Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
music directors fastest fifty

ఈ సంచికలో >> సినిమా >>

రాశి గొంతు వెనుక కథ

behind raasi voice

‘సముద్రం’ సినిమాలో ‘ముద్దుల ముత్యాలే రాలు..’ అనే ఐటమ్‌ సాంగ్‌ గుర్తుందా.? ఆ పాటకి రాశి తన అందాల్ని జత చేసింది. సూపర్బ్‌గా వచ్చింది ఆ సాంగ్‌. అప్పట్లో ఆ సాంగ్‌ దుమ్మురేపింది. శశిప్రీతమ్‌ సంగీతం అందించాడు ఆ చిత్రానికి. అన్నట్టు, ఆ పాట పాడిరది లేడీ సింగర్‌ కాదు, శశిప్రీతమ్‌ తన వాయిస్‌లో కొంచెం మార్పు చేసి పాడేశాడు.

శశిప్రీతమ్‌ ఆ పాట పాడాడన్న సంగతి చాలా సస్పెన్స్‌గా వుంచారు. పాట పాడినవారి పేరు ‘ప్రీతి’ అని వేశారుగానీ, శశిప్రీతమ్‌ ఆ పేరు అలా వేయించాడని ఆ తర్వాత తెలిసింది. ఇప్పుడు ఆ పాట విన్నా అద్భుతంగా వుంటుంది, ఆ పాట పాడింది శశిప్రీతమ్‌ అంటే నమ్మలేం. లేడీ వాయిస్‌తో ప్రీతిగా శశిప్రీతమ్‌ ఎలా మేనేజ్‌ చేశాడో ఏమో.

కృష్ణవంశీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా వచ్చింది ఆ సినిమా. కమర్షియల్‌గా ఫర్వాలేదన్పించుకున్న ఆ సినిమా మ్యూజికల్‌ హిట్‌. జగపతిబాబు ఈ సినిమాలో కండలు తిరిగిన శరీరంతో కన్పించాడు. సాక్షి శివానంద్‌ హీరోయిన్‌.

మరిన్ని సినిమా కబుర్లు
china fights by prabhas