Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anushka same as naresh

ఈ సంచికలో >> సినిమా >>

చరణ్‌తో హిట్‌ గ్యారంటీ: శ్రీనువైట్ల

hit guarantee with charan - sreenu vaitla

రామ్‌చరణ్‌తో చేయబోయే సినిమా సెన్సేషనల్‌ హిట్‌ అయ్యేలా ఉండబోతోందని దర్శకుడు శ్రీనువైట్ల చెబుతున్నాడు. ‘ఆగడు’ నిరాశపరిచాక శ్రీనువైట్ల కొంచెం గ్యాప్‌ తీసుకుని చేస్తున్న సినిమా ఇది. ‘నాయక్‌’తో హిట్‌ అందుకున్న డివివి దానయ్య, మళ్ళీ చరణ్‌తోనే ఈ సినిమా నిర్మిస్తున్నారు.మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చరణ్‌, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా ప్రారంభోత్సవానికి. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా మంచి కథ కుదిరిందని, చరణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందని చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల కాన్ఫిడెంట్‌గా చెప్పాడు సినిమా ప్రారంభోత్సవంలో. రామ్‌చరణ్‌ సరసన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘లక్ష్యం’ చిత్రాల ఫేం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటించనుంది.‘వై దిస్‌ కొలవెరి కొలవెరి..’ అనే పాటతో ప్రపంచాన్ని ఊపేసిన సంగీత దర్శకుడు అనిరుధ్‌ సంగీత దర్శకత్వం అందించనున్న ఈ చిత్రానికి కథ కోన వెంకట్‌, గోపీమోహన్‌ అందిస్తున్నారు. పవర్‌ఫుల్‌గా ఉంటూనే ఎంటర్‌టైనింగ్‌గా చిత్రాన్ని దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించనున్నాడు.

మరిన్ని సినిమా కబుర్లు
superstar son with Crime humorous