Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bhagavaan shree ramana maharshi biography

ఈ సంచికలో >> శీర్షికలు >>

జాతకచక్రం (జూన్ 15 నుండి 21 వరకు) - శ్రీ నంద

'గోతెలుగు.కామ్' పాఠకుల ప్రశ్నలకు శ్రీ నంద గారు సమాధానాలిస్తారు. మీ యొక్క ప్రశ్నలను(ఒక్కటి మాత్రమే) మీ పేరు, పుట్టిన తేది, సమయం, పుట్టిన ఊరు జతచేసి 'goteluguastro@gmail.com ' కి పంపగలరు. 
 


నా ఉద్యోగాన్వేషణ, భవిష్యత్తు, కుటుంబం మరియు వైవాహిక జీవితం గురించి తెలుపగలరు - నూర్జహాన్, మన్నూరు, ఒంగోల్
నూర్జహాన్ గారు మీరు మూల నక్షత్రం ధనస్సురాశికి చెందిన వారు.  ప్రస్తుతం మీకు శుక్ర మహర్దశలో శని అంతర్దశ నడుస్తున్నది.  2013 సెప్టెంబర్ వరకు ఉంటుంది. తదుపరి శుక్రలో బుధ అంతర్దశ ఉంటుంది 2015 వరకు. మీరు కొంత హుందాగా జీవించాలి అని, అదేవిధంగా అందరిలోను గుర్తింపును కోరుకొనే లక్షణాన్ని కలిగి ఉంటారు. 2013 జూలై నుండి చాలావరకు అనుకున్న పనులు జరుగుతాయి. 2014 మార్చ్ నుండి మీ ఆలోచనలు అధికమైన ఖర్చును కలిగించేవిగా ఉంటాయి కావున ఆ సమయంలో బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. 2014 నుండి 2016 వరకు తరచు బుధవారాలు అవసరమున్న పేదవారికి ఆకుకూరలు దానం ఇచ్చుట మంచిది. మిత్రుల వలన లేదా మీరు మిత్రులలో అధికం అని నిరుపించుకోనుటకు చేయు పనుల వలన ఇబ్బందులు పడుటకు అవకాశం కలదు. ప్రభుత్వ రంగంలో రాణింపు ఉంటుంది. కాకపోతే పూర్తిస్థాయిలో సంతృప్తిని కలిగి ఉండలేరు. సోదర సోదరి వర్గం నుండి సహకారం తక్కువగా ఉంటుంది.  2014 నుండి 2015 లోపు వివాహ సూచనలు కలవు. వివాహం విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే మరిన్ని ఫలితాలు మీకు అనుకూలంగా రావడానికి ప్రతి శుక్రవారం తప్పక దైవధ్యానం చేయుట, చక్కటి ఆలోచనలు కలిగి ఉండుట. అలాగే 2014 నుండి రోగులకు సహయం చేయుట మంచిది.

నా వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలుపగలరు - వంశీ, అద్దంకి
వంశీ గారు మీరు పుష్యమి నక్షత్రం కర్కాటక రాశికి చెందినవారు. 2013 లో మీరు అధికమైన ఖర్చులను పొందుటకు అవకాశం కలదు జాగ్రత్తగా ఉండుట సూచన. వివాహానికి కొంత కాలం ఆగడం శ్రేయస్కరం. మీకు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండుటకు అవకాశం కలదు. అలాగే కొన్ని సార్లు మానసికంగా వ్యధను పొందుటకు అవకాశం కలదు. అందరిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా అని అనుకోవడం లేదా ఏదో ఒక అసంతృప్తి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. 2014 లో వివాహఅవకాశాలు కలవు జాతకాలు సరిపోతేనే వివాహం చేసుకోవడం చేయండి. 1999 వరకు బాగానే ఉన్నారు. 2000 సంవత్సరం నుండి మీరు వివిధ రకములుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మిత్రులతో అపుడప్పుడు వివాదములు కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్త. మొండిపట్టుదలతో కాకుండా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచి ఫలితాలను కలుగజేస్తుంది. ప్రతిరోజు విష్ణుసహస్రనామం తప్పక చదవండి అలాగే వరుసగా 17 బుధవారాలు గణపతి గుడికి వెళ్ళుట 17 ప్రదక్షణలు చేయుట ఆకుపచ్చని పూలతో పూజించుట మంచి ఫలితాలను కలుగజేస్తుంది. ప్రతి మూడునెలలకు ఒకసారి సుబ్రమణ్య అభిషేకం, అలాగే శివాభిషేకం చేయుట ఉత్తమం.

నా పూర్తి  జాతకం చెప్పగలరు - సంజయ్ రాజ్ కుమార్, నర్సాపురం, ప.గో.జిల్లా
సంజయ్ రాజ్ కుమార్ గారు మీరు విశాఖ నక్షత్రం తులారాశికి చెందిన వారు . మీరు పుట్టిన సమయం రెండు గంటల వ్యవది ఇచ్చారు. లగ్నం మార్పు ఉంటుంది కావున పూర్తిజాతకం చెప్పుట కష్టం. ప్రస్తుతం మీకు జన్మంలో ఏలినాటిశని నడుస్తున్నది కావున ఆరోగ్యవిషయంలో జాగ్రత్తగా ఉండుట మంచిది. కొంత శ్రమను పొందితే కాని పనులు ముందుకు సాగవు. మీరు సొంతంగా ఆలోచించి ఏ పనిని చేయకపోవడం మంచిది. అలాగే వ్యాపారంలో అంతగా రాణించలేరు. కాకపోతే కళాత్మక రంగాలలో రానించగలుగుతారు. కాబట్టి ఆర్ట్స్ కు సంభందించిన రంగాలు ఎంచుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. మీరు టీచింగ్లో రాణిస్తారు. మీరు ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఒక్కసారి వేంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని మనసులో తలుచుకొని ఆరంభించుట మంచిది. వరుసగా 20 శుక్రవారాలు లక్ష్మీఆలయం వెళ్ళండి.

నేను ఒక ఉపాధ్యాయుడను. ఇటీవల నాలో ఆత్మ న్యూనతాభావం పెరుగుతోంది. నా భవిష్యత్ ఎలా ఉంటుందో దయచేసి చెప్పగలరు - ఇసికేల ఉదయ కుమార్, నాయన పల్లి, అనంతపురం జిల్లా
ఉదయ్ కుమార్ గారు మీరు విశాఖ నక్షత్రం తులారాశికి చెందిన వారు. ప్రస్తుతం 2013 ఆగష్టు వరకు బుధమహర్దశలో గురు అంతర్దశ నడుస్తున్నది తదుపరి శని అంతర్దశ ఉంటుంది. వివాహిక జీవితంలో సమస్యలు కలుగుటకు అవకాశం కలదు. మీరు తీసుకున్న నిర్ణయం విషయంలో తరచూ మార్పును చేసుకొనే అవకాశం కలదు. కావున స్థిరమైన ఆలోచనలు చేయుట మంచిది. ఉద్యోగంలో అధికారులతో ఇబ్బందులు కలుగుటకు అవకాశం కలదు కావున వారికి అనుగుణంగా నడుచుకొనుట సూచన. వివాహాస్థానంలో శని నీచపొందిన కారణంగా మీరు సర్దుకుపోవాలి లేదా వారికి అనుగుణంగా నడుచుకోవాలి మేలుచేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా అడుగులు వేయండి. స్త్రీలకు సంభందించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండుట సూచన. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనుట మంచిది ప్రతిరోజు కనకధార స్తోత్రం చదవండి. అలాగే సోమవారాలు దుర్గాదేవి ఆలయం వెళ్ళండి. 19 శని వారాలు హనుమాన్ దేవాలయం వెళ్ళుట 19 ప్రదక్షణలు చేయుట మంచి ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. 2014 లో కొన్ని సమస్యలు తీరుతాయి. ప్రతిరోజు పడుకొనే ముందు చంద్రునికి మనస్కారం చేయుట ఉత్తమం.

నాకు వుద్యోగం ఎప్పుడు వస్తుందో దయచేసి తెలుపగలరు. ఫణి కిషోర్, సత్తెనపల్లి, గుంటూరు జిల్లా 
ఫణికిషోర్ గారు మీరు ఉత్తరాభద్ర నక్షత్రం మీనరాశిలో జన్మించారు మీకు ప్రస్తుతం కేతు మహర్దశ నడుస్తుంది. కేతు మాహర్దశ అక్టోబర్ 2016 వరకు ఉంటుంది. అలాగే అర్దాస్టమ శనినడుస్తున్నాడు . కేతు మహర్దశలో ఖుజ అంతర్దశ అక్టోబర్ 2013 వరకు తదుపరి రాహు అంతర్దశ సెప్టెంబర్ 2014 వరకు ఉటుంది జాతకాన్ని పరిశీలిస్తే. గతకొంతకాలంగా అంటే సుమారు 4 సంవత్సరాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అనుకోని రూపాలుగా ఖర్చులు కలుగుతున్నవి అలాగే అనుకున్న పనులు ఆలస్యంగా అవుతున్నవి అని తెలుస్తుంది.

ఉద్యోగ విషయానికి వస్తే మీ వృత్తిస్థానాదిపతి పంచమంలో  ఉన్నాడు కావున ఉద్యోగంలో తప్పక మంచిస్తాయికి వెళ్ళడం అందులో మీరు ఆశించిన విధంగా రాణింపు ఉంటుంది అనిచేప్పుకోవచ్చును. మీకు వ్యాపరరంగానికి సంభందించిన మెలుకువల విషయంలో మంచి ఆలోచన ఉన్నను మీరు వ్యాపారం చేయకపోవడం మంచిది. ఇతరులకు చక్కని సలహాలను ఇవ్వగలరు. అలాగే విద్యారంగంలో,హోటల్ మేనజ్మెంట్ రంగంలో,కమ్యూనికేషన్ రంగంలో బాగా రాణించగగలుగుతారు.

సోదరవర్గం నుండి సహకారం అందుతుంది. ధార్మిక విషయాలపైన అలాగే మీ విషయాలపైన సమద్రుస్తిని కలిగి ఉంటారు. నిరుద్యోగులు అయితే 2013 సెప్టెంబర్ లోపు ఉద్యోగం వస్తుంది. ఉద్యిగులు అయితే మంచి గుర్తింపును పొందుతారు. ఇంకా ఉన్నత ఫలితాలు రావడానికి 7 బుధవారాలు వినాయకునికి బెల్లంను నైవద్యంగా పెట్టి 7 ప్రదక్షణలు చేయండి అలాగే 3 మంగలవరాలు సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయుట,ప్రతిరోజు శివాష్టకం చదవండి మంచిది.

నా భవిష్యత్తు మరియు కెరీర్ గురించి తెలుపగలరు. - దివ్యశ్రీ, రాజమండ్రి. 
దివ్యశ్రీగారు మీరు శతబిశా నక్షత్రం కుంభరాశికి చెందినవారు ప్రస్తుతం గురు మహర్దశ. గురులో బుధ మహర్దశ 2014 ఆగష్టు వరకు ఉంటుంది. మీ ఆలోచనలు బాగానే ఉన్నను వాటిని ఇంకా మంచిగా ఆవిష్కరించాలి అనే ప్రయత్నంలో తప్పులు చేసే అవకాశం కలదు జాగ్రత్త. ఉన్నత విద్యావకాశాలు బాగున్నవి. వివాహం విషయంలో తప్పక పెద్దల ఆలోచనలు గౌరవించుట మంచిది. ఆర్థికంగా బాగానే సంపాదించే అవకాశం కలదు అంటే ధనంకు లోటు ఉండదు కాకపోతే ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండుట మంచిది.

మీకు మీ అమ్మగారితో చక్కటి అనుబంధం ఉండే అవకాశం కలదు. ఉద్యోగ విషయానికి వస్తే సర్వీస్ ఓరియంట్ ఉద్యోగాలు,అధికారిక ఉద్యోగాలు,సాఫ్ట్వేర్ రంగం,ఎలక్ట్రికల్ రంగాలు కలిసి వస్తాయి. కోపాన్ని తగ్గించుకొని పెద్దల సూచనలు పాటిస్తే మంచి జీవితాన్ని అనుభవిస్తారు. కళత్మక రంగాలలో రాణించా గలుగుతారు. మీ ఆలోచనలు చాలావరకు అదుపులో ఉంచుకొనుట తప్పక మేలుచేస్తుంది. తరచు శివునకు ఆదివారాలు అభిషేకం చేయుట,ప్రతిగురువారం సాయిబాబా దేవాలయం వెళ్ళండి,గణపతిని ధ్యానించుట మంచి ఫలితాలను కలుగ జేస్తుంది.

నేను గవర్నమెంట్ ఉద్యోగిని. నా ఉద్యోగం మరియు భవిష్యత్తు ఎలా వుంటుంది? ఆళ్ళ రమణ, గేడ్డనాపల్లి, తూర్పు గోదావరి జిల్లా 
ఆళ్ళరమణ గారు ఉత్తర నక్షత్రం కర్కాటక రాశికి చెందినవారు. ప్రస్తుతం రాహు మహర్దశ నడుస్తుంది రాహువులో శుక్ర అంతర్దశ ఆగష్టు 2015 వరకు ఉంటుంది. మీరు మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు చేసే ప్రతిపట్ల చక్కటి అవగాహన ఉంటుంది. కాకపోతే ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని విధంగా ఖర్చులను పొందుతున్నారు. వివాహం ఆలస్యం అవడం లేకపోతే వైవాహిక సమస్యలను పొందుటకు అవకాశం కలదు. కాలసర్పయోగంలో జన్మించారు మీరు,ఆశించిన పనులు కొంత నిదానంగా రావడం జరుగుతుంది. మీకు వీలైనప్పుడు అంటే సంవత్సరంలో రెండుసార్లు లేదా ఒక్క సారి తప్పక శ్రీకాళహస్తిలో పూజ చేయుట మంచిది.

ఉద్యోగ విషయానికి వస్తే గ్రూప్స్ రాయండి మంచి ఫలితాలు పొందుతారు అలాగే గౌరవప్రదమైన హోదాలో ఉండే అవకాశం తప్పక కలదు. జడ్జ్ లేదా అలాంటి లేదా అడ్మిన్ అధికారాల్లో అద్భుతంగా రాణిస్తారు కాకపోతే మీకున్న సమస్య ఏమిటంటే మీరు మాట్లాడిన మాటలు ఖర్చులను లేదా వివదములను కలిగించే అవకాశం కలదు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడుట అలాగే చేసే పనిలో మనోదైర్యంతో ముందుకు వెళ్ళుట మంచిది. ఇతరులకు అప్పులు ఇవ్వకండి అలాగే ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండుట అలాగే లిక్విడ్గా కాకుండా డబ్బును ఫిక్స్డ్  గా ఉంచుకోవడం మేలుచేస్తుంది.  మరిన్ని మంచి ఫలితాల కోసం గురువారాలు శివునకు అభిషేకాలు చేయండి,ప్రతిరోజు విష్ణుసహస్రనామం పారయణ చేయండి అలాగే 18 మంగలవరాలు దుర్గాదేవి ఆలయం వెళ్ళండి.

నా భవిష్యత్తు మరియు పెళ్లి వివరాలు చెప్పగలరు, సురేష్ - జడ్డంగి, తూర్పు గోదావరి జిల్లా 
సురేష్ గారు మీరు మొదట మీ పేరును suurresh అని రాసి పంపారు ఈ పేరును శబ్దార్థం పోకుండా పిలువడం సాధ్యపడుతుందా మిమ్మల్ని సూర్రెశ్ అని పిలువాలి మొదట ఇదితప్పు పేరును అర్థం లేకుండా మార్పులు చేయకూడదు. suresh అనే పేరులో మార్పులు వద్దు పేరు మీ జన్మవివరాలకు సరిపోయింది. ధనిస్టా నక్షత్రం కుభారాశికి చెందిన వారు ప్రస్తుతం గురుమహర్దశ నడుస్తుంది.  గురువులో బుదుడు మార్చ్ 2014 వరకు ఉంటుంది. తదుపరి కేతు అంతర్దశ.

వివాహం విషయానికి వస్తే 2014 ఫిబ్రవరి తర్వాత వివాహం అవుతుంది. వివాహం విషయంలో ఆలోచనలు అధికంగా పెట్టుకొనే అవకాశం కలదు. కోపాన్ని అలాగే ఇష్టాలను కొద్దిగా అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగంలో బద్దకాన్ని కలిగి ఉండే అవకాశం లేదా కొంత అశ్రద్ద చూపించే అవకాశం కలదు కావున జాగ్రత్తగా ఉండుట మంచిది. హోటల్ మేనజ్మెంట్,సాఫ్ట్ వేర్ రంగాలు అనుకూలిస్తాయి 2014 లో ఉద్యోగంలో అభివృద్దిని పొందుతారు. సౌఖ్యవంతమైన జీవితానికి ప్రాముఖ్యతను ఇస్తారు కొద్దిగా శ్రమించుట వలన లాభంను పొందుతారు.

ఆటలు అడునప్పుడు లేదా వాహనములు నడుపునప్పుడు అప్పుడప్పుడు ప్రమాదాలు కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్త . ప్రతిశనివారం ఆంజనేయ ఆలయం వెళ్ళుట మంచిది. ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవండి. 20 శుక్రవారాలు గోమాతకు పచ్చగడ్డిని తినిపించండి మీకు వీలుకాకపోతే మే పెద్దవాళ్ళను మీ పారు మీద ఆపనిని చేయమనండి.

నా భవిష్యత్తు మరియు కెరీర్ మరియు వ్యక్తిగత జీవితం ఎలా వుంటుందో తెలపండి. రమేష్ బాబు, జడ్డంగి 
రమేష్ బాబు గారు మీరు పుష్యమీ నక్షత్రం కర్కాటక రాశిలో జన్మించారు. ప్రస్తుతం కేతు మహర్దశలో శుక్ర అంతర్దశ మే 2014 వరకు నడుస్తుంది. తదుపరి రవి అంతర్దశ. ఈ సంవత్సరం ఖర్చులను అదుపులో ఉంచుకొనుట అలాగే నూతన ఆలోచనలు చేయునప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుట మంచిది. ప్రభుత్వ రంగ సంస్థలలో రాణించే అవకాశం కలదు. గట్టిగా ప్రయత్నం చేయుట మంచిది. అంతర్గతంగా భయాన్ని కలిగిఉండే మనస్తత్వం మీది ఏ పనిచేసిన మనోదైర్యంతో ముందుకు వెళ్ళుట మంచిది. ఇతరులకు సేవచేయాలనే ఆలోచన ఉంటుంది.

వ్యాపారరంగంలో కూడా రానించగలుగుతరు. కన్సల్టెంట్ రంగం, టీచింగ్ రంగం అనుకూలిస్తాయి. ఉన్నత విద్య ఉంటుంది. ఇతరులను ఆకర్షించే వాక్కును కలిగి ఉంటారు. 2013 ఆగస్ట్ తర్వాత ఉద్యోగంలో అభివృద్దిని కలిగిఉంటారు. సర్వీసు రంగాలు అనుకూలిస్తాయి గట్టిగా ప్రయత్నం చేయుట వలన 2014 -2015 లలో ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడుతారు. ప్రతిరోజు లక్ష్మీఅష్టోత్తరం చదువుట,బుదవారాలు గణపతికి పూజలు చేయుట మంచిది. ప్రతినెల ఏకాదశి రోజున శివునకు అభిషేకం చేయుట మంచిది.

నమస్కారములు నా పేరు వెంకట రమణ నా బార్య పేరు విజయ మాకు ఒక అబ్బాయి వాడికి ఈ మద్య ఫిబ్రవరి 2013 నుండి ఆరోగ్యం బాగోవడం లేదు . మాకు వాడి జాతకం లో ఏమైనా దోషాలు ఉన్నాయేమో అని వాటి గురించి తెలుసుకుందాము అని అనుకుంటున్నాము. శాస్త్రం ప్రకారము దినేష్ కార్తిక్ పేరు పెట్టాము . దయచేసి మాకు వివరకు తెలియచేయగలరు.
విజయ్ గారు మీ అబ్బాయి పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశిలో జన్మించాడు. ప్రస్తుతం గురు మహర్దశలో శుక్ర అంతర్దశ నడుస్తుంది మే అబ్బాయి ఆరోగ్యం బాగాలేదు అని వ్రాసారు. ద్వాదశంలో ఖుజుడు ఉండుట అదేవిధంగా గురు,శుక్రులు అష్టమంలో ఉండుట ఈవిధమైన గ్రహాల సంపత్తి కొంత ఇబ్బంది పెడుతుంది. ఈ సమయంలో దైవధ్యానం అవసరం ఆగష్టు 2015 వరకు కూడా కొద్దిగా ఆకస్మిక ఖర్చులను పొందుటకు అవకాశం ఉంది.

మీరు ఒకసారి నగ్రహాలకు పూజలు చేయండి. ప్రతిరోజు మీరు మీశ్రీమతి తులసి ప్రదక్షణ చేయుట. గురువారాలు, శుక్రవారాలు తప్పక దేవాలయం సందర్సించుట చేయండి. ఒకసారి గురువునకు,శుక్రునకు  జపాలు,దానాలు చేయుట  మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా ప్రదోష వేళలో శివునకు తరుచు అభిషేకాలు చేయుట మంచిది. మీరు ఇంట్లో ప్రతిరోజు దైవధ్యానం చేయండి దీపరాధన చేయుట మంచిది. ఒకసారి సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయండి.

 

వార ఫలాలు (జూన్ 15  - జూన్ 21)

 


మేష రాశి
ఈవారం మీరు మిశ్రమఫలితాలను కలిగి ఉంటారు.  బంధుమిత్రులతో మొదట్లో ఉన్న అనుభందాలు చివరి వరకు ఉండకపోవచ్చును. కుటుంబంలో మీ సంతానం మూలాన గౌరవాన్ని సంపాదించుకుంటారు. ప్రయత్నాలలో వారం ఆరంభంలో ఫలితాలు రానప్పటికీ వారం మధ్యలో చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. మానసికంగా ఆలోచనలు పెరుగుతాయి చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులకు గురయ్యే ఆవకాశం కలదు. సమాజంలో మీరు గుర్తింపును కోరుకుంటారు.  ఆదిశలో చేసిన పనులు ఫలితాలను కలుగజేస్తాయి. ఆర్థికపరమైన ఆలోచనలు వారం మధ్యలో అనుకూలిస్తాయి. వారం చివర్లో అనారోగ్య సమస్యలు పెరుగుటకు అవకాశం కలదు కావున మొదట్లోనే చికిత్సను తీసుకోవడం సూచన. తలపెట్టిన పనులలో అధికారుల మూలాన ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగస్థానంలో మీరు ఆశించిన విధంగా ఉండకపోవచ్చును. అధికారుల మూలాన భయంను కలిగి ఉంటారు. ఉద్యోగంలో మార్పును ఆశిస్తారు.  ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశం కలదు. కానీ కొంత కాలం వేచిచూసే ధోరణిని కలిగి ఉండుట మేలుచేస్తుంది. అనుకోని సంఘటనలు జరుగుటకు అవకాశం కలదు. వ్యతిరేక వర్గం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే ఆలోచనలు చేయుటకు ఆస్కారం కలదు. దూరప్రదేశ ప్రయాణాల పట్ల ఇష్టంను కలిగి ఉంటారు. మరిన్ని ఉత్తమమైన ఫలితాల కోసం సుబ్రమణ్య అభిషేకం చేయటం  అలాగే శనగలు 1.25 kg దానం ఇచ్చుట, గురునకు జపాలు మంచివి. అమ్మవారికి కుంకుమ అర్చన చేయించండి.     

వృషభ రాశి
ఈవారం కొంత ఆలోచించి పనులను చేపట్టుట మంచిది. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించుట మంచి ఫలితాలను కలుగజేస్తుంది. వ్యాపారస్థులు ఆర్థికపరమైన విషయాల్లో తొందరపాటు ధోరణి ప్రదర్శించక పోవడం మేలుచేస్తుంది. వారం ఆరంభంలో బాగున్నను మధ్యలో స్వల్ప ఇబ్బందులను పొందుతారు. మొదట్లో పనులను ఉత్సాహంతో ఆరంభిస్తారు. కాని ఆ వేగాన్ని కొనసాగించుటలో విఫలం చెందుటకు అవకాశం కలదు. వారం చివరలో అవసరం రిత్యా ఆపనులను పూర్తిచేయుటకు అవకాశం ఉంది. భోజనం విషయంలో అన్నివేళలా భోజనం చేయక పోవచ్చును. పనిభారం ఉంటుంది. కొన్ని విషయాల వలన ఆందోళనను కలిగి ఉంటారు. అననుకూలమైన వార్తను వినుటకు అవకాశం కలదు. వారం చివరలో సరైన ఆలోచనలతో ముందుకు వెళ్ళుట చేత పనులను ఒక్కొక్కటిగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. సమాజంలో వారం చివరలో మీ ఆలోచనల మూలాన గుర్తింపు రావోచ్చును. ఆర్థికంగా నిదానంగా అడుగులు వేయుటకు అవకాశం ఉంది. ధనలాభం ఉంటుంది. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. వారిమూలన లాభంను పొందుటకు అవకాశాలు కలవు. బంధువులతో మిత్రులతో నూతన ఆలోచనలు చేసి ఆదిశగా అడుగు ముందుకు వేస్తారు. చక్కటి ఫలితాల కోసం శివాభిషేకం, దుర్గాదేవికి అర్చన అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ మంచిది.     

మిథున రాశి
ఈవారం సామాన్యంగా ఉంటుంది. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. బంధువులతో మిత్రులతో కలిసి నూతన ఆలోచనలు చేయునప్పుడు నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం కలదు తగిన జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది. చేపట్టిన పనులలో ఉత్సాహంను రానురాను కోల్పోవుటకు అవకాశం కలదు. ఈ విషయంలో జాగ్రత్త వహించుట మంచిది. మానసికంగా సమస్యలను కలిగి ఉంటారు చాలా విషయాల్లో మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చును. అశుభవార్తను వినే అవకాశం కలదు. ఉద్యోగంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తోటివారిని కలుపుకొని వెళ్ళుట మూలాన పనులు ముందుకు సాగుతాయి. వారం చివరలో చేసిన పనులను మంచి ఫలితాలు కలుగుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటే లాభంను పొందుతారు. అధికారులతో నిదానంగా ఉండుట వారికి అనుకూలమైన పనులను చేపట్టుట సూచన. చిననాటి మిత్రులను కలుస్తారు. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. కొత్త పనులను చేపట్టడానికి చూపించే ఉత్సాహంను ఇంతకుముందే ఆరంభించిన పనులలో చూపించుట వలన సమస్యలు తగ్గుతాయి. మంచి ఫలితాల కోసం సుబ్రమణ్య అభిషేకం, దుర్గాదేవికి కుంకుమఅర్చన అలాగే విష్ణుసహస్ర నామం పారయణ చేయుట మంచిది.  

కర్కాటక రాశి
ఈవారం జాగ్రత్తగా ప్రణాళికా ప్రకారం నడుచుకొనుట మేలుచేస్తుంది. గట్టిగా ప్రయత్నం చేయుట వలన చేపట్టిన పనులను ముందుకు తీసుకుపోగలరు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. తగిన సమయంలో సరైన చికిత్సను తీసుకొనుట వలన మేలుజరుగుతుంది. చేపట్టిన పనులలో ఇబ్బందులను ఆటంకాలను పొందుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేయుట మూలాన శ్రమను ధననష్టాన్ని పొందుతారు. అవసర మనుకుంటేనే ప్రయాణం చేయండి. మీ ఆప్తులయొక్క ఆరోగ్యం ఆందోళనను కలిగించే అవకాశం కలదు. పెద్దలతో ఆచితూచి ప్రవర్తించుట మంచిది. మాటతీరు మూలాన సమాధానం చెప్పవలసి రావోచ్చును. వారం మధ్యలో కొంత వరకు మిత్రుల సహకారం పొందుట వలన పనులను ముందుకు తీసుకుపోగలరు. అననుకూలమైన వాతావరణంలో పనిచేయవల్సి రావోచ్చును. అశుభవార్తను వినుట మూలాన దుఃఖాన్ని పొందుతారు. భోజన సౌఖ్యం ఉండకపోవచ్చును. సరైన సమయానికి భోజనం చేయుట మంచిది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనంను వాటికోసం ఖర్చుచేయుటకు అవకాశం కలదు. చోరుల మూలాన భాదను పొందుతారు. వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. ఫలితాల కోసం ప్రతిరోజు గురుచరిత్ర పారాయణ, లక్ష్మీనారాయణు లకు అర్చన అలాగే గణపతిని ఆరాధన చేయుట మంచిది.   

సింహ రాశి
ఈవారం చక్కని ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. జాగ్రతగా నడుచుకొంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో గుర్తింపును కలిగి ఉంటారు. నూతన పనులను ఆరంభించుటకు అవకాశం కలదు. మాటలను మాత్రం పొదుపుగా వాడుట తప్పక మేలుచేస్తుంది. పనులను ఉత్సాహంతో ఆరంభించుటకు అవకాశం కలదు. కొంతమంది మీ ఆలోచనలను వ్యతిరేకించుట వలన మనోవిచారంను పొందుతారు. అనారోగ్య విషయంలో మాత్రం శ్రద్ద వహించుట మంచిది. అధికంగా సంచారం చేయుట మూలాన అలసి పోతారు. ఆర్థికపరమైన విషయాల్లో మీ ఆలోచనలు లాభాన్ని కలుగ జేస్తాయి. తోటివారిలో గౌరవాన్ని కలుగుటకు అవకాశం ఉంది మంచి ఆలోచనలు కలిగి ఉండి ముందుకు వెళ్తారు. పూజలలో పాల్గొంటారు. మంచి పేరును కలిగి ఉంటారు. ఇతరులకు సహాయ పడుతారు. మీ వ్యతిరేకవర్గంను జయించుటకు అవసరమైన ప్రణాలికను సిద్డంచేసుకోనుట ద్వార విజయాన్ని పొందుతారు. మధుర పదార్థముల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. భోజన సౌఖ్యంను కలిగి ఉంటారు. బుద్ధిబలం చేత పనులను కొనసాగిస్తారు. మంచి ఫలితాల కోసం అమ్మవారికి కుంకుమ పూజ, లలితా సహస్రనామం పారాయణ అలాగే గణపతిని ఆరాధన చేయుట మంచిది.      

కన్యా రాశి
ఈవారం నూతన ఆలోచనలు మాని పనిపైన శ్రద్ధను పెట్టుట ద్వార మేలుజరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులు మీఅధికారుల నుండి అభినందనలను పొందుటకు అవకాశం కలదు. తోటిఉద్యొగులతో కలిసి చేపట్టిన పనులలో విజయాన్ని పొందుటకు అవకాశాలు కలవు. బంధుమిత్రులతో నూతన ఆలోచనలు చేస్తారు. వారిని కలిసే అవకాశం కలదు కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకొనుట మంచిది. లేకపోతే మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. రాజకీయవ్యవహారాల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు. వాటిలో పాల్గొనే అవకాశం కలదు. మానసికంగా ఒత్తిడిని కలిగి ఉంటారు. అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఆర్థికమైన ఆలోచనలు చేయునప్పుడు నిదానంగా ఆలోచించుట మంచిది. ఖర్చులను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. వారం మధ్యలో మృష్టాన్నభోజన ప్రాప్తిని కలిగి ఉండుటకు అవకాశం కలదు. మాటలను జాగ్రత్తగా వాడండి వివాదములు కలుగుటకు అవకాశం కలదు. వారం చివరలో మీరు ఆశించిన ఫలితాలు కల్గుటకు అవకాశం ఉంది. గట్టిగా ప్రయత్నం చేయుట సూచన. ఇష్టమైన వారిని కలిసే అవకాశం కలదు. అనుకున్న పనులు నిదానంగా నెరవేరుతాయి. తరుచుప్రయాణాలు చేయుట మూలాన శ్రమను శారీరకంగా ఇబ్బందిని పొందుటకు అవకాశం కలదు. అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలు. భోజనం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోండి. సమయానికి భోజనం చేయుట ఉత్తమం. వ్యతిరేకుల వలన సమస్యలు పెరుగుటకు ఆస్కారం కలదు. మీ జాగ్రత్తలో మీరు ఉండుట మేలు. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మీరు అనుకున్న ఫలితాలు రావడానికి శనికి ప్రదక్షణలు చేయుట, సాయిబాబా ఆలయం వెళ్ళుట అలాగే శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధన చేయుట ఉత్తమం.   

