Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Insider

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (జూన్ 28 - జులై 05) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీకు మిశ్రమఫలితాలు కలుగుటకు అవకాశం కలదు. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. మృష్టాన్నభోజనప్రాప్తిని కలిగి ఉంటారు. ఉత్సాహంను కలిగిఉండి నూతన పనులను ఆరంభిస్తారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. కొన్నివిషయాల్లో నిర్ణయాలు తీసుకొనే ముందు మానసికదైర్యం అవసరం. చాలావరకు మాటను పొదుపుగా వాడుట ఉత్తమం. స్నేహితుల మూలాన ఇబ్బందులను పొందుతారు వారితో కలిసి నూతన ఆలోచనలు వాయిదా వేయుట మంచిది. ఉద్యోగంలో నిదానంగా ఉండుట అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది దూరప్రదేశాలకు ప్రయత్నం చేయుట అనుకూలిస్తుంది. సోదరవర్గం నుండి ఆశించనంతగా సహకారం అందకపోవచ్చును.        

వృషభ రాశి
ఈవారం అనుకూలమైన ఫలితాలను పొందుటకు అవకాశం కలదు జాగ్రత్తగా ప్రణాలిక చేసుకొని ముందుకు వెళ్ళుట ఉత్తమం. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో సమాలోచనలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులు మాత్రం తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం కలదు. మీ ఆలోచనలు గౌరవాన్ని కలుగజేస్తాయి పేరును కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బందిని పొందుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో సమయస్పూర్తిని కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. కొత్తకొత్త ఆలోచనలు కలిగి ఉండి ఆదిశగా ముందుకు వెళ్తారు. వారం చివర్లో నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీయొక్క వ్యతిరేకవర్గం నుండి మాత్రం ఇబ్బందులను పొందుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోండి.   

మిథున రాశి
ఈవారం ఏవైనా నిర్ణయాలు తీసుకొనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుట మంచిది. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తిచేయుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధువులతో కలిసి భోజనం చేయుటకు అవకాశం కలదు వారితో సమయాన్ని గడుపుతారు. కొనిపనులలో అధికమైన ఆలోచనలను పొందుటకు అవకాశం ఉంది నిదానంగా ఉండుట మంచిది. ప్రయాణాలలో ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు శారీరకంగా అలసిపోవుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుతాయి కాకపోతే కొంత మీ ఆలోచనలను పూర్తిగా తెలుపక పోవడం సూచన. అనుకోని వార్తలను వినుట మూలాన మానసికంగా విచారంను పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలను పొందుతారు నిదానంగా వ్యవహరించుట అలాగే అందరిని కలుపుకొని వెళ్ళుట వలన కొంత మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు కలుగుతాయి. 

కర్కాటక రాశి
ఈవారం మృష్టాన్న భోజనప్రాప్తిని కలిగి ఉంటారు. మీయొక్క బుద్ధిబలం చేత చాలావరకు పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. ధర్మసంభంద కార్యక్రమాల్లో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుట మూలాన అనుకోని ఖర్చులను కలిగి ఉంటారు. అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం కలదు తగిన జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది. కుటుంభంలో ఏవైనా నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుట ఉత్తమం. ప్రయత్నాలను విజయవంతంగా పూర్తిచేస్తారు. మీకునచ్చిన వ్యక్తులను కలుసుకొనుట వలన గతంలో అనుకున్న ఆలోచనలు ముందుకు సాగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో వారం చివరలో లాభంను కలిగి ఉండుటకు అవకాశం కలదు. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. సమయానికి భోజనం చేయుట ఉత్తమం పనిబారం పెరుగుటకు అవకాశం కలదు.   

సింహ రాశి
ఈవారం నూతన ఆలోచలను కలిగి ఉండి ముందుