Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Book Review - kotta gonthulu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (ఏప్రిల్ 04 - ఏప్రిల్ 10) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం కలదు. మాటఇవ్వవలసి వస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించుట మంచిది.తలపెట్టిన పనులలో అనుకోని ఆటంకాలు కలుగుతాయి నిదానంగా ముందుకు వెళ్ళు ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు పెరుగుటకు ఆస్కారం కలదు. విద్యార్థులకు బాగుంటుంది నూతన ప్రణాళికతో ముందుకు వెళ్ళుటకు ప్రయత్నాలు ఆరంభిస్తారు. పోటీపరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఉద్యోగులకు పనిభారం తప్పకపోవచ్చును, సమయానికి భోజనం చేయుట మంచిది. వ్యాపారస్థులకు పెట్టుబడులు పెద్దగా అనుకూలించవు కావున తొందరపాటు వద్దు. నూతన ప్రయత్నాలు చేయకండి. కళారంగంలోని వారికి నూతన అవకాశాలు, అలాగే నూతన పరిచయాలు కలుగుట వలన సంతోషంను పొందుతారు.


వృషభ రాశి

ఈవారం మొత్తంమీద నూతన పనులలో సమయాన్ని గడుపుతారు, కొత్తకొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు పొందుటకు ఆస్కారం కలదు. పెద్దలతో కలిసి పనిచేయుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేయవలసి రావొచ్చును ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు చేపట్టుట వలన మేలుజరుగుతుంది. విద్యార్థులకు కష్టపడటం ద్వారా ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ప్రణాలిక అవసరం. సమయాన్ని సద్వినియోగం చేసుకొనే దిశగా అడుగులు ముందుకు వేయండి. ఉద్యోగులకు శ్రమకుతగ్గ ఫలితం లభిస్తుంది అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు బాగుంటుంది పెట్టుబడులకు అనుకూలం. కళారంగంలోని వారికి పనిఒత్తిడి, శ్రమతప్పక పోవచ్చును అందరిని కలుపుకొని వెళ్ళండి.


మిథున రాశి
ఈవారం మొత్తంమీద ఆలోచనలు పెరుగుటకు ఆస్కారం కలదు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. ధనమునకు సంబంధించిన విషయంలో ఆచితూచి వ్యవహరించుట మూలాన అనవసరపు ఖర్చులను తగ్గించుకోవచ్చును. భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారు, విందులలో పాల్గొనే అవకాశం ఉంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కలవు కావున సమయాన్ని వ్యర్థం చేయకండి. పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగులకు ఒకవార్త కొంత భాదను కలిగించేదిగా ఉంటుంది సర్దుబాటు అవసరం. వ్యాపారస్థులకు శ్రమ పెరుగుతుంది, పనులలో అనుకోని ఆటంకాలు తద్వారా చికాకులు పెరుగుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారికి గతంలో అనుకున్నది అవుతుంది, అనుకున్న పనులు ఊరిస్తాయి కాని పూర్తిస్థాయి ఫలితాలు రాకపోవచ్చును వేచిచూసే దొరని మంచిది. 


కర్కాటక రాశి

ఈవారం మొత్తంమీద సంతోషం వెంటనే భాధ విజయం అలాగే అపజయం అన్నట్లు గా ఉంటుంది. ప్రతిపనిని ఆలోచించి చేపట్టుట ద్వారా మేలు జరుగుతుంది. బందుమిత్రులతో కలిసి చేయుపనులలో ఊహించని ఖర్చులు పెరుగుతాయి వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. విద్యార్థులకు మాటతీరు భాధకు గురిచేస్తుంది, వివాదాలు కలుగుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త. ఉద్యోగులకు అధికారుల వలన ఒత్తిడి ఉంటుంది వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. చివరి నిమిషంలో రుణం లభిస్తుంది. కళారంగంలోని వారికి పెద్దల ఆశీస్సులు తోడ్పాటును అందజేస్తాయి, నూతన అవకశాలు లభించుటకు ఆస్కారం కలదు.


సింహ రాశి

ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయల్లో నూతన అవకశాలు లభిస్తాయి. ప్రయాణాలు అనుకూలమైన ఫలితాలు వచ్చుటకు అవకాశం ఉంది. మాటలను పొదుపుగా వాడుట వలన మేలుజరుగుతుంది. బందుమిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. జీవితబాగస్వామితో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు పోటీపరిక్షల పరంగా బాగానే ఉంటుంది ముందుకు వెళ్ళండి. మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు బాగుంటుంది నూతన అవకాశాలు కలుగుటకు ఆస్కారం కలదు. వ్యాపారస్థులకు లాభం ఉంటుంది.  తలపెట్టిన పనులు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది.

 

కన్యా రాశి

ఈవారం మొత్తంమీద ప్రతిపనిని ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయుట వలన మేలుజరుగుతుంది. తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. ప్రయాణాలు ఉపయోగపడక పోవచ్చును. ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు చేపట్టుట వలన తప్పక మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించుట మంచిది. విద్యార్థులకు శ్రద్దఅవసరం జాగ్రత్తగా ముందుకు వెళ్ళుట ద్వారా విజయాలు పొందుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగులకు మాటను జాగ్రత్తగా వాడుట ఇబ్బందులు తగ్గుతాయి. అధికారులతో మాటపట్టింపులకు పోకపోవడం మంచిది. వ్యాపారస్థులకు ఇబ్బందితప్పక పోవచ్చును నిదానం అవసరం. కళారంగంలోని వారికి ఖర్చులు పెరుగుటకు ఆస్కారం కలదు. మనస్పర్ధలు వచ్చుటకు ఆస్కారం ఉంది జాగ్రత్తగా వ్యవహరించుట సూచన.

