తొలి సినిమా ఇచ్చిన విజయంతో ఇంకా నమ్మకంతో ‘కొబ్బరిమట్ట’ అనే సినిమా చేస్తున్నాడు సంపూర్ణేష్‌బాబు. పెదరాయుడు గెటప్‌లో కనిపిస్తున్నాడు ఈ సినిమాలో ఆయన. ‘హృదయకాలేయం’ డైరెక్టర్ స్టీవెన్ శంకర్ ఈ చిత్రానికి రూపక్ రోనాల్డ్ దర్శకుడు. ఒకే సినిమాలో ఏడుగురు హీరోయిన్లతో సంపూర్ణేష్ రొమాన్స్ చేయనుండడం ఈ ‘కొబ్బరిమట్ట’ ప్రత్యేకత.
‘హృదయకాలేయం’ హిట్ అయిన తీరు చూసి, ‘కొబ్బరి మట్ట’కు శాటిలైట్ రైట్స్‌కి క్రేజ్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నదట. అందుకే సినిమాకి రికార్డు మొత్తం చెల్లించి ఓ ప్రముఖ ఛానల్ ఇప్పటికే రైట్స్ సొంతం చేసుకుందని వినికిడి. అమృత ప్రొడక్షన్స్, సంజన మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి
|