అన్నదమ్ముల అనుబంధం పాలక ప్రతిపక్షాల్లో తీరికలేదెవరికీ.. ప్రజాసమస్యల్ని వదిలేస్తారు గాలికి! ప్రజాస్వామ్యంలో ఇదే తీరా ఎన్నటికీ? ఓటును విస్మరిస్తే విముక్తిలేదేనాటికీ!!
స్వయంకృతం అవినీతిని ఎక్కిస్తారు అందలం.. నిజాయితీని మెచ్చుకోరు ఈ జనం! అస్తవ్యస్త పరిస్థితిలో అందరం.. ధనస్వామ్య వ్యవస్థలో బందీలం!!