Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

Happy Ugadi

జ్యోతిష్యం -విజ్ఞానం - శ్రీకాంత్

గురుభ్యోర్నమః  

 
జ్యోతిషశాస్త్రం నేటి కాలగణను చేయగలదా ? ప్రస్తుతం ఉన్న సాంకేతిక ప్రపంచంలో మానవుని విజ్ఞాన మేధస్సుకు సమాధానం చెప్పగలదా ? చాలామందిని ఈ ప్రశ్న వేదిస్తూ ఉండవచ్చును లేదా జ్యోతిషం అనేది లేదు అనే వాళ్ళ యొక్క ప్రశ్న కావొచ్చు మనం మరొక్కసారి కాలగమనం యొక్క విధానం చూద్దాం.

భూమి తనచుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక స్థిరమైన కక్ష్యను (ఆర్బిట్ ) ను ఆధారంగా చేసుకొని తిరుగుతుంది ఈయొక్క కాలంను మనం సంవత్సరం అంటున్నాం అనగా సంవత్సరానికి 365 రోజులు లేదా 4 సంవత్సరాలకు ఒకసారి 366 రోజులు వస్తుంది. మన పూర్వీకులైన బ్రహ్మ గుప్తుడు క్రీ.పూ 628 లో సంవత్సరం యొక్క పరిమితి 365. 26875 గా తెలియజేసాడు  అలాగే ,క్రీ,శ 499లో ఆర్యభట్ట సంవత్సరం పొడువును 365.25848  గా తెలియజేసాడు. భాస్కారాచార్యుడు క్రీ,శ  1150 లో సంవత్సరం అనగా 365. 25848 గా తెలిపాడు. ప్రస్తుతమనం ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనల ద్వార వాడుతున్న పొడువు 365. 256360 రోజులు. అనగా మన పూర్వీకులు తెలిపిన దానికి మనం నేడు వాడుతున్న దానికి గల వ్యత్యాసం 2 నిమిషాల 53 సెకన్లు తేడా మాత్రమే ఆరోజుల్లో మన పూర్వీకులు వేద గణితం సహాయంతో వేసిన లెక్కలు అవి ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండగా.

మన  జ్యోతిష వైజ్ఞానికులు రెండు సూర్యోదయాల మధ్యకాలాన్ని రోజుగా తెలిపారు. దీనియొక్క ప్రమాణం 24 గంటలు లేదా 60 ఘడియలు. సూర్యుని చుట్టూ అనునిత్యం తిరిగే భూమియొక్క వేగం స్థిరవేగం కాకపోవడంతో ఈ యొక్క కాలప్రమాణం కూడా మారుతుంటుంది. మన పూర్వీకులు కేవలం సంవత్సరం కాలాన్ని మాత్రమె కాకుండా నక్షత్రమాసం,చంద్రమాసం అని తెలియజేసారు చంద్రుని యొక్క గతిని ఆధారంగా చేసుకోండి చాంద్రమాసం తెలియజేసారు అనగా రెండు అమావాస్యలు లేదా పొర్ణమి ల మధ్య కాలాన్ని చంద్రమాసం అంటాం. అలాగే చంద్రుడు ఒక నక్షత్రం నుండి భయలు దేరి తిరిగి మళ్ళి అదే నక్షత్రానికి చేరే కాలాన్ని నక్షత్రమాసం అంటాం. చంద్రమాసం యొక్క నిడివి 29 రోజుల 7 గంటల 20 నిమిషాల నుండి 29 రోజుల 9 గంటల 30 నిమషాల మధ్యలో ఉంటుంది. నక్షత్రమాసం యొక్క పొడువు 27 రోజుల 3 గంటలు సుమారుగా ఉంటుంది. 

  మనం కాలాన్ని తిరిగి ఉత్తరాయణం ,దక్షిణాయనం అని విభజన చేసుకున్నాం వీటి యొక్క మధ్య కాలాన్ని విషవత్తులు అంటాం. మార్చి 21 న వసంత విషవత్తు అలాగే సెప్టెంబర్ 23 న శరద్ విశవత్తు లు ఏర్పడుతాయి ఈ రెండు రోజుల్లో పగలు అలాగే రాత్రీలు కలాం యొక్క నిడివి సమానంగా ఉంటవి అని మన పూర్వీకులు గమనించారు. చంద్రమానాన్ని ఆధారంగా చేసుకొని జ్యోతిషులు వారి యొక్క సిద్దాంతాన్ని విస్తరించారు. చంద్ర, సూర్య మాసాలకు గల భేదాన్ని అధికమాసం అంటారు. సూర్యుడు ఒక్కో రాశీలోకి ప్రేవేశించడాన్ని సంక్రాంతి అంటాం.      
మరిన్ని శీర్షికలు
jyoti patham