Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sreenu vaitla revrsed the formula

ఈ సంచికలో >> సినిమా >>

అలనాటి అందాల తార బిజీ బిజీ

veteran beauty is busy

‘మిర్చి’ సినిమాలో నదియాని చూసి హీరోయిన్లను తలపించే ఆమె అందం ముందు, ఆమె వయసు అస్సలు కన్పించలేదని ప్రేక్షకులే అనుకున్నారు. అంతటి అందం ఆమెది. ప్రభాస్‌కి తల్లిగా కన్నా, అక్కలా ఆమె పాత్రను తీర్చిదిద్ది ఉంటే బాగుండేదని కొందరి మదిలో ఆలోచన మెదిలిందంటే అది వారి తప్పు కాదు.

ఇప్పుడీ నదియ, ‘అత్తారింటికి దారేదీ’ సినిమాలో నటిస్తోంది. పవన్‌కళ్యాణ్‌ ఈ సినిమాలో హీరో. టైటిల్‌ ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి వుంది. ఒకప్పుడు ఆంటీ పాత్రలంటే పెద్దగా గ్లామర్‌కి ప్రాధాన్యం వుండేది కాదు. నగ్మా, రమ్యకృష్ణ వంటివారు అత్త పాత్రల్లో తమ గ్లామర్‌ని ఒలకబోసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.

వారితో పోల్చితే నదియ చాలా క్లాస్‌గా కన్పిస్తోంది. పైగా క్లాస్‌ లుక్‌ వున్న సినిమాలే ఇప్పుడు ఎక్కువగా వస్తుండడంతో కాస్త వయసు మీద పడ్డ ఆంటీ పాత్ర అంటే ముందుగా నదియానే ప్రిఫర్‌ చేస్తున్నార్ట తెలుగు సినీ పరిశ్రమలో. ఇప్పుడు అస్సలేమాత్రం ఖాళీ లేకుండా వుంది నదియ కెరీర్‌. హీరోయిన్‌గా నటిస్తున్న కాలంలో కన్నా ఆమె ఇప్పుడే ఎక్కువ బిజీగా వుందని చెప్పొచ్చు.

మరిన్ని సినిమా కబుర్లు
puri again with mahesh