'గో' అంటే సంపద అని, కనుక "గోతెలుగు" అంటే "తెలుగు సంపద", "సంపదే తెలుగు" అనే అర్థాలు తీసుకోవచ్చని చెప్పిన జే కే భారవి గారు మొన్న దూరవాణిలో మాట్లాడుతూ "గో" అంటే "గోంగూర" కూడ స్ఫురిస్తోందని చమత్కరించారు. నిజానికి తెలుగువారు భోజనప్రియులన్నది ఏనాటినుంచో చెప్పుకుంటున్నదే. గోతెలుగులో వారం వారం మీకందించే వంటల శీర్షిక ఉపయోగంగా ఉందంటూ పలు విద్యుల్లేఖలు అందుతున్నాయి. అంతే కాకుండా కథ, కవిత, నవల, వ్యాసం, వార్త అనే తేడా లేకుండా ప్రతీ అంశాన్ని విశేషంగా ఆదరిస్తున్న పాఠక మిత్రులకు కృతజ్ఞతలు.
|
|
బన్ను |
సిరాశ్రీ |
|