Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

మ‌ధుబాల మ‌ద‌ర్ అన‌గానే చాలా ఫీల‌య్యా! - నిఖిల్‌

interview with nikhil

క్క హిట్టు కొట్ట‌గానే... క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌వైపు ప‌డుతుంటారంతా. కుర్ర హీరోలు కూడా అర్జెంటుగా మాస్ ఇమేజ్ తెచ్చేసుకోవాల‌ని తెగ ట్రై చేస్తుంటారు. ఆ ప్ర‌య‌త్నంలో భంగ‌ప‌డి... చేసిన త‌ప్పు తెలుసుకొనే లోగా... కెరీర్ శుభం కార్డు ట‌ర్నింగ్ తీసుకొంటుంది. నిఖిల్ కూడా ఇలానే త‌ప్పుల మీద త‌ప్పులు చేశాడు. మాస్ క‌థ‌ల‌వైపు ప‌రుగులు పెట్టాడు. స్వామి రారా ఆ ప‌రుగుల‌కు బ్రేకులు ప‌డ్డాయి. అక్క‌డి నుంచి కొత్త‌క‌థ‌ల వైపు, కొత్త కాన్సెప్టుల వైపు న‌డిచాడు. స్వామి రారా, కార్తికేయ ఇలా వ‌రుస‌గా రెండు హిట్లు కొట్టాడు. ఇప్పుడు సూర్య వ‌ర్సెస్ సూర్య కూడా కాన్సెప్ట్‌ని న‌మ్ముకొన్న క‌థే. ఈ సినిమా గురువారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా నిఖిల్‌తో గో తెలుగు జ‌రిపిన ముచ్చ‌ట్లు ఇవీ..

* హోలీ శుభాకాంక్ష‌లు..
- థ్యాంక్సండీ.. మీక్కూడా హ్యాపీ హోలీ..

* థియేట‌ర్ల‌లో పండ‌గ చేసుకొంటున్నారా?
- ఔనండీ... ఈసారి సూర్య వర్సెస్ సూర్య‌తో పండ‌గ చేసుకొంటున్నాం. అన్ని థియేట‌ర్ల‌నుంచీ పాజిటీవ్ గా రిపోర్ట్ వ‌స్తున్నాయి. సినిమా బాగుంది... కొత్త పాయింట్ అంటున్నారు. మేం చాలా హ్యాపీ.

* ఈమ‌ధ్య కాన్సెప్ట్ క‌థ‌ల‌పై ప‌డ్డ‌ట్టున్నారు..
- ఇది వ‌ర‌కు నాకు పెద్ద‌గా ఆప్ష‌న్స్ ఉండేవి కావండీ. ఎక్కువ‌గా మాస్ రోల్స్ ద‌గ్గ‌రే స్ట్ర‌క్ అయిపోయేవాడ్ని.  స్వామి రారాతో నాకు కొత్త పాత్ర‌ల‌కు గేట్లు తెర‌చుకొన్నాయి. కాన్సెప్ట్ క‌థ‌లు వ‌స్తున్నాయి. నాకు ఆప్ష‌న్స్  ఎక్కువయ్యాయి. ఓ సినిమా చూడాలంటే `ఏముంది?  అందులో కొత్త‌ద‌నం` అని క్వ‌శ్చ‌న్ చేస్తున్నారంతా. ఆ కొత్త‌ద‌నం ఉన్న కాన్సెప్ట్ క‌థ‌ల‌నే ఎంచుకొంటున్నా.

* సూర్య వ‌ర్సెస్ సూర్య కాన్సెప్ట్ ఏంటో జ‌నాల‌కు ముందే చెప్పేశారు. అస‌లు కిటుకు తెలిసిపోతే ఇక కిక్కేముంటుంది? అనే భ‌యం వేయ‌లేదా?
- కొన్ని సినిమాల వ‌ర‌కూ ప్రేక్ష‌కుల్ని ముందే ప్రిపేర్ చేసేయాలి. లేదంటే థియేట‌ర్లో అడుగుపెట్టాక క‌న్‌ఫ్యూజ‌న్ మొద‌లైపోతుంది. హీరోకి జ‌బ్బేంటి??  అని అనుకొంటే మా ప్ర‌య‌త్నం వృథా అవుతుంది. అందుకే వాళ్ల‌ని ప్రిపేర్ చేస్తున్నాం. హీరోకి ఫ‌లానా జ‌బ్బుంద‌ని చెప్పాంగానీ.. క‌థేంటో చెప్ప‌లేదు క‌దా.  కార్తికేయకీ కాన్సెప్ట్ ముందే రివీల్ చేశాం. అది మా సినిమాకి ప్ల‌స్ అయ్యింది..

* కాన్సెప్ట్ చూస్తే జ‌నాలు థ్రిల్ల‌ర్ అనుకొంటారు... కానీ మీరు ప్రేమ‌క‌థ చూపించారు..
- అదేనండీ ఈ సినిమాలో కొత్త‌ద‌నం. సాధారణంగా ఇలాంటి జోన‌ర్‌లో సినిమా అంటేనే థ్రిల్ల‌ర్ అనుకొంటారు. కానీ మా సినిమాలో అన్నీ ఉన్నాయి. ల‌వ్‌, సెంటిమెంట్‌, కామెడీ, ఎమోష‌న్స్‌... వీటితో పాటు మీర‌డిగే థ్రిల్లింగ్ ఎక్స్పీరియ‌న్స్ కూడా ఉంది. ఓ కొత్త‌ర‌క‌మైన పాయింట్‌ని క‌మ‌ర్షియ‌ల్ పంథాలో చెప్పే ప్ర‌య‌త్నం చేశాం.

* మెల్లిగా ల‌వ‌ర్‌బోయ్‌గా మారాల‌నుకొంటున్నారన్న‌మాట‌?
- ఫ‌లానా క‌థ‌లే చేయాలి.. నా క‌థ ఇలానే ఉండాలి అనే రూల్ పెట్టుకోలేదండీ. స్వామి రారా త‌ర‌వాత క్రైమ్ కామెడీ క‌థ‌లు చాలా వ‌చ్చాయి. కానీ నేనేదీ ఒప్పుకోలేదు. ఆ త‌ర‌వాత థ్రిల్ల‌ర్ చేశా. ఇప్పుడో ల‌వ్ స్టోరీ. ల‌వ‌ర్‌బోయ్ కావాల‌నుకొంటే అన్నీ ల‌వ్‌స్టోరీలే చేసేవాడ్ని.

* మ‌ధుబాల, భ‌ర‌ణిలాంటి సీనియర్ల‌తో న‌టించారు.. ఎలా అనిపించింది?
- నిజం చెప్పాలంటే ఈ సినిమాలో మ‌ధుబాల నాకు మ‌ద‌ర్ అన‌గానే చాలా నిరాశ‌కు గుర‌య్యా. ఎందుకంటే ఆవిడంటే నాకు చాలా ఇష్టం. రోజా, జెంటిల్‌మెన్‌ సినిమాల్ని చాలాసార్లు చూశా. ముదినేప‌ల్లి మ‌డిచేలో ముద్దుగుమ్మ‌... పాటంటే చాలా చాలా ఇష్టం. అలాంటి హీరోయిన్ ఈసినిమాలో నాకు మ‌ద‌ర్ అయ్యారు. ఆవిడ నుంచి చాలా నేర్చుకొన్నా. ఎంత సీనియ‌ర్ అయినా ద‌ర్శ‌కుడు వ‌న్ మోర్ అని అడ‌గ్గానే... ఎన్ని టేకుల‌కైనా సిద్ధం అనేవారు. అంత క‌మిట్ మెంట్ ఆమెది. ఇక భ‌ర‌ణిగారు సూప‌ర్బ్ యాక్ట‌ర్‌. ఏర‌క‌మైన పాత్ర‌కైనా న్యాయం చేసే అరుదైన న‌టుడు. ఆయ‌న ద‌ర్శ‌కుడు కూడా. మిథునం అద్భుతంగా తీశారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఆయ‌న కొన్ని స‌ల‌హాలిచ్చారు. అవి ఎప్ప‌టికీ మ‌ర్చిపోను.

* యుస్‌లో ప్రింట్లు పెంచారు. అక్క‌డి మార్కెట్ పై దృష్టి పెట్టారా?
- స్వామి రారా, కార్తికేయ అక్క‌డ బాగా ఆడాయి. కొత్త‌ర‌కం కాన్సెప్ట్ వ‌స్తే.. అక్క‌డ బాగా రిసీవ్ చేసుకొంటారు. సో.. ఇలాంటి సినిమాలకు హోప్ వాళ్లే.

*  కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కి ఇది వ‌ర‌కు ద‌ర్శ‌క‌త్వ అనుభ‌వం లేదు. కేవ‌లం కాన్సెప్ట్ న‌మ్మి అవ‌కాశం  ఎలా ఇచ్చారు?
- స్వామి రారాకి కెమెరామెన్‌గా ప‌నిచేశాడు. ఆ స‌మ‌యంలో స్టోరీ డిస్క‌ర్ష‌న్‌లో పాలుపంచుకొనేవాడు. ఇది వ‌ర‌కు ఓ షార్ట్ పిల్మ్ తీశాడు. అది అద్భుతంగా ఉంది. ఫ‌ర్హాన్ అక్త‌ర్‌లాంటి వాళ్లు ఆషార్ట్ ఫిల్మ్ చూసి మెచ్చుకొన్నారు. అత‌నిలో విష‌యం ఉంద‌నిపించింది. పైగా త‌ను ద‌ర్శ‌కుడు కావాల‌ని ఈ రంగంలోకి వ‌చ్చాడు. త‌ను త‌ప్ప‌కుండా అనుకొన్న కాన్సెప్ట్‌ని అనుకొన్న‌ట్టు తెర‌పై చూపిస్తాడ‌న్న న‌మ్మ‌కం క‌లిగింది.

* ఈ సినిమా కోసం కాస్త స్లిమ్ అయ్యారు..  మ‌రి సిక్స్‌ప్యాక్ ఎప్పుడు చేస్తారు?
- తెర‌పై నేను ఎలా క‌నిపించాలో డిసైడ్ చేసేది నా దర్శ‌కులే. వాళ్లు ఎలా క‌నిపించ‌మంటే అలా క‌నిపిస్తా. సిక్స్ ప్యాక్ చేయ‌మంటే చేస్తా.. లేదూ.. బొద్దుగా మార‌మంటే మార‌తా. 

* హీరోగా హిట్లు కొట్టారు. బిజీ అయ్యారు. మ‌రి పెళ్లెప్పుడు..?
- నేనింకా చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. ప్ర‌స్తుతం కెరీర్‌పైనే దృష్టి పెడుతున్నా..

* కొంప‌దీసి ప్రేమ‌లో ప‌డ్డారా?
- అలాంటిదేం లేదు. నా పెళ్లి బాధ్య‌త అంతా అమ్మానాన్న‌ల‌దే. కెరీల్‌లో ఎద‌గాల్సిన వ‌య‌సులో ప్రేమ పేరుతో కాల‌క్షేపం చేయ‌లేను.

* వ‌ర‌ల్డ్ క‌ప్ సీజ‌న్‌.. క్రికెట్ చూస్తున్నారా?
- అప్పుడ‌ప్పుడూ. ఎందుకంటే సూర్య ప‌నుల్లో బిజీగా గ‌డిపాను క‌దా. క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ నుంచి సీరియ‌స్‌గా ఫాలో అవుతా..

* ఒకే ఆల్ ది బెస్ట్‌..

- థ్యాంక్యూ వెరీమ‌చ్‌,....​
మరిన్ని సినిమా కబుర్లు
Naa Paata 6 - Gurthukostunnayi - Naa Autograph Sweet Memories