Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
superstar son with Crime humorous

ఈ సంచికలో >> సినిమా >>

‘దండయాత్ర’కి ఎన్టీఆర్‌ రెడీ

' Invasion ' to the NTR Ready

‘టెంపర్‌’ సినిమాతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసిన ఎన్టీఆర్‌, ‘దండయాత్ర’నే తన కొత్త సినిమాకి టైటిల్‌ అయితే బాగుంటుందని అనుకుంటున్నాడట. ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా ఓ సినిమా రానుంది. తండ్రీ కొడుకులుగా జగపతిబాబు, ఎన్టీఆర్‌ ఈ సినిమాలో నటించనున్నారట.చాలా పేర్లను అనుకుని చివరకు ‘దండయాత్ర’ అనే టైటిల్‌ అయితే బాగుంటుందని ఎన్టీఆర్‌, సుకుమార్‌కి చెప్పాడని, సుకుమార్‌ కూడా ఈ టైటిల్‌ బాగుందని భావించి నిర్మాతకు తెలియజేశాడనీ సమాచారమ్‌. ఏ సినిమా తీసినా డిఫరెంట్‌గా ఉండాలని భావించే సుకుమార్‌, ఎన్టీఆర్‌లోని డిఫరెంట్‌ యాంగిల్‌ని ఈ సినిమాలో చూపిస్తాడట. కథ, కథనం, హీరో బాడీ లాంగ్వేజ్‌ అన్నీ కొత్తగా ఉండేలా సుకుమార్‌ జాగ్రత్తలు తీసుకున్నాడట.దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సుకుమార్‌ చెప్పిన కథకి ఎన్టీఆర్‌ స్పెల్‌ బౌండ్‌ అయ్యాడంటే, సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. ‘టెంపర్‌’ సినిమాలో ‘ఇది దయాగాడి దండయాత్ర’ అని చెప్పే డైలాగ్‌కి ఫాన్స్‌ నుంచి సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అలా పాపులర్‌ అయిన ‘దండయాత్ర’ను తన సినిమా టైటిల్‌గా ఎన్టీఆర్‌ పెట్టుకుంటే, టైటిల్‌తోనే సగం హిట్‌ కొట్టేసినట్టే.

మరిన్ని సినిమా కబుర్లు
Visual Wonder ' rudramadevi '