Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: మన కుర్రాళ్ళే
తారాగణం: అరవింద్‌ కృష్ణ, రచనా మల్హోత్రా, రాజ్‌ కళ్యాణ్‌, శృతి రాజ్‌, రావు రమేష్‌, కృష్ణుడు, వెంకట్‌, ఎం.ఎస్‌. నారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణభగవాన్‌ తదితరులు.
చాయాగ్రహణం: ముజీర్‌ మాలిక్‌
సంగీతం: భీమ్జ్‌, రాజ్‌, గురు కిరణ్‌, మనోమూర్తి, జికె., శివ కాకాని, మోహన్‌ జోహ్న
నిర్మాణం: వీర శంకర్‌ సిల్వర్‌ స్క్రీన్స్‌
దర్శకత్వం: వీరశంకర్‌
నిర్మాతలు: బివిఎస్‌ శ్రీనివాసు, హెచ్‌ఎస్‌ హరూన్‌
విడుదల తేదీ: 01 జనవరి 2015

క్లుప్తంగా చెప్పాలంటే
లచ్చు (అరవింద్‌ కృష్ణ), సూరి (కళ్యాణ్‌), అప్పు (వెంకట్‌), శారద (రచన) నలుగురు యంగ్‌స్టర్స్‌. వీరంతా ఓ గ్రామం నుంచి మహా నగరానికి వస్తారు. సూరి ఐటీ ప్రొఫెసనల్‌. శారద కూడా ఓ సంస్థలో ఉద్యోగం చేస్తుంటుంది. చిన్న గ్రామం నుంచి సిటీకి వచ్చిన లచ్చు, సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఓ పబ్‌లో పనిచేస్తుంటాడు. శారదతో ప్రేమలో పడిన లచ్చు, ప్రేమ పని మీదా, ఉద్యోగం వేటలోనూ పడి సిటీకి వస్తాడు. ఇంకో వైపున సూరి అన్నయ్య రామరాజు (రావు రమేష్‌) సర్పంచ్‌గా పనిచేస్తుంటాడు. సెజ్‌ పేరుతో తమ భూముల్ని లాక్కోడానికి ప్రయత్నిస్తోన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాడు రామరాజు. అదలా ఉంచితే రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ పడిపోవడం, ఐటీ రంగంలో ఇబ్బందులతో నలుగురు యంగ్‌ స్టర్స్‌ జీవితాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. గ్రామంలో జరుగుతున్న భూమి కోసం పోరాటం ఓ వైపు, తమ  తమ జీవితాల్లో ఇబ్బందులు ఇంకో వైపు. ఈ సమయంలో ఆ నలుగురు యంగ్‌స్టర్స్‌ ఏం చేశారన్నది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే
అరవింద్‌ క్రిష్ట తెరపై సర్‌ప్రైజింగ్‌గా కనిపించాడు. ఎనర్జీ లెవల్స్‌ సూపర్‌గా ఉన్నాయి. పవర్‌ఫుల్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. రచనా మల్హోత్రా క్యూట్‌గా ఉంది. కన్పించినంత సేపూ ఆమె కూడా ఆకట్టుకుంటుంది. రాజ్‌ కళ్యాణ్‌, వెంకట్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. శృతి ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంది.రావు రమేష్‌ సూపర్బ్‌. ఎం.ఎస్‌.నారాయణ, కృష్ణభగవాన్‌ ఓకే. కృష్ణుడు, శ్రీనివాస్‌రెడ్డి, వేణుమాధవ్‌ నవ్వించారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు.కమర్షియల్‌ పాయింట్‌తో, మంచి మెసేజ్‌ని మిక్స్‌ చేసిన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు దర్శకుడు. నేరేషన్‌ బావుంది. డైలాగ్స్‌ బాగా రాశారు. స్క్రిప్ట్‌ సాధారణంగానే వున్నా, స్క్రీన్‌ప్లేతో కావాల్సిన ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశాడు దర్శకుడు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగుంది. మూడు పాటలు తెరపై చూడ్డానికీ అందంగా ఉన్నాయి. సినిమాతోగ్రఫీ ప్రొఫెషనల్‌గా ఉంది. ఎడిటింగ్‌ కొన్ని సన్నివేశాల్లో అవసరం వుందనిపిస్తుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరు బాగుంది.ప్రభుత్వాలు చేపట్టే భూ సేకరణ అంశం, తద్వారా రైతులు పడే ఇబ్బందుల్ని బాగా చూపించారు. రియల్‌ ఎస్టేట్‌ ఇబ్బందులు, ఐటీ రంగంలో వచ్చిన స్లంప్‌ వంటివాటి చుట్టూ కథ నడుస్తుంది. ఫస్టాఫ్‌లో కామెడీ, యాక్షన్‌, రొమాన్స్‌ సమపాళ్ళలో వుంటాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ప్రామిసింగ్‌గా వుంది. సెకెండాఫ్‌లో కొంచెం మెలోడ్రామా కనిపిస్తుంది. సెంటిమెంట్‌ సీన్స్‌ వుంటాయి. ఓవరాల్‌గా ఫిలిం మంచి ఎనర్జీతో రూపొందింది. స్మూత్‌గా రన్‌ అవుతుంది. బాక్సాఫీస్‌ పరంగా చూస్తే బాగానే వసూళ్ళు రాబట్టే అవకాశలున్నాయి. బి, సి సెంటర్స్‌లో మంచి స్పందన వస్తుంది. కమర్షియల్‌ హంగులూ వున్నాయి. మౌత్‌ టాక్‌ స్ప్రెడ్‌ అయితే, మంచి విజయం సాధించొచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే
మనకుర్రాళ్ళే బాగున్నారు

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cinechuraka