Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaakoolu

ఈ సంచికలో >> శీర్షికలు >>

తెలుగు కవితలు - ఎస్.ఆర్. పృథ్వి

కావ్యం - మణిదీపం(కవిత)
తావివ్వని చోట స్థానం పొందడమంటే
పొడి పొడి మాటల పనికాదు
ఆధునిక తెలుగు సాహిత్య సౌధంలో
గిడుగుది తొలి మెట్టయితే
జాషువాది మలి మెట్టు
పట్టుదలను ఊపిరిగా శ్వాశించి
పద్యానికి ప్రాణ ప్రతిష్ట చేసిన మధుర శ్రీనాధుడు
ఆలోచనా అక్షర చినుకుల్లో తడిసి
ఖండకావ్య రచన కలువలా వికశించింది
రచనలో రమ్యత తేనెలా ప్రవహించి
పాటకులకు హృదయ రంజకమైంది
వర్ణనలకు నడక నేర్పి, సప్త వర్ణాలుగా తీర్చి,
కావ్యానికి రసపుష్టి కూర్చిన నవయుగ కవి చక్రవర్తి
కరుణ రసం నుండి పుట్టిన 'పిరదౌసి'
కావ్య కన్యలందరిలో శిల్ప సౌందర్య రాశి
కులమతాలు గీసుకున్న గీతల్ని దాటి
వాస్తవాలలో వెలుగు నింపిన విశ్వనరుడు
కాలాలు మారినా, కవులు తనువులు వాల్చినా,
కావ్యాలు మాత్రం కలకాలం నిలిచే 'మణి దీపాలు'

గానం (చిట్టి కవిత)
ఓటు వేసి
స్వేచ్ఛా గానం
చేద్దామనుకుంది
మానవత్యం!
నోటు చూసి
స్వార్ధ గానం
చేయిస్తోందిపుడు
రాజకీయం!

కొడుకు - కోడలు (చిట్టి కవిత)
కొడుకు
సమర్ధుడైతే
తండ్రికి నిశ్చింత!
కోడలు
కూతురైతే
అత్తకి పులకింత!

వాస్తవం (చిట్టి కవిత)
అంధకారం
రాజ్యమేలుతోంది
అధికారం
సొమ్ముచేసుకొంటోంది
ఆయుధం
అవినీతి!

మరిన్ని శీర్షికలు
Chepala Vepudu - Fish Fry