హ్యూమర్‌, ఇంకొంచెం రొమాన్స్‌ మిక్స్‌ చేసినా, సెకెండాఫ్‌ డల్‌గా సాగుతుంది. ట్విస్ట్‌లు ఆకట్టుకున్నప్పటికీ, జోష్‌ తగ్గడంతో బోరింగ్‌గా అన్పిస్తుంటుంది. థ్రిల్లర్స్‌ని వేగంగా నడిపించడంలోనే దర్శకుడి టాలెంట్‌ బయటపడ్తుంది. అయినాగానీ, సినిమా నీట్‌గా తెరకెక్కిందనే చెప్పవచ్చు. యూత్‌కీ, క్లాస్‌ ఆడియన్స్‌కీ సినిమా నచ్చే అవకాశముంది. ఓవరాల్‌గా యావరేజ్‌ నుంచి ఎబౌ యావరేజ్‌ సినిమా అవుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే
ఓ మోస్తరు థ్రిల్లింగ్‌ ఎంటర్‌టైనర్‌, ఫర్వాలేదంతే

అంకెల్లో చెప్పాలంటే 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka