Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
is lion title   not belong to balayya ....

ఈ సంచికలో >> సినిమా >>

Happy Ugadi

జ్యోతిక అదరగొట్టేసింది

superb jyotika

తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా రాణించిన జ్యోతిక, హీరో సూర్యను పెళ్ళి చేసుకున్న తర్వాత సినీ రంగానికి దూరమైంది. కొంచెం తీరిక చేసుకుని సినిమాల్లోకి రీ`ఎంట్రీ ఇవ్వాలనుకున్న జ్యోతిక, ‘36 వయదినిలే’ అనే మూవీ తన రీ`ఎంట్రీకి బాగుంటుందని భావించి, ఆ సినిమా చేస్తుంది.మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘హౌ ఓల్డ్‌ ఆర్‌ యూ’ అనే సినిమాకి తమిళ రీమేక్‌ ఇది. తెలుగులో కూడా రానుంది ఈ సినిమా. తెలుగు వెర్షన్‌ గురించి ఇంకా ప్రకటన రాలేదు. తమిళ సినీ రంగంలో జ్యోతిక ‘36 వయదినిలే’ ట్రైలర్‌కి ఆశించిన స్పందన లభిస్తోంది. జ్యోతిక లుక్‌ కొత్తగా ఉందంటున్నారు. తమిళ ప్రేక్షకులకు బొద్దుతనం అంటే ఇష్టం. ఆ విషయంలో జ్యోతికకు మొదటి నుంచీ మంచి మార్కులే. ఈ ట్రైలర్‌లోనూ జ్యోతిక వయసుకు తగ్గ బొద్దుతనంతో ఎట్రాక్టివ్‌గా కనిపిస్తుంది.ఏదో సినిమా చేసెయ్యాలనే తొందరలో సినిమా చేయడంలేదని, అన్నీ ఆలోచించి తన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా ఉంటుందనే ‘హౌ ఓల్డ్‌ ఆర్‌ యూ’ సినిమా చేయడానికి సిద్ధమయ్యానని జ్యోతిక అంటోంది. ఇకనుంచీ రెగ్యులర్‌గా సినిమాలు చేస్తానంటున్న జ్యోతిక, నిర్మాణంతోపాటుగా, దర్శకత్వంపైన కూడా ఆలోచన ఉన్నట్లు వెల్లడిరచింది.

మరిన్ని సినిమా కబుర్లు
trivikram mark satyamurti