Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
first of not so bad

ఈ సంచికలో >> సినిమా >>

ఆచి తూచి అడుగేస్తున్న సుధీర్‌బాబు

sudheer babu getton step by step

ఒక్క సినిమా అతని ఆలోచననే మార్చేసిందట. ఆ సినిమా మరేదో కాదు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ఈ సినిమా వచ్చాక సుధీర్‌బాబు ఆలోచనల్లో చాలా మార్పు వచ్చిందంటున్నారు ఇండస్ట్రీలో. నటుడిగా ఎంతో పరిణతి చెందినట్లు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాలో నటించిన సుధీర్‌బాబు, ఇకపై ఎంపిక చేసుకునే చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పాడు. కమర్షియల్‌ హీరోకి కావాల్సిన అన్ని క్వాలిటీస్‌ సుధీర్‌బాబులో ఉన్నాయి. డాన్సులు చేస్తాడు, యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టేయగలడు. మొదటి సినిమాకి డైలాగ్స్‌ వీక్‌ అనే విమర్శలు ఎదుర్కొన్నా, ఇప్పుడా మైనస్‌ అతనికి లేదు. కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే, రెగ్యులర్‌ ఇంటర్వెల్స్‌లో నటనకు ప్రాధాన్యం ఉన్న మెసేజ్‌ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో నటించాలని సుధీర్‌బాబు అనుకుంటున్నాడట. సూపర్‌ స్టార్‌ కృష్ణ అల్లుడిగా సినీ రంగంలోకి వచ్చి, తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేయగలిగిన సుధీర్‌బాబు, కెరీర్‌లో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిద్దాం.

మరిన్ని సినిమా కబుర్లు
radhika apte not a heroin  singer  also