సాధారణంగా ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రాజాకీయ నాయకుల్లాగ కొందరు సినీ జనం కూడా ప్రవర్తిస్తుంటారు. పవర్ ఎటు ఉంటే అటు పరుగెడతారు. కానీ తాము నమ్ముకున్న ఆదర్శాలకు దూరం కాకుండా ఎప్పుడూ తమ ఉనికిని ఉన్న చోటునే చాటుకుంటూ ఉండేవారు కొందరే ఉంటారు. అటువంటి వారిలో దర్శకులు రాజమౌళి ఒకరు. మొదటి నుంచీ ఆయన లోక్ సత్తా పార్టీ కి, ఆ పార్టీ నేత జేపీ కి దగ్గరగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న జేపీ కి ప్రచారంలో కూడా సాయం చేస్తూ ముందుకు వెళుతున్నారు. రాజమౌళితో పాటు ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూడా తమ పత్తా లోక్ సత్తానే అంటున్నారు. ఆయన కూడా ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తూ కొన్ని చోట్ల ప్రసంగాలు కూడా చేస్తున్నారు, పాటలు కూడా పాడుతున్నారు.
ఏది ఏమైనా విద్యాధికుల పార్టీగా గుర్తింపు పొందిన లోక్ సత్తాకి సినీ రంగానికి చెందిన ఈ విద్యాధికులిద్దరూ ప్రచారాస్త్రాలుగా మారారు!
|