Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
agent ekambar

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ : తన గతం గురించి హరికి చెప్పడం ప్రారంభిస్తుంది మేఘన. అత్తారింట్లో తాను పడిన కష్టాలు.. తనను పనిమనిషిగా చూసిన అత్తగారి గురించీ, ఏపనీ చెయ్యక తనపైనే బాధ్యతలు మోపిన భర్త వినయ్ గురించీ ఆమె చెప్తూంటే విని ఆశ్చర్యపోతాడు హరి..........................

................................................ ‘‘ఒకరికొకరు దగ్గరవ్వాలన్నారు... ఒక ఆడదానిగా నేనే ముందుకు వెళ్లి... నాకన్నా... నా చిన్నా ఎంత అలసిపోతున్నావు. ఎంత పనిచేస్తున్నావు అని దగ్గరకు తీసుకుని లాలించాలా? లేక రోజు పని వత్తిడి, ఎక్స్ ట్రా అసైన్ మెంట్లు, ఇంటి పనులు, పిల్లవాడి బాధ్యతలు భరిస్తున్న నన్ను ఇంటి పెద్దగా ఒక మగవాడిగా వినయ్నన్ను దగ్గరకు తీసుకోవాలా? చెప్పండి... చెప్పండి...’’

‘‘భరించు వాడు భర్త అన్నారు... తప్పకుండా ముందుకు వచ్చి, తన జీవిత భాగస్వామియైన భార్యని తన బలమైన చేతుల్లోకి తీసుకుని, సాంత్వన, రక్షణ కల్పించాల్సింది భర్తే... నాకు తెల్సిన కొంతమంది భర్తలున్నారు. పొద్దున్నే లేచి వాళ్ల పని వాళ్లు చేసుకోవడమే కాక, భార్య డ్యూటీకి వెళ్లడానికి వీలుకలిగించేలా ఆమెకు ఏమేం పనుల్లో సహాయం అవసరమో గుర్తించి అవన్నీ చేసేసి, మళ్లీ సాయంత్రం భార్యని పికప్ చేసుకుని, ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆమె ఆనందంగా నిద్రించేటట్లుగా చేసేవాళ్లున్నారు.

అసలు వంట కూడా చేసేసి, అంట్లు కడిగేసి భార్యతో చూడు నువ్వు కష్టపడకూడదని అన్నీ చేసేసాను అని చెప్పి, ఆమె కళ్లల్లో కనబడే కృతజ్ఞాతాపూర్వక ఆనందాన్ని ఫుల్  ఎంజాయ్ చేసే భర్తల్నీ చూసాను. దురదృష్టవశాత్తూ... సర్వం  తానే అయ్యి కుటుంబాన్ని సాకుతున్న భార్యని సూటిపోటి మాటలతో హింసించే భర్తని ఇప్పుడు చూస్తున్నాను.

సరేకానండీ... మర్చిపోయాను... కొట్టడం దేనికి?’’

‘‘అలసి, సొలసి ఇంటికి వచ్చి ఇల్లంతా సర్దుకుని, వండి వార్చి, అసైన్ మెంట్లు కంప్లీట్ చేయాలనే ఆతృతా వరదలో కొట్టుకుపోతున్న నన్ను దగ్గరకు తీసుకోవాలనే ప్రయత్నం చేసేవాడు వినయ్... కానీ నాలో స్పందన ఉండేది కాదు.... బహుశా అది నా పొరపాటేనేమో...?’’‘‘ఓహ్... ఒక డాక్టరుగా నేను దానికి సమాధానం చెప్పగలను... ఒక కర్తవ్యాన్ని, భారాన్ని, బాధ్యతని స్వీకరించి దాన్ని సాధించాలనే పట్టుదలతో ఒక ఒరవడిలో కొట్టుకుపోతున్న వారిలో శారీరక స్పందనలు తగ్గిపోవడం సహజమే. మీ తప్పేమీ లేదు.’’

‘ఏదైనా కానివ్వండి... నా ఖర్మ బాగా లేదు... నా దగ్గర నుంచి సరియైన సహకారం లేకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయేవాడు వినయ్... చితకబాదే వాడు. సున్నితమైన ప్లేస్లలో కాలితో తన్నేవాడు... కాలక్రమేణా అన్నీ అలవాటయిపోయాయి.’’ మేఘన కంఠంలోని వేదన, ఆవేదన ప్రస్పుటంగా వినిపించి, ఆమె కళ్లల్లోని కన్నీళ్లలో ప్రతిబింబించాయి.

చాలా ఇబ్బందిగా ఫీలయ్యాడు హరి... అనవసరంగా ఈమెని కదిపి ఎంతో బాధపెట్టినట్లున్నాను అనుకున్నాడు.

‘‘సరేలెండి... లేనిపోని విషయాలు గుర్తుకు తెచ్చుకుని బాధపడకండి’’ అంటూ అనునయించబోయాడు.

అతని ప్రయత్నాలు, మాటలు ఏమాత్రం ఫలించలేదు.. ఆమె కంటినుంచి ఆశ్రువులు ధారగా వర్షిస్తూనే ఉన్నాయి...‘కలకంఠికంట కన్నీరొలికిన’ అనే మాట గుర్తుకు వచ్చింది హరికి.కనుకొలకులలో కన్నీరా?... కనులే కొలనులయ్యాయా? అనుకుంటూ ఆమెనే దీర్ఘంగా చూస్తున్నాడు. కాసేపటికి ఇక లాభం లేదని, ఒక్క ఉదుటున కూర్చీలోంచి లేచి నిల్చుని దగ్గరగా వెళ్ళి, కొంచెం గట్టిగా ఫ్లీజ్ కంట్రోల్ మేఘన గారు అన్నాడు.

అతనే  ముందడుగువేసి ఆమెను దగ్గరకు తీసుకన్నాడో లేక ఆమే అతన్ని దగ్గరకు తీసుకుందో ఇద్దర్లో ఎవరికీ ఏమీ తెలియదు. ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియకుండానే ఒకరికొకరు దగ్గరయ్యారు. ఒకరిలో ఒకరు తమకంతో మమేకమైపోయారు.

దఢ్... దఢ్... దఢా... ధడధడా..... ధడ్.... ధడ్...... ధడ... ధడా...

విపరీతమైన వేగంతో రైలు పరిగెడుతున్న శబ్దం... చెవులు బద్దలయ్యేటట్లుగా వినబడుతున్నది.మంచి నిద్రలో ఉన్న హరి దిగ్గున లేచి కూర్చున్నాడు. క్షణంపాటు అయోమయానికి గురయ్యాడు... ఎక్కడున్నాడో ఏమిటో ఏమీ అర్థం కాలేదు. చుట్టూ చీకటి పరుచుకుని ఉన్నది.ఒంటిమీద చొక్కా లేదు.

చేతులతో అటూ ఇటూ తడమగా సెల్ ఫోన్ చేతికి తగిలింది. బటన్నొక్కగానే వెలుగువచ్చి సమయం రాత్రి రెండు గంటలు చూపించింది....మేఘన... మేఘన.... అంతా లీలగా గుర్తుకొచ్చింది....

ఏదీ మేఘన ప్రక్కనే ఉండాలిగా... ఏమైంది?

దిగ్గున మంచం మీద నుండి దిగి, పెద్దగా అరుస్తూ ఇల్లంతా కలియ దిరిగాడు... మధ్య మధ్యలో సెల్ ఫోన్ లైట్ ఆరిపోవడం, దాన్ని మళ్లీ వెలిగించడం...

ఇంట్లో ఎక్కడా లేదు...

ఏమైపోయింది?

ఇంటి బయటకు వచ్చాడు... వరండాలో లేదు.... ఎక్కడికెళ్లిపోయింది..?

ఇంటి చుట్టూ కలియ తిరుగుతూ.... ఇంటి వెనక్కి వెళ్లాడు... ఇంటి వెనుక భాగరంలో చూరు... చూరుకున్న పెద్ద అడ్డు వెదురుబొంగు... ఆ బొంగుకు చీర పమిటతో ఉరివేసుకున్న సన్నని స్త్రీ శరీరం కంటబడ్డాయి.

ఓహ్.... షిట్... ఎంతపని జరిగిపోయింది? అనవసరంగా ఆమె బాధలన్నీ గుర్తుచేసి, బతుకు మీద విరక్తి కలిగేలా చేసానా..? నాదేనా తప్పు?లేక ఏదో తప్పు చేసానన్న భావనతో తనే ఉరిపోసుకుందా? మర్డర్ కేసులో జైలుకు వెళ్ళాల్సివస్తుందా..?

