Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aaditya hrudayam - vn adithya

ఈ సంచికలో >> సినిమా >>

ఆపకుండా హాఫ్‌ కొట్టేశాడు

music directors fastest fifty

ఎస్‌.ఎస్‌.తమన్‌.. తమిళోడనుకున్నారంతా తొలుత. కానీ, తెలుగోడే. చాలా వేగంగా యాభై సినిమాలు పూర్తిచేసేయబోతున్నాడు  తమన్‌ సంగీత దర్శకుడిగా. వీటిల్లో చాలావరకు మ్యూజికల్‌గా సక్సెస్‌ అయిన సినిమాలే. ప్రస్తుతం టాలీవుడ్‌లో తమన్‌ హాట్‌ ప్రాపర్టీ. తమన్‌తో చేస్తే తమ సినిమా మ్యూజికల్‌ హిట్టేనని స్టార్‌ హీరోలు సైతం విశ్వసిస్తోన్న పరిస్థితి.

‘బాయ్స్‌’ సినిమాలో యంగ్‌ బాయ్స్‌ టీమ్‌లో తానూ ఒకడిగా నటించిన తమన్‌, వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. తమిళ, తెలుగు సినిమాలకు సంగీతం అందిస్తూ, దూసుకుపోతోన్న తమన్‌కి మహేష్‌ హీరోగా రానున్న ‘ఆగడు’ 50వ సినిమా. మహేష్‌తో ‘దూకుడు’, ‘బిజినెస్‌మేన్‌’ సినిమాలు చేసిన తమన్‌, ఆ రెండు సినిమాలతోనూ సూపర్‌ హిట్స్‌ కొట్టేశాడు. ఆ లెక్కన.. ‘ఆగడు’ విషయంలో ఎలాంటి డౌట్స్‌ అక్కర్లేదు.

శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోందీ ‘ఆగడు’ సినిమా. ఇంకేం, ‘దూకుడు’ మ్యాజిక్‌ రిపీట్‌ అవడం ఖాయం. తక్కువ టైమ్‌లో ఎక్కువ సినిమాలు.. అందునా సక్సెస్‌ఫుల్‌ మ్యూజిక్‌ ఇవ్వడం.. తమన్‌కే చెల్లిందేమో.

మరిన్ని సినిమా కబుర్లు
behind raasi voice