Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahitee vanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (ఏప్రిల్ 11 - ఏప్రిల్ 17) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మొత్తంమీద ఆశించిన ఫలితాలు పొందుటకు కృషిచేస్తారు అందులో భాగంగా ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయంలో గతంలో చేసిన ఆలోచనలు కలిసి వచ్చే అవకాశం ఉంది. సహోదరవర్గంతో చర్చలు చేపట్టుటకు అవకాశం కలదు, నూతన నిర్ణయాల పట్ల ఒక నూతన భావనను కలిగి ఉంటారు. ప్రయాణాల పరంగా ఒక ఆలోచన కలిగి ఉంటారు. విద్యార్థులకు మంచిఫలితాల కోసం అధికమైన ప్రయత్నం చేయుట అవసరం. నూతన ఆలోచనలతో ప్రయత్నం కొనసాగిస్తారు. ఉద్యోగులకు మొండినిర్ణయాల మూలాన శారాగాతం తప్పదు, జాగ్రత్తగా ప్రణాళికతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు ఊహించని ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది కావున జాగ్రత్తతో మెలగడం మంచిది. కళారంగంలోని వారికి తలపెట్టిన పనులు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం చేత సంతోషంను కలిగి ఉంటారు.


వృషభ రాశి

ఈవారం మొత్తంమీద నలుగురితో కలిసి పనిచేసే ప్రయత్నం పెంచుట వలన తప్పక మేలుజరుగుతుంది. తలపెట్టు పనులకు సంబంధించి అవగాహన కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది తొందరపాటు పనికిరాదు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. బందువర్గం నుండి నూతన వార్తలు వినే ఆస్కారం కలదు. విద్యార్థులకు మిశ్రమఫలితాలు కొంత భంగపాటు తప్పక పోవచ్చును, అనుకున్న ఫలితాలు రాకపోవడం వలన కొంత నిరాశను పొందుతారు మనోదైర్యంతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగులకు సాధారణ ఫలితాలు యాంత్రికంగా ఉంటుంది పెద్దగా మార్పులు ఉండకపోవచ్చును. వ్యాపారస్థులకు కష్టకాలమే సంతృప్తిని పొందలేరు శ్రమను కలిగి ఉంటారు. కళారంగంలోని వారికి పనుల మూలాన తీరిక లభించక పోవచ్చును పెద్దలతో కలిసి పనిచేయాల్సి వస్తుంది వారికి అనుగుణంగా నడుచుకోండి మంచిది.


మిథున రాశి
ఈవారం మొత్తంమీద పనులలో మొదట్లో ఉన్న ఉత్సాహం చివరకు కొనసాగింపు ఉండకపోవచ్చును. తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి చేసిన ఆలోచనల్లో పెద్దగా పురోగతి కనిపించక పోవచ్చును. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. ప్రయాణాల పరంగా ఆశించిన ప్రయోజనాలు ఉండవు. విద్యార్థులకు ఆలోచనల విషయంగా స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండకపోవచ్చును. ప్రణాలిక అవసరం ప్రయత్నం పెంచుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగులకు అధికారులతో మంచిసంబందాలు అవసరం వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు మిశ్రమఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది నూతన ప్రయత్నాలు చేయకపోవడం వలన మేలుఉజరుగుతుంది. కళారంగంలోని వారికి పెద్దలతో పరిచయాలు కలిసి వస్తాయి నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. 


కర్కాటక రాశి

ఈవారం మొత్తంమీద మాటలను పొదుపుగా వాడుట వలన మేలుజరుగుతుంది. చేపట్టిన పనులు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. అధికమైన ప్రయత్నం పెంచుట చేత ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రయాణాలు మిశ్రమఫలితాలు ఇస్తాయి సాధ్యమైనంత వరకు తొందరపాటు నిర్ణయాలు చేయకండి మంచిది. ధనమునకు సంబంధించిన విషయాల్లో మాత్రం ఖర్చులు కలుగుట మూలాన కొంత చికాకు తప్పక పోవచ్చును. విద్యార్థులకు ఒకటే సూచన పెద్దల ఆలోచనలు అమలు చేయుట మూలాన అనుకూలమైన ఫలితాలు పొందగలరు. ఉద్యోగులకు బాగుంటుంది అధికారులతో మంచిసంబందాలు ఏర్పడుతాయి అవి మీ ఎదుగుదలకు ఉపయోగపడుతాయి. వ్యాపారస్థులకు వేచిచూసే దోరణి మంచిది అనవసరపు ఖర్చులు తగ్గించుకోండి. కళారంగంలోని వారికి ఆర్థికపరమైన పరమైన విషయాల్లో బాగుంటుంది స్థిరాస్తి కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది.


