Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

మిణుగురులు చిత్రానికి ఆటా పురస్కారం

ATA Honour for

ఆయోధ్య కుమార్ కృష్ణం శెట్టి స్వీయ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ' మిణుగురుపురుగులు '. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ చిత్రం బెంగుళూరులో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ భారతీయ చిత్రం గా, వంశీ ఇంటర్ నేషనల్ సంస్థ మొట్టమొదటి సారిగా నెలకొల్పిన అక్కినేని వంశీ అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో పురస్కారం ఈ చిత్రానికి దక్కింది. లలిత కళల విభాగం కింద అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వారు అయోధ్య కుమార్ కు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. జూలై 3 నుండి 5 వరకు అమెరికాలోని ఫిలడెల్ఫియా లో జరగబోయే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అయోధ్య అందుకోనున్నారు.అయోధ్య కుమార్ దర్శకత్వం వహించనున్న తదుపరి చిత్రం ' పక్కా కమర్షియల్ సినిమా ' పోస్టర్ ని ఇటీవల విడుదల చేశారు.

మరిన్ని సినిమా కబుర్లు
Srikrishna Devaraya  Honour for Mohan Babu