Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

అల్లరి నరేష్‌లా అనుష్క?

anushka same as naresh

టాలీవుడ్‌ అందాల భామ అనుష్క ఓ వెరైటీ చిత్రానికి ఒప్పుకుంది. టైటిల్‌ ‘సైజ్‌ జీరో’. నాజూగ్గా ఉండే పాత్రలోనూ, ఒబెసిటీతో భారీ శరీరంగల యువతిగానూ అనుష్క నటించనుంది ఈ సినిమాలో. 100 కేజీల పైన బరువులో కనిపిస్తుందట అనుష్క. కథ గురించి చెప్పగానే ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో ఈ సినిమా చేయడానికి అనుష్క ఒప్పుకుందట.కథ తీరు తెన్నులెలా ఉంటాయోగానీ ‘పాయింట్‌’ చూస్తుంటే అల్లరి నరేష్‌ నటించిన ‘లడ్డూబాబూ’ సినిమా గుర్తుకు వస్తుంది. ‘లడ్డూబాబు’లో మేకప్‌తోనే భారీ శరంరతో కూడిన పాత్రలో నెట్టుకొచ్చేశాడు అల్లరి నరేష్‌. అనుష్క అలా కాకుండా, స్వతహాగానే బరువు పెరగాలనే సంచలన నిర్ణయం తీసుకుంది. ఛాలెంజింగ్‌గా ఈ పాత్రను చేయాలనుకుంటుంది అనుష్క.‘ఐ’ సినిమా కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టాడు హీరో విక్రమ్‌. అలాంటి సాహసమే ‘సైజ్‌ జీరో’ సినిమాతో అనుష్క చేస్తుందనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అనుష్క అందాల తార. నాజూకు అందానికి పెట్టింది పేరు. భారీ శరీరంగల అనుష్కని తెరపై చూసి ప్రేక్షకులు ఎలా ఫీలవుతారో సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది. అనుష్క గట్స్‌కి ఆమెను అభినందించకుండా ఉండలేం.

మరిన్ని సినిమా కబుర్లు
hit guarantee with charan - sreenu vaitla