Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
big heroine for small movies

ఈ సంచికలో >> సినిమా >>

బాలయ్యబాబు డెడికేషన్‌ అలాంటిది

That's balayyaa's dedication

షూటింగ్‌లో తగిలే దెబ్బల్ని లెక్క చేసే రకం కాదు బాలకృష్ణ. దెబ్బ తగలడం మామూలే అని తేలిగ్గా తీసుకోవడం బాలకృష్ణకే చెల్లింది. కొత్త సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణ, చికిత్స అనంతరం కోలుకున్నారు. సినిమా అన్నాక రిస్క్‌ చేయాలి కదా అని గాయం గురించి నవ్వుతూ మాట్లాడారు ఆయన. గాయం చిన్నదే అని చెబుతూ, సినిమా సినిమాకీ ఓ గుర్తు ఇలా ఉంటుంది అని జోక్‌ చేశారు.

‘గాయం కూడా ఓ సెంటిమెంట్‌లా ఉంది’ అని బాలయ్యబాబు చెప్పేసరికి, అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు నటవారసుడిగా సినిమాల్లోకొచ్చిన బాలకృష్ణ, స్టార్‌ హీరోలలో ఒకరిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారంటే అది ‘తెగువ’ లేకుండా సాధ్యం కాదు.

ఏ సినిమా చేసినా వంద శాతం ఎఫర్ట్‌ పెట్టే బాలయ్యబాబుతో సినిమా చేయాలంటే యంగ్‌ డైరెక్టర్లు, సీనియర్‌ డైరెక్టర్లూ ఉత్సాహపడతారు. ఆయన తరం హీరోల్లో ఇప్పుడెవరూ అంత ఎనర్జీతో డాన్సులు వేయలేకపోతున్నారంటే అది ఆయన డెడికేషన్‌కి నిదర్శనం. గాయం సెంటిమెంట్‌ అని సరదాకే అన్నారో ఊరికే అన్నారోగాని అది నిజంగా సెంటిమెంట్‌ అయి, బాలయ్యబాబు కొత్త సినిమా రికార్డులు తిరగరాసేలా ఉంటుందేమో.

మరిన్ని సినిమా కబుర్లు
can saptagiri reach sunil stage?