 
తులా రాశి

ఈవారం మొత్తంమీద అనుకోని ప్రయాణాలు పెరుగుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులలో ఆటంకాలు కలుగుటకు ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట సూచన. నూతన ప్రయత్నాలు ఆరంభించుట మంచిది. మిత్రులతో కలిసి ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రద్దతగ్గుతుంది ఇతర విషయాల పట్ల ఆసక్తిని చూపించే అవకాశం ఉంది. పెద్దలతో మాటపట్టింపులు కలుగుతాయి. ఉద్యోగులకు శ్రమతప్పదు. అనుకున్న పనులు నెరవేరక పోవచ్చును. చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త. వ్యాపారస్థులకు నిదానంగా వ్యవహరించుట సూచన. పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.  కళారంగంలోని వారికి మంచిసమయం, నూతన అవకశాలు లభించే ఆస్కారం ఉంది అందరిని కలుపుకొని ముందుకు వెళ్తారు. 

 

వృశ్చిక రాశి

ఈవారం మొత్తంమీద పనులలో స్వల్ప ఇబ్బందులు తప్పక పోవచ్చును. నూతన పనులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది లేకపోతే ఇబ్బందులు తప్పకపోవచ్చును. సమయాన్ని వృధాచేయకండి ఆలోచనలు అవసరం. విద్యార్థులకు ఓపిక తగ్గుటకు అవకాశం ఉంది, అనవసరమైన విషయాల్లో తలదూర్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు పనిభారం ఉంటుంది ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం మూలాన నిరాశను పొందుటకు అవకాశం కలదు. వ్యాపారస్థుల పెట్టబడులకు ధనం సమయానికి సర్దుబాటు అవుతుంది. మిశ్రమ ఫలితాలు పొందుతారు. కళారంగంలోని వారికి నూతన ఆలోచనలు కలుగుతాయి. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడుపుటకు అవకాశం ఉంది.

 

ధనస్సు రాశి

ఈవారం మొత్తంమీద నూతన ఆలోచనలు కలిగి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి చేపట్టిన పనులను కొంత ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. ఆరోగ్యంను మాత్రం అశ్రద్ద చేయకండి తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. పెద్దల నుండి ఆశించిన వార్తలు వినే అవకాశం కలదు. విద్యార్థులకు బాగుంటుంది ప్రయత్నం చేయుట ద్వార విజయంను సొంతం చేసుకోవచ్చును. ఉద్యోగులకు  మిశ్రమఫలితాలు కలుగుతాయి, అధికారులతో కలిసి పనులకు సమాయన్ని ఇచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు వ్యతిరేకవర్గం నుండి ఇబ్బందులు తప్పక పోవచ్చును సర్దుకొని వెళ్ళండి తప్పక మేలుజరుగుతుంది. కళారంగంలోని వారికి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చును కావున నిదానంగా వ్యవహరించుట సూచన. 


మకర రాశి

ఈవారం మొత్తంమీద ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు పొందుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఒకవార్త మూలాన కొంత భాదను పొందుటకు అవకాశం ఉంది సర్దుబాటు అవసరం. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. శుభకార్యములలో పాల్గొంటారు. విద్యార్థులకు ప్రయత్నం చేయుట ద్వారా ఆశించిన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. పెద్దల సూచనలు పాటించుట మంచిది. ఉద్యోగులకు అధికారులతో చిన్న చిన్న ఇబ్బందులు తప్పక పోవచ్చును. బందుమిత్రులతో కలిసి చర్చలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు బాగనేఉంటుంది చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. కళారంగంలోని వారికి నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది అందరితో సరదాగా గడుపుతారు.


కుంభ రాశి

ఈవారం మొత్తంమీద ఆర్థికపరమైన విషయాల విషయంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. పనుల విషయంలో కొంత ఒత్తిడిని పొందుటకు ఆస్కారం కలదు. సమయానికి భోజనం చేయుట మంచిది. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం సూచన. చిన్న చిన్న పనులకు సమయాన్ని ఇవ్వడం మంచిది. విద్యార్థులకు బాగుంటుంది నలుగురిలో మంచిగుర్తింపును పొందుతారు. పెద్దలతో మీ ఆలోచనలు తెలుపు ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగులకు పనిఒత్తిడి ఉంటుంది నలుగురితో మీ ఆలోచనలు పంచుకొనుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు ఓపిక అవసరం కొంత పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. కళారంగంలోని వారికి బాగుంటుంది చేసిన పనులకు మంచి గుర్తింపు లబిస్తుంది అలాగే విందులలో పాల్గొంటారు. కొన్ని విషయాల్లో పద్ధతులు మరవకండి.


మీన రాశి

ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులలో ఒత్తిడి ఉంటుంది. పనులలో స్వల్ప ఆటంకాలు కలుగుట వలన నిదానంగా పూర్తియ్యే అవకాశం ఉంది. ఉత్సాహంను కలిగి ఉండి మిత్రులతో సమాలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దగా మార్పులు ఉండకపోవ్చును. సమయానికి భోజనం చేయుట ముఖ్యం. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి, చేసే పనులకు సంబంధించిన అవగాహన పెంచుకొనే ప్రయత్నం చేయట మంచిది. ఉద్యోగులకు, అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం ఉత్తమం. నూతన ప్రయత్నాలు చేయకండి నిదానం అవసరం. వ్యాపారస్థులకు పెద్దల వలన పనిభారం ఉంటుంది నిదానంగా వాటిని పూర్తిచేసే అవకాశం ఉంది. కళారంగంలోని వారికి ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. స్త్రీమూలక సమస్యలు తప్పక పోవచ్చును.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Poor Mans Apple