చిగురుటాకులా వణికిపోతూ వెన్నులోంచి తన్నుకొస్తున్న భయాన్ని తొక్కిపడుతూ గబగబా పరిగెత్తి ఆమె మెడపై బరువు పడకుండా శరీరాన్ని పైకి లేపాడు. అక్కడే ఉన్న విరిగిపోయిన చిన్న స్టూల్ పైకి ఆమె శరీరాన్ని మోస్తూనే ఎక్కి, వెదురు బొంగుకు ముడేసిన పమిటను తీసేసాడు...

ఈ హడావుడిలో మోస్తున్న శరీరంతోపాటు దబ్బున నేలపై పడ్డాడు. నెమ్మదిగా కూడదీసుకుని ఆమె శరీరాన్ని మోసుకుంటూ తీసుకొచ్చి మంచంపై పడుకోబెట్టాడు.

ఆమె గుండెలపై తన తల గట్టిగా నొక్కి ఆమె గుండె కొట్టుకుంటుందో లేదో వినడానికి ప్రయత్నించాడు. నాడి పరీక్షిస్తున్నాడు. సిస్టమేటిక్ గా ఒక డాక్టర్ చేసే పరీక్షలేమీ చేయడం లేదు హరి. కంగారుతో... వణుకుతో అయ్యో... ఈ మనిషికేమైపోయిందో అనే ఆతృతతో ఒక సామాన్యుడు, ఏ మాత్రం వైద్యం తెలియనివాడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తిస్తున్నాడు.

ఆమె పాదాలను, అరచేతులను, తన అరచేతులతో రుద్దుతూ ఆమెలో చేతనాన్ని రప్పించడానికి కృషి చేస్తున్నాడు. జగ్యులార్వీన్స్... మెడ నుండి తలకు రక్తాన్ని సరఫరా చేసే నరాలు... వాటిని ముని వేళ్లతో స్పృశిస్తూ ఎంతవరకు నలిగిపోయాయో అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

చాలాసేపటికి నీరసంగా, నూతిలోంచి మాట్లాడుతున్నట్లుగా కొద్దిగా స్వరం వినబడిరది. హరికి ధైర్యం వచ్చింది.

‘‘మేఘనా... మేఘనా’’ అంటూ పిలిచాడు.

‘‘నన్నెందుకు బతికించావు హరీ’’ అంటున్నదామె.

‘‘కష్టాలెన్నో ఉంటాయి... ప్రాణాలు తీసుకుంటామా? అలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చెయ్యకు.’’ అంటూనే వంటగదిలోకి పరిగెత్తి అటూ ఇటూ వెతికాడు. పాలగిన్నె కన్పించింది. గబగబా స్టవ్వెలిగించి, గోరు వెచ్చగా ఒక కప్పుడు పాలు వేడిచేసి నెమ్మదిగా మేఘనతో తాగించాడు. ఆమె శ్వాస సాఫీగానే సాగుతున్నదనీ, నాడి స్పందిస్తున్నదనీ, గుండె కొట్టుకుంటున్నదనీ నిర్ధారించుకున్నాక, దుప్పటి కప్పి, బయటకు వచ్చి... సిగరెట్ వెలిగించి, దుమ్మ పీల్చి గుండెల నిండా పొగలాగి వదిలాడు.

ప్రాణం కుదుటపడి నట్లనిపించింది. టైమెంతయిందో తెలియడం లేదు. వర్షం కురవడం మానేసింది. లోపలికి వచ్చి చూసాడు కప్పిన దుప్పటి కింద నుంచి మేఘన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు క్లియర్ గా తెలుస్తున్నాయి. ప్రక్కనే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు.

ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు... అలాగే కూర్చున్నవాడు కూర్చునట్టే నిద్ర దేవత ఒడిలోకి ఒదిగిపోయాడు హరి.

పక్షుల కలకణరావాలతో మెలకువ వచ్చింది హరికి.

కాస్సేపు ఏమీ అర్థం కాలేదు. ఎక్కడున్నాడు తను? ఉండాల్సింది ఫ్లాట్లో కదా...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్