సింహ రాశి

ఈవారం మొత్తంమీద విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది వాటిపట్ల మక్కువను కలిగి ఉంటారు. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. కుటుంబంలో తీసుకొనే నిర్ణయాల విషయంలో మాత్రం పెద్దలను సంప్రదించుట వలన మేలుజరుగుతుంది లేకపోతే విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు రాకపోవడం వలన నిరాశను పొందుతారు. పోటీపరిక్షల విషయంలో శ్రమను పెంచుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగులకు మాటతీరు చాలాఅవసరం అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు శ్రమపెరుగుతుంది కాకపోతే అనుకూలమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారికి కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది కావున ఇంటా బయట జాగ్రత్తతో మెలుగుట వలన మేలుజరుగుతుంది నిదానం అవసరం.

 

కన్యా రాశి

ఈవారం మొత్తంమీద ప్రయాణాల విషయంలో నిర్ణయం మారుతుంది నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి కొత్త కొత్త పనులను చేపట్టుటకు అవకాశం ఉంది.  ఆలోచనలు పెరుగుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు కష్టపడుట అనేది అలవర్చుకోండి పెద్దల సూచనలు పాటించుట అనేది మంచిది. విధ్యకు ప్రాధాన్యం ఇవ్వండి మంచిది. ఉద్యోగులకు అధికారులతో పెద్దగా సఖ్యత ఉండదు, ఫలితాలు పొందలేరు సర్దుబాటు అవసరం. నూతన ప్రయత్నాలు మామూలు ఫలితాలు ఇస్తాయి. వ్యాపారస్థులకు నిదానమేమంచిది అనుభవజ్ఞుల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. కళారంగంలోని వారికి బాగుంటుంది పెద్దలతో ఉన్న సంబందాలు మీ ఎదగుదలకు ఉపయోగపడుతాయి.

 
తులా రాశి

ఈవారం మొత్తంమీద చేపట్టుపనుల విషయంలో శ్రద్ద అవసరం. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. పెద్దల సూచనలు పాటించుట మూలాన మేలుజరుగుతుంది. బంధుమిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు, భోజన సౌఖ్యంను కలిగి ఉంటారు. ప్రణాళికతో ముందుకు వెళ్ళుట చేత విజయంను సొంతం చేసుకోవచ్చు. విద్యార్థులకు శ్రమతప్పదు, ఫలితాలు వ్యతిరేకంగా వచ్చుటకు అవకాశం ఉంది అయినను శ్రద్ధను కోల్పోక ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగులకు దూరదృష్టి అవసరం బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మంచిజరుగుతుంది. వ్యాపారస్థులకు నూతన ఆలోచనలు మొదలుఅయ్యే అవకాశం ఉంది. సాధ్యసాద్యాలు ఆలోచించి ముందుకు వెళ్ళండి మంచిది. కళారంగంలోని వారికి వినోదాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది నూతన అవకశాలు పొందుతారు సద్వినియోగం చేసుకోండి. 

 

వృశ్చిక రాశి

ఈవారం మొత్తంమీద ఆరంభంలో చేపట్టిన పనులను సమయాన్ని వృధాచేయకుండా పూర్తిచేయండి ఎందుకంటే వారం చివరలో ఇబ్బందులు తప్పకపోవచ్చును. మిత్రులతో కలిసి నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. శుభకార్యముల విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ఇతరవిషయాల పట్ల దృష్టి పెరుగుతుంది జాగ్రత్త. పెద్దలతో ఆలోచనలు పంచుకోండి వారిసూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగులకు బాగుంటుంది కాకపోతే వివాదములకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు బాగుంటుంది ఆర్థికపరమైన లాభం ఉంటుంది అనుకున్న పనులు నెరవేరుతాయి. కళారంగంలోని వారికి కుటుంభపరంగా సంతోషకరమైన మార్పులు కలుగుటకు అవకాశం ఉంది. సంతోషంగా సమయాన్ని గడుపుతారు కాకపోతే శ్రమతప్పదు.

 

ధనస్సు రాశి

ఈవారం మొత్తంమీద ప్రణాళిక బద్దంగా ముందుకు వెళితే విజయం పొందుటకు అవకాశం ఉంది. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరంగా బాగుంటుంది ముందుకు వెళ్ళండి. విద్యార్థులకు పోటీపరిక్షలలో విజయంను పొందుటకు అవకాశం ఉంది కావున ప్రయత్నం పెంచుట చేత లక్ష్యాన్ని చేరుకోవచ్చును. ఉద్యోగులకు అధికారులతో స్వల్ప ఇబ్బందులు తప్పవు కాకపోతే శ్రమను పొందినను పనులను పూర్తిచేయుట ద్వారా ఊరట చెందుతారు. వ్యాపారస్థులకు వ్యతిరేకుల మూలన చిన్న చిన్న ఇబ్బందులు తప్పకపోవచ్చును సర్దుకుపోవడం ఉత్తమం. కళారంగంలోని వారికి ఆశించిన స్థాయిలో మార్పులు రాకపోవచ్చును కావున వేచిచూడటం ద్వార మేలుజరుగుతుంది. నిదానంగా ముందుకు వెళ్ళండి మంచిది. 


మకర రాశి

ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది లబ్దిని పొందుటకు అవకాశం కలదు. నూతన నిర్ణయాలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు విందులలో పాల్గొనే అవకాశం ఉంది. విద్యార్థులకు బాగుంటుంది నిర్ణయాల విషయంలో మాత్రం తొందరపాటు వద్దు. బాగాఆలోచించి ముందుకు వెళ్ళండి మేలుజరుగుతుంది. ఉద్యోగులకు బదిలీలు అయ్యే అవకాశం ఉంది మేలుజరుగుతుంది. ధనమువిషయంలో మాత్రం ఆశించిన మార్పులు కలుగుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు పర్వాలేదు అన్నవిధంగా ఉంటుంది. నూతన ఆలోచనలు చేయకండి తొందరపాటు వద్దు. కళారంగంలోని వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి, వాటిమూలాన నలుగురిలో గుర్తింపు వస్తుంది కాకపోతే వివాదములు కొనితెచ్చుకోకండి.


కుంభ రాశి

ఈవారం మొత్తంమీద చిననాటి మిత్రులను కలిసే అవకాశం ఉంది వారితో కలిసి సమాలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో చేపట్టిన పనులు లాభంను కలుగజేయుటకు అవకాశం ఉంది. బంధువులు చెప్పిన ఆలోచనలు పాటించే విషయంలో మరొకమారు ఆలోచనచేయుట మంచిది. విద్యార్థులకు నూతన అవకశాలు కల్గుతాయి. సమయాన్ని వినియోగం చేసుకోవడం ద్వారా మేలుజరుగుతుంది. పోటీపరిక్షలకు ప్రాధాన్యం ఇవ్వండి. ఉద్యోగులకు మాటతీరు సరిగా లేకపోతే విభేదాలు పొందుటకు అవకాశం ఉంది. అధికారులతో నిదానంగా వ్యవహరించుట సూచన అవసరమైతే ఒక మెట్టు తగ్గుట ఉత్తమం. వ్యాపారస్థులకు మిశ్రమఫలితాలు ఉంటవి ఆర్థికపరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయకండి. కళారంగంలోని వారికి బాగుంటుంది సమయాన్ని సరదాగా గడుపుతారు నచ్చిన వారితో సమయాన్ని గడుపుతారు.


మీన రాశి

ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులలో ఉత్సాహంను కలిగి ఉండి పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి చేపట్టిన పనులను పూర్తిచేస్తారు వాటిమూలన లబ్దిని పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వార్తను వినే అవకాశం కలదు. విద్యార్థులకు మిశ్రమంగా ఉంటుంది ప్రయత్నం పెంచుట ఉత్తమం మంచిఫలితాలు కలుగుతాయి. ఉద్యోగులకు శ్రమతప్పదు అలాగే గుర్తింపు ఆశించిన వేగంగా రాకపోవచ్చును వేచిచూడటం మంచిది. నిదానంగా ఫలితాలు కలుగుటకు అవకాశం కలదు. వ్యాపారస్థులకు బాగుంటుంది కాకపోతే ఖర్చుల విషయంలో నిదానం అవసరం. నూతన ఆలోచనలు చేస్తారు. కళారంగంలోని వారికి ఖర్చులు పెరుగుతాయి అలాగే స్త్రీలకు సంబంధించిన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. వివాదములు తగ్గుటకు ఆస్కారం ఉంది.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
marupu