Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
మ‌హేష్, ఎన్టీఆర్‌ల‌కు ఎప్పుడో ప‌డిపోయా!  - త్రిథా చౌద‌రి


తెలుగు సినిమాలో క‌థానాయిక పోస్టు దొరికేయ‌డం ఈజీనే. కానీ నిల‌బెట్టుకోవ‌డం మాత్రం క‌ష్టం. అందం - చందం ఉంటే హీరోయిన్ అయిపోవ‌చ్చు. కానీ నిల‌బెట్టుకోవాలంటే కుసిన్ని తెలివితేట‌లుండాలి. ఎలాంటి పాత్రలో అయినా స‌ర్దుకుపోయే నేర్ప‌రిత‌నం ఉండాలి. ఎక్స్‌పోజింగ్‌, లిప్ లాక్ అని అడిగితే.. 'య‌స్‌' చెప్ప‌గ‌లిగే ధైర్యం ఉండాలి. హీరోయిన్ అనే పాత్ర షో కేసులో బొమ్మ‌లా తీర్చిదిద్ద‌డానికే అనే మాట ఒప్పుకోగ‌లిగే గ‌ట్స్ ఉండాలి. చూస్తుంటే కొత్త‌మ్మాయి త్రిథ చౌద‌రికి ఇవ‌న్నీ ఉన్న‌ట్టే ఉన్నాయి. ఎందుకంటే ''ఎలాంటి పాత్ర అయినా ఓకే.. ఇస్తేనే క‌దా, స‌త్తా ఏంటో తెలుస్తుంది..'' అంటూ ముందే సంకేతాలిచ్చేసింది. ఈ బెంగాలీ బ్యూటీ... 'సూర్య వ‌ర్సెస్ సూర్య‌'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా త్రిథ‌తో జ‌రిపిన ముచ్చ‌ట్లు.
 


* హాయ్ త్రిథా...
- హాయ్‌...

* తొలి సినిమాతోనే హిట్ కొట్టేసిన‌ట్టేనా?
- ఈ సినిమా చూసిన‌వాళ్లంతా హిట్‌.. హిట్ అంటున్నారు. క‌లెక్ష‌న్లు సూప‌ర్బ్‌గా ఉన్నాయి. నా ఫ‌స్ట్ మూవీకే ఇంత రెస్పాన్స్ నేను ఊహించ‌లేదు. అంతా క‌ల‌లా ఉంది.

* క‌థ చెబుతున్న‌ప్పుడు.. ఈ సినిమా కోసం ప‌నిచేస్తున్న‌ప్పుడు ఏం అనిపించింది?
- క‌థ చెబుతున్న‌ప్పుడు చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ద‌ర్శ‌కుడు క‌థ చెప్పిన విధానం చూసి....త‌ప్ప‌కుండా ఇది మంచి సినిమా అవుతుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగింది. సెట్స్‌పైకొచ్చాక‌.. ఆ న‌మ్మ‌కం మ‌రింత బ‌ల‌ప‌డింది.

* క‌థానాయిక కోసం ఎనిమిదివంద‌ల మందిని ఆడిష‌న్స్ చేసి మిమ్మ‌ల్ని ఎంచుకొన్నార్ట‌...
- ఔను. అస‌లు ఇంత ఓపికతో న‌న్ను ఎలా అన్వేషించారో నాకు అర్థం కాలేదు. నిజానికి ఈ సినిమా ఆఫ‌ర్ వ‌చ్చినప్పుడు నేను నా స్ట‌డీస్ తో బిజీగా ఉన్నా.  కానీ 800మందిని ఆడిష‌న్స్ చేసి న‌న్ను ఎంచుకొన్నార‌ని తెలిసి ఉద్వేగానికి లోన‌య్యా..

*  ఇదో డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో సాగిన సినిమా. డాన్సుల‌కూ, స్కిన్ షోకీ అవ‌కాశ‌మే రాలేద‌ని ఫీల్ అయ్యారా?
- అబ్బే అలాంటిదేం లేదు. అస‌లు క‌థ‌లో ఉన్న గ‌మ్మ‌త్తే అది. ఏ సినిమా చూసినా అవే క‌దా క‌నిపిస్తున్నాయి. మా సినిమాలోనూ అవే చూపిస్తే ఎలా??  మా సినిమా న‌చ్చిందంటే కార‌ణం.. క‌థ‌లో ఉన్న కొత్త‌ద‌న‌మే.

* కానీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు రావాలంటే...పాట‌ల్లోనూ, డాన్సుల్లోనూ ప్ర‌తిభ చూపించాలి క‌దా?
- మీర‌న్న‌ది క‌రెక్టే. కానీ.. ఇలాంటి అవ‌కాశం ఎప్పుడోగానీ రాదు. వ‌చ్చిన‌ప్పుడు స‌ద్వినియోగం చేసుకోవాలి. నేను ఇదివ‌ర‌కు కొన్ని బెంగాలీ సినిమాల్ని చేశా. వాటిలో అన్నీక‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో న‌డిచేవే. నా తొలి తెలుగు సినిమానే ఓ డిఫ‌రెంట్ జోన‌ర్‌లో చేయ‌డం చాలా సంతృప్తినిచ్చింది.

* తెలుగు క‌ష్టం అనిపించ‌లేదా?
- ఈవిష‌యంలో నిఖిల్‌కీ, కార్తిక ఘ‌ట్ట‌మ‌నేనికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు సన్నివేశాన్ని అర్థ‌మ‌య్యేలా వివ‌రించారు. వీళ్ల ద‌య వ‌ల్లే అంతే ఇంతో తెలుగు అర్థ‌మ‌వుతోంది.

* తెలుగులో మాట్లాడ‌డం ఎప్పుడు నేర్చుకొంటారు?
- రెండు సినిమాలు ఆగండి.. మాట్లాడ‌డ‌మే కాదు, పాట‌లూ పాడేస్తా.  ప్ర‌స్తుతానికి ఒకే ఒక్క వాక్యం నేర్చుకొన్నా.. `న‌న్ను ప‌డేయ‌డం అంత ఈజీ కాదు.`... (న‌వ్వుతూ)

* మీరు మంచి సింగ‌ర‌ని తెలిసింది?
- పాట‌లంటే చాలా ఇష్టం. నా గొంతు కూడా బాగుంటుంది అంటుంటారు. కానీ నిజంగానే పాట‌లెప్పుడూ ట్రై చేయ‌లేదు.

* తెలుగు సినిమాలేమైనా చూశారా?
- చాలా.. నాకు మ‌హేష్ బాబు అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ డాన్సులంటే భ‌లే ఇష్టం. వీళ్లిద్ద‌రికీ ఎప్పుడో ప‌డిపోయా. ఎప్పుడో ఒక‌ప్పుడు వీళ్లిద్ద‌రితో క‌ల‌సి త‌ప్ప‌కుండా న‌టిస్తా..

*  ప్ర‌స్తుతానికి మీ డ్రీమ్ ఇదేనా?
- ఇదే అనుకోవ‌చ్చు. అయితే ఫ‌లానా పాత్ర‌లు చేయాలి అని మాత్రం ఏమీ అనుకోలేదు. అందుకంటే ఆర్టిస్ట్ ఎప్పుడూ ఫ్రీ మైండ్‌తో ఉండాలి. ఎలాంటి పాత్ర ఇచ్చినా మెప్పించాలి. ఓ ప‌ది ప‌దిహేను సినిమాలు చేశాక‌, నాకేం వ‌చ్చు, ఏం చేశాను అనేది తేల్చుకొన్నాక అప్పుడు డ్రీమ్ గురించి ఆలోచిస్తా.

* ఈ సినిమా చేస్తున్న‌ప్పుడు విష్ణు సినిమాలో న‌టించే ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని, మీరు `నో ` చెప్పార‌ని తెలిసింది..
- నో చెప్ప‌లేదు.. కానీ కుద‌ర్లేదు. కానీ త‌ప్ప‌కుండా నేను విష్ణుతో క‌ల‌సి న‌టిస్తా...

* ఇంత‌కీ తెలుగు ప‌రిశ్ర‌మ ఎలా ఉంది?
- చాలా స్పోర్టివ్‌గా ఉంది. అంద‌రూ.. ప్రోత్స‌హిస్తున్నారు. సెట్లో వాతావ‌ర‌ణం నాకు బాగా న‌చ్చింది. కొత్త‌మ్మాయినైనా బాగా చూసుకొన్నారు. ఇక్కేడే ఉండిపోవాల‌నేంతగా న‌చ్చేసింది.

* ఒప్పుకొన్న సినిమాలేంటి?
- ప్ర‌స్తుతానికైతే క‌థ‌లు వింటున్నా. త్వ‌ర‌లోనే ఓ గుడ్ న్యూస్ చెబుతా.

* అయితే రాబోయే సినిమాల‌కు ఆల్ ది బెస్ట్‌..
- థ్యాంక్యూ..

కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
Naa Paata 7 - Lali O Lali - Damarukam