Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

సిక్స్‌ ప్యాక్‌లో అల్లు శిరీష్‌

allu shirsh with six pack

తెలుగు తెరపై సిక్స్‌ ప్యాక్‌ ట్రెండ్‌ని స్టార్ట్‌ చేసిన హీరో అల్లు అర్జున్‌. ‘దేశముదురు’ సినిమాలో అల్లు అర్జున్‌ సిక్స్‌ప్యాక్‌ ఫిజిక్‌తో కనిపించాడు. ఇప్పుడతని సోదరుడు అల్లు శిరీష్‌ తన తాజా సినిమాలో సిక్స్‌ ప్యాక్‌తో కనిపంచనున్నాడట. ఇప్పటికే సిక్స్‌ ప్యాక్‌ కోసం చెమటోడ్చుతున్న అల్లు శిరీష్‌, తెరపై పవర్‌ఫుల్‌ రోల్‌లో నటించి యాక్షన్‌ హీరోగా పేరు తెచ్చుకుంటాడని సమాచారమ్‌. గీతా ఆర్ట్స్‌ పతాకంపై రానున్న ఈ చిత్రానికి ‘మరీ జాన్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేశారంటున్నారు. తమన్‌ సంగీతం అందించనున్న ‘మేరీ జాన్‌’ చిత్రానికి పరశురామ్‌ దర్శకుడు. రవితేజతో ‘ఆంజనేయులు’, నిఖిల్‌తో ‘యువత’, నారా రోహిత్‌తో ‘సోలో’ చిత్రాల్ని తెరకెక్కించాడు పరశురామ్‌. అల్లు శిరీష్‌ కోసం పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ని పరశురామ్‌ తయారుచేశాడట. ‘మేరీజాన్‌’లో హీరోయిన్‌ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. సిక్స్‌ ప్యాక్‌తో ఈ సినిమాలో అల్లు అర్జున్‌ చేసే స్టంట్స్‌ ఎలా ఉంటాయో చూడాలిక.

మరిన్ని సినిమా కబుర్లు
srikant, nikhita terror