Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
hit guarantee with charan - sreenu vaitla

ఈ సంచికలో >> సినిమా >>

క్రైమ్‌ కామెడీతో సూపర్‌ స్టార్‌ అల్లుడు

superstar son with Crime humorous

హర్రర్‌ కామెడీతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం ‘ప్రేమ కథా చిత్రం’. ఆ సినిమాతో హీరోగా హిట్‌ కొట్టాడు సుధీర్‌ బాబు. సూపర్‌ స్టార్‌ కృష్ణ అల్లుడైన సుధీర్‌ బాబు, తెలుగు సినీ రంగంలో హీరోగా సక్సెస్‌లు అందుకూంటూనే విభిన్నమైన చిత్రాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నాడు. సుధీర్‌బాబు కొత్త సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’. 1971లో సూపర్‌ స్టార్‌ కృష్ణగా ‘మోసగాళ్ళకు మోసగాడు’ సినిమా వచ్చింది. కౌబాయ్‌ కథాంశంతో వచ్చిన ఆ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. ఆ టైటిల్‌తో ఇన్నాళ్ళకు తెలుగులో ఇంకో సినిమా వస్తుంది. పాత సినిమాతో తమ సినిమాకి టైటిల్‌ తప్ప ఇంక దేంట్లోనూ పోలిక ఉండదని సుధీర్‌ చెప్పాడు.క్రైమ్‌ కామెడీతో ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రం ఉంటుందనీ ఇదో విభన్న తరహా చిత్రమని చెబుతున్న సుధీర్‌, నటుడిగా తనను ఇంకో మెట్టు ఎక్కించే చిత్రంగా ‘మోసగాళ్ళకు మోసగాడు’ ఉండబోతుందని అన్నాడు. సీనియర్‌ నటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. నెల్లూరి బోస్‌ ఈ చిత్రానికి దర్శకుడు.

మరిన్ని సినిమా కబుర్లు
' Invasion ' to the NTR Ready