Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
hero with silent hits

ఈ సంచికలో >> సినిమా >>

Happy Sankranthi

లేడీ డైరెక్టర్‌ జయ టెక్నికల్‌ మూవీ

technical movie from lady director jaya
తెలుగు సినీ రంగంలో లేడీ డైరెక్టర్స్‌ చాలా తక్కువ. నందిని రెడ్డి ‘అలామొదలైంది’ అనే సినిమా రూపొందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నా, ఆ తరువాత ‘జబర్‌దస్త్‌’తో ఫ్లాప్‌ చవిచూసిన ఆమె స్పీడ్‌గా సినిమాలు చేయలేకపోయారు. అలనాటి నటి, దర్శకురాలు విజయనిర్మలలాగా సినిమాల్ని వేగంగా, సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించడంలో ఈ తరం మహిళా దర్శకులు విఫలమవుతున్నారు.అయితే దర్శకురాలు జయ మాత్రం దర్శకురాలిగా తెలుగులో తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. ‘ప్రేమికులు’, ‘చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్‌ లీ’ వంటి సినిమాల్ని తెరకెక్కించిన జయ, మరో కొత్త సినిమాకి శ్రీకారం చుడుతున్నారు. ఆర్‌జె సినిమాస్‌ పతాకంపై ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.

టెక్నికల్‌గా అద్భుతంగా ఉండేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట జయ.సినీ రంగంలో పిఆర్‌వోగా అందరి మన్ననలూ అందుకుంటున్న బిఎ రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అతి త్వరలో వెల్లడి చేయనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలియవస్తోంది. మంచి సినిమాల్ని రూపొందించడానికే గ్యాప్‌ తీసుకుంటున్న బిఎ రాజు, జయ ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారని ఆశిద్దాం.
మరిన్ని సినిమా కబుర్లు
'gajal' drama competetions in palakollu