తులా రాశి
ఈవారం మీరు ఆశించిన అంత స్థాయిలో కాకపోయినా కొంత మేర అనుకూలంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చును. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఖర్చులను పొందుతారు. అదుపులో ఉంచుకోలేక పోతారు. బంధువులను కలిసే అవకాశం కలదు. వారి గృహంలో భోజనంసౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు. ధనలాభంను కల్గి ఉన్నను కొంత ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. మానసికంగా అనేకమైన ఆలోచనలు కలిగి ఉండుట చేత మనోవిచారంను పొందుటకు అవకాశం కలదు. వారం మధ్యలో మిత్రులు లేదా బంధువుల ద్వారా ప్రోత్సాహంను కలిగి ఉంటారు. నూతన పనులను చేపడుతారు. వారం చివర్లో తొందరపాటు విధానం అలాగే మాట విధానం సరిగా లేకపోవడం ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు కలుగుట చేత మీ ఆశలు అడియాశలు అవుటకు అవకాశం కలదు. ప్రయాణాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చును. అనారోగ్య సమస్యలు ఇబ్బందికి గురిచేస్తాయి జాగ్రత్తగా ఉండుట మంచిది. మీ ఆలోచనలు ఇతరులకు నచ్చకపోవచ్చును. వారిని ఇబ్బంది పెట్టేవిగా ఉండుటకు అవకాశం కలదు. అనుకోని విధంగా ఫలితాలు రావడంచేత నిరుత్సాహంను పొందుటకు అవకాశం కలదు. పెద్దల ఆలోచనలతో ముందుకు వెళ్తారు. మిశ్రమ ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. నూతన వస్తువుల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు ఆశించిన ఫలితాల కోసం ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయుట, దుర్గాదేవికి కుంకుమ అర్చన అలాగే ఆదిత్యహృదయం పారాయణ చేయుట మంచిది. 

వృశ్చిక రాశి
ఈవారం బాగానే ఉంటుంది.  ఆశించిన రంగాలలో కొంత దూసుకుపోయే ప్రయత్నం చేయుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాల్లో ముందుకు వెళ్తారు. ఇతరుల సహాయ సహకారాలు కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో కొత్త కొత్త విధానాలు కలిగి ఉండుటకు అవకాశం కలదు ధనలాభం పొందుతారు. మీ ఆలోచనలు వివాదములను కలుగాజేసేవిగా ఉండుటకు అవకాశం కలదు. శత్రువులు పెరుగుటకు అవకాశం కలదు చేయుపనిలో నిదానం అవసరం. అనుకోని సంఘటనలు జరుగుట మూలాన భయాన్ని పొందుటకు అవకాశం కలదు. బంధువులతో అలాగే మిత్రులతో కలిసి ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. పనులు కలిసి వస్తాయి. కాకపోతే కొంత ఆలోచనల్లో వ్యత్యాసం మూలాన మనోవిచారంను అలాగే ఖర్చును పొందుటకు అవకాశం కలదు జాగ్రత్త. భోజన సౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు. వారం చివరలో విందులో పాల్గొను అవకాశం ఉంది. అధికారులతో మీవైన ఆలోచనలు తెలుపుతారు. ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో మాత్రం జాగ్రత్తగా ఉండుట అలాగే అందరిని కలుపుకొని వెళ్ళుట మేలుచేస్తుంది. ప్రమాదకరమైన వస్తువులతో పనిచేయునపుడు నిదానంగా ఉండుట సూచన అగ్ని మూలక సమస్యలు ఎదుర్కొనే అవకాశం కలదు జాగ్రత్త. విందులు వినోదముల పట్ల ఇష్టంను ప్రదర్శిస్తారు. సౌఖ్యంకు ప్రాముక్యతను ఇస్తారు. చేయుపనిలో శ్రమను పొందుటకు వకాశం కలదు. నిదానంగా ఉండుట ఓపికను కలిగి ఉండుట మంచిది. మీరు పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు శివాలయం వెళ్ళుట, గణపతికి అభిషేకం అలాగే ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుట మంచిది.       

ధనస్సు రాశి
ఈవారం మీయొక్క ఎదుగుదల మూలాన ఇతరుల నుండి సమస్యలు పొందుటకు అవకాశం కలదు. కావున నిదానంగా మాట్లాడుట మంచిది. తోటివారితో మనస్పర్థలు కలుగుటకు అవకాశం కలదు . ప్రయత్నాలలో జాగ్రత్తగా ఉండటం వలన మేలుజరుగుతుంది. వారం ఆరంభంలో కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు కలుగుటకు అవకాశం కలదు కావున మీ జాగ్రత్తలో మీరు ఉండుట మేలు. వారం మధ్యలో బుద్దిబలంతో చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. అనుకున్న పనులు సాగుతాయి. బంధువులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ధనలాభం ఉంటుంది. వారితో కలిసి నూతన ఆలోచనలకు శ్రీకారం చుడతారు. ఇతరుల మూలాన మానసికంగా సమస్యలు కలుగుటకు అవకాశం కలదు కావున తగిన జాగ్రత్తలు తీసుకోండి. కొన్నివిషయాల్లో ఫలితాలు ఆశించక పోవడం సూచన. నూతన విషయాల పైన ప్రత్యేక దృష్టిని కలిగి ఉంటారు. ఇతరులకు ఉపయోగపడే విధంగా ఆలోచనలు చేస్తారు. అధికారులతో మాత్రం నిదానంగా ఉండుట వారికి అనుకూలమైన ఆలోచనలు చేయుట మంచిది. రాజకీయాలలో బాగా రాణించే అవకాశం కలదు. వాటిపైన దృష్టిని సారించుట ఉత్తమం. కలహములకు దూరంగా ఉండుట అనేది సూచన. అకారణంగా భయంను కలిగి ఉంటారు. దైవధ్యానం మంచిది. మరిన్ని ఫలితాల కోసం లక్ష్మీఆరాధన, రాఘవేంద్ర స్వామిని పూజించుట మంచిది అలాగే ప్రతిరోజు కనకధారస్తోత్రం పారాయణ చేయుట మంచిది. 

మకర రాశి
ఈవారం నూతన ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. అనుకోకుండా చేయుపనులు మీకు లాభంను కలిగించుటకు అవకాశం కలదు. సమాజంలో గుర్తింపును కలిగించే పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. ఇతరులకు లాభాన్ని చేకూర్చే పనులను చేపడుతారు. వారం మొదట్లో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నా, రానురాను ప్రయత్నాలలో విజయాన్ని సాదిస్తారు. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. వ్యాపారస్థులకు చెప్పుకోదగ్గ లాభాలు లేకున్నా నష్టాలు ఉండకపోవచ్చును. బంధువులతో కలిసి భోజనం చేయుటకు అవకాశం కలదు. మృష్టాన్నభోజన ప్రాప్తిని కలిగి ఉంటారు. సంతోషంగా గడుపుటకు అవకాశం ఉంది. అందరిని కలుపుకొని వెళ్ళుట. ఈవారం మీ ఆలోచనల్లోని వేగం వలన చాలావరకు పనులను పూర్తిచేస్తారు. చర్చాసంభందమైన విషయాల్లో సమయాన్ని గడుపుతారు. అలాగే అందరిలోను గుర్తింపును ఆశిస్తారు. వినోదములలొ పాల్గొనుటకు అవకాశం కలదు. మనోధైర్యంను కలిగి ఉండి సాహసోపేతమైన ఆలోచనలు చేస్తారు. అధికారులతో జాగ్రత్తగా ఉండుట, మాటలను సమయానికి అనుకూలంగా వాడుట మేలు. మరిన్ని ఫలితాల కోసం లక్ష్మీనరసింహా ఆరాధన, గాయత్ర్రీ పూజ చేయుట అలాగే దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు చదువుట మంచిది. 

కుంభ రాశి
ఈవారం మీ ఆలోచనలు ఖర్చును పెంచుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో అభివృద్దిని పొందుటకు అవకాశం కలదు. నూతన ఆలోచనలు చేస్తారు. అవి కలిసి వచ్చే అవకాశం కలదు. ఇష్టమైన పనులను చేపట్టే అవకాశం కలదు. నచ్చిన వారితో సమాలోచనలు చేయుటకు అవకాశం కలదు. బంధుమిత్రులతో చేయుపనిలో అనుకున్నదానికన్నా అధికమైన ఖర్చును పొందుతారు. సరైన ఆలోచనలు చేయుటలో విఫలం అయ్యే అవకాశం కలదు. నూతన పనులలో ఉత్సాహంను కలిగి ఉంటారు. ఆ ఉత్సాహంను చివరి వరకు కొనసాగించే పనులను చేపట్టుట ఉత్తమం. నూతన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది వారి మూలాన లాభంను పొందుటకు అవకాశం కలదు. నూతన అవకాశాలు పొందుతారు. వారం ఆరంభంలో అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. సరైన జాగ్రత్తలు చేపట్టుట మంచి ఆహారాన్ని తీసుకోవడం మంచిది. కుటుంబంలో నిర్ణయాలను తీసుకొనే ముందు బాగా ఆలోచించుట అలాగే అందరికి అమోద్యయోగమైన ఆలోచనలు చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబంలో మనస్పర్థలు కలుగుటకు అవకాశాలు కలవు జాగ్రత్త. బంధుమిత్రుల చర్యలను ఇష్టపడక పోవచ్చును. అకారణంగా ఏర్పడు కలహముల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోండి చేపట్టే పనులను అందరిని కలుపుకొని ప్రారంబించుట సూచన. మంచిఫలితాల కోసం నవగ్రహ ఆరాధన చేయుట, శివభిషేకం చేయుట ప్రతిరోజు దుర్గాష్టకం చదువుట మంచిది.  

మీన రాశి
ప్రయత్నాలలో అనుకోని అవాంతరాలు కలుగుటకు అవకాశం కలదు. ప్రయాణాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం కలదు సర్దుకుపొండి. వారం ఆరంభంలో మనోవిచారంను పొందుటకు అవకాశం కలదు. అశుభవార్తను వినుటకు అవకాశం కలదు. భాదను కలిగి ఉంటారు. మిత్రుల సహకారంతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. నూతన ఆలోచనల వలన అందరిలోను గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ఏమాత్రం ఇబ్బందిని కలిగి ఉండరు, బాగుటుంది. వారం చివరలో అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం కలదు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మోకాళ్ళనొప్పులు కలుగుటకు అవకాశం కలదు. నివారణ చర్యలు చేపట్టుట మంచిది. ఇష్టమైన వ్యక్తుల వలన మీ పనులు కొనసాగుతాయి ఇస్టకార్యసిద్ది కలదు. ప్రయత్నాలలో నిదానంగా అడుగులు వేయుట వలన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. స్థిరమైన ఆలోచనలు చేయుట సూచన. స్థానచలనం ఉంటుంది. మరొక ప్రదేశంలో ఉండవలసి రావొచ్చును. బంధువులలో మిత్రులలో గౌరవాన్ని కలిగి ఉంటారు. పెద్దల పరిచయాలు కలుగుటకు అవకాశం కలదు. మరిన్ని ఫలితాల కోసం సుబ్రమణ్య ఆరాధన, శివపూజ చేయుట అలాగే ప్రతిరోజు శివాష్టోత్తరం చదవండి మంచిది.   

మరిన్ని శీర్షికలు
annamayya pada seva