Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
powerstar towards family oriented

ఈ సంచికలో >> సినిమా >>

నటుడిగా ఫెయిలవలేదు

did not failed as actor

ఒక్కోసారి ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాలు అంత గొప్ప విజయాల్ని నమోదు చేయవు. ఒక్కోసారి తీవ్రంగా నిరాశపరుస్తాయి కూడా. ‘మహా నటుడు’ అనిపించుకున్న విక్రమ్‌కి ఎదురవుతున్న వైఫల్యాలు అలాంటివే. ‘ఐ’ సినిమా ఎన్నో అంచనాలతో వచ్చింది. అంచనాలు తారుమారయ్యాయి. ఎక్కువ కాలం సినిమా నిర్మాణం జరగడంతోపాటుగా, భారీ బడ్జెట్‌ తద్వారా ఏర్పడ్డ అంచనాలు ‘ఐ’ సినిమా ఫలితం తారుమారవడానికి కారణంగా చెప్పవచ్చు.అంచనాలకు ఏమాత్రం సినిమా తగ్గినా ఫలితం చాలా తేడాగా వుంటుంది. ‘ఐ’ విషయంలో జరిగింది అదే. అయినప్పటికీ హీరో విక్రమ్‌పై విమర్శకుల ప్రశంసలు మాత్రం తగ్గలేదు. సినిమా కోసం విక్రమ్‌ అంతలా కష్టపడ్డాడు. ఆ కష్టం అంతా తెరపై కనిపించింది. ‘అపరిచితుడు’ సినిమాని మించి ‘ఐ’లో విక్రమ్‌ పెర్ఫామెన్స్‌ వుంది.‘ఐ’ సినిమా చూసినవారెవరూ విక్రమ్‌ నటనా ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేరు. గెటప్స్‌ వేయడమే కాకుండా, ఒకే నటుడిలోని భిన్న కోణాల్ని ఆవిష్కరించిన సినిమా ‘ఐ’. విక్రమ్‌లోని ప్రతిభను వెలికి తీయడం వరకూ సఫలమైన శంకర్‌, ప్రేక్షకుల్ని మెప్పించడంలో విఫలమయ్యాడు.

మరిన్ని సినిమా కబుర్లు
that feel only made me star