Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with Anjana Sowmya by Raja

ఈ సంచికలో >> సినిమా >>

రాజా మ్యూజిక్ ముచ్చట్లు

raja music muchchatlu

పకడో పకడో
3వ నంబర్ ఫొటోలో వున్న 'బ్రహ్మచారి' డీవీడీ కవర్ మీద నాగేశ్వర రావు, జయలలిత ఫొటోలు ఆ సినిమాకి సంబంధించినవి కావు. నాగేశ్వరరావు ఫొటో 'మూగ మనసులు' లోనిది. ఆ ఫొటో కి చెందిన సీన్ (1) అందులో ఏయన్నార్ క్లోజప్ (2) చూసి తెలుసుకోవచ్చు. ఇక జయలలిత ఫొటో ... అప్పట్లో విజయచిత్ర లో వచ్చింది (4). దాన్నే రివర్స్ చేసి పెట్టారు.





ఎమ్మెస్ విశ్వనాథమ్ హిందీ చిత్రం
1955 లో  ఎన్టీఆర్, జమున - అంజలీదేవి, రామశర్మ జంటలుగా 'సంతోషం' అనే సినిమా వచ్చింది. అదే సినిమా అదే జంటలతో 1956 లో 'నయా ఆద్మీ' గా వచ్చింది. ఎన్టీఆర్ కి అదే తొలి, ఆఖరి డైరెక్ట్ హిందీ చిత్రం.... తెలుగు వెర్షన్ లో రామశర్మ, అంజలీదేవి పై చిత్రీకరించిన 'తీయని ఈనాటి రేయి' అనే పాట ఇవాళ విన్నా ఎంతో మధురంగా వుంటుంది.

2011 లో రేడియో మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ గ్రాండ్ జ్యూరీ మెంబర్ గా నేను చెన్నై వెళ్ళడం జరిగింది. ఆ ఫంక్షన్ కి ఎమ్మెస్ విశ్వనాథమ్ గారు వచ్చారు. (అప్పటికింకా సుప్రీమ్ వారు ఈ సినిమా ని సీడీ గా విడుదల చెయ్యలేదు)

"సుశీల గారితో పాటు ఆ పాట ఎవరు పాడారండీ?" అని అడిగాను ఆయన ట్యూన్ ని ఆయనకే గుర్తు చేస్తూ...

"ఇంకెవరు ... మన వెంకటేశ్ ..జి.కె. వెంకటేశ్ ... ఆ సినిమాకి నాకు అసిస్టెంట్ గా కూడా వర్క్ చేశాడు." అన్నారాయన. (తర్వాతి తరంలో అదే జి.కె. వెంకటేశ్ కి ఇళయరాజా అసిస్టెంట్ గా వర్క్ చేశాడని ఈ సందర్భంగా చెప్పుకోవడంలో తప్పులేదు) 

"అదే సినిమా 'నయా ఆద్మీ' గా తీశారు కదా హిందీలో ? " అని అడిగాను.

"దానిక్కూడా మేమే (విశ్వనాథమ్-రామ్మూర్తి) మ్యూజిక్ ఇచ్చాం. ఈ పాటని హిందీలో లతా, హేమంత్ కుమార్ పాడారు 'లౌట్ గయా గమ్ కా జమానా' " అంటూ ఆల్మోస్ట్ ఆ హిందీ పాటంతా పాడి వినిపించారు ఎమ్మెస్ విశ్వనాథమ్.....  ఎక్కడ 1956 ఎక్కడ 2011 దాదాపు 55 ఏళ్ళు ... అవాక్కయిపోయాను ఆయన మెమొరీ పవర్ కి.  అంతేకాదు - ఒక్క చాన్స్ హిందీలో వస్తే చాలు బోలెడన్ని ఇంటర్ వ్యూలు , పబ్లిసిటి ప్లాన్ లున్న ఈ రోజులకి - గీతాదత్, లతా , హేమంత్ కుమార్, రఫీ, ఆశాభోంస్లే వంటి హేమాహేమీలతో హిందీలో పాడించి కూడా - అడిగితే గానీ చెప్పని ఆ తరం సింప్లిసిటీ కి ఎంత తేడా అనిపించింది.







రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
aaditya hrudayam - vn adithya