Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
china fights by prabhas

ఈ సంచికలో >> సినిమా >>

వ్యంగ్య చిత్రానికి వసూళ్ళ పంట

collections for satire movie

తెలుగు సినీ పరిశ్రమలో ఓ సినిమా కలకలం సృష్టిస్తోంది. అది బూతు సినిమా కాదు, ప్రముఖుడి సినిమా అంతకన్నా కాదు, వివాదాస్పద సినిమా అసలే కాదు. చిన్న సినిమా. చాలా తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన సినిమా. అయితే పబ్లిసిటీనే దంచేస్తున్నారు. అది కూడా వెరైటీగా. అసలేంటా సినిమా, ఏమా కథ.?

హీరో సంపూర్ణేష్‌బాబు. టైటిల్‌ ‘హృదయకాలేయం’. ఇది సెటైరికల్‌ మూవీ. తెలుగు సినిమాకి సంబంధించి పూర్తిస్థాయి సెటైరికల్‌ మూవీ అట. హీరోలమీదా, దర్శక నిర్మాతల మీదా.. ఈ సినిమాలో సెటైర్లు దంచేశారు. కొత్త హీరోకి ఇంత బిల్డప్పా.? అని ఆ సినిమా ట్రెయిలర్‌ చూసి తొలుత అంతా అనుకున్నా, సెటైర్‌ అని తెలిసే సరికి అందరూ షాక్‌ తినాల్సి వచ్చింది.

ఇప్పటికే ఇంటర్నెట్‌లోనూ, ఇతర మీడియా సంస్థల్లోనూ ఈ సినిమా గురించి చర్చ జోరుగా సాగుతోంది. ఓ సినిమాకి ఇంతకన్నా పబ్లిసిటీ ఇంకేముంటుంది.? ట్రెయిలర్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది గనుక, సంపూర్ణేష్‌బాబు ‘హృదయకాలేయం’ సినిమాకి ఓపెనింగ్స్‌ ఖాయం. సినిమా కాస్త పాజిటివ్‌గా వుంటే చాలు, వసూళ్ళకు తిరుగుండదు.

మరిన్ని సినిమా కబుర్లు
allu arjun with nadamuri balakrishna