Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
collections for satire movie

ఈ సంచికలో >> సినిమా >>

బాలకృష్ణ తో అల్లు అర్జున్‌!

allu arjun with nadamuri balakrishna

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకీ నందమూరి ఫ్యామిలీకీ మధ్య ఆధిపత్య పోరు గురించి ఎప్పటికప్పుడు రకరకాల కథనాలు తెరపైకొస్తుంటాయి. మా మధ్య ఎలాంటి ఆధిపత్య పోరూ లేదు.. అని చాలా సందర్భాల్లో ఇరు కుటుంబాలకు చెందినవారు చెబుతున్నా.. ఆధిపత్య పోరుపై కథనాలు ఆగవు.

చిరంజీవి, బాలకృష్ణల మధ్య టాలీవుడ్‌లో నడిచిన సినీ వార్‌.. ఈమధ్యకాలంలో పొలిటికల్‌గా మారింది కూడా. అయితే, తాము మంచి స్నేహితులమని బాలకృష్ణ, చిరంజీవి కొన్ని వివాదాల నేపథ్యంలో వివరణ ఇచ్చిన సందర్భాలున్నాయి.

ఆ సంగతి అటుంచితే, అమెరికాలో జులై 4 నుంచి జరగనున్న నాట్స్‌ సంబరాల్లో నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్‌ హాజరువుతుండడం విశేషం. ఇద్దరూ ముఖ్య అతిథులుగా నాట్స్‌ కార్యక్రమాల్లో పాల్గొంటారు. డల్లాస్‌లో ఈ వేడుకల కోసం ఎన్నారైలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

తమ అభిమాన హీరోలు వస్తుండడంతో.. అభిమానులు పెద్దయెత్తున స్వాగత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇద్దరూ వేదికపై కన్పించి, అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తడంతోపాటు.. అభిమానులంతా కలిసిమెలిసి వుండాలన్న సంకేతాలు పంపితే.. అంతకన్నా కావాల్సిందేముంది.?

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam