Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Top acting rasikhanna

ఈ సంచికలో >> సినిమా >>

350 డేస్‌ని క్రాస్‌ చేసిన'లెజెండ్‌'

350 Days to cross the 'Legend'

హిట్‌ సినిమా అయినా 50 రోజులు ప్రదర్శితమవడం కష్టమైపోయిన రోజుల్లో బాలకృష్ణ నటించిన 'లెజెండ్‌' సినిమా 350 రోజులు ప్రదర్శితమైంది. పొద్దుటూరు, ఎమ్మిగనూరు కేంద్రాల్లో 'లెజెండ్‌' విజయవంతంగా 350 రోజులు ప్రదర్శితమైన ఘనతను సొంతం చేసకుంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'లెజెండ్‌' బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో గత ఎన్నికల సమయంలో వచ్చిన 'లెజెండ్‌'లో రాధికా ఆప్టే, సోనాల్‌ చౌహన్‌ హీరోయిన్లుగా నటించారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు 'లెజెండ్‌'లో. బాలకృష్ణ రోరింగ్‌ పెర్ఫామెన్స్‌, జగపతిబాబు విలనిజం సినిమాకి హైలైట్స్‌గా నిలిచాయి. దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ అందించాడు ఈ చిత్రానికి. ప్రస్తుతం బాలకృష్ణ 'లయన్‌' సినిమాలో నటిస్తున్నారు. కొత్త దర్శకుడు సత్యదేవా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా రాధికా ఆప్టే హీరోయిన్‌గా చేస్తోంది. 'లయన్‌' సినిమాలో అర్చన స్పెషల్‌ సాంగ్‌లో నర్తించనుంది. సీబీఐ ఆఫీసర్‌గా బాలకృష్ణ పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించనున్న 'లయన్‌' ఈ సమ్మర్‌లో ప్రేక్షకులను అలరించనుంది.

మరిన్ని సినిమా కబుర్లు
She still is still the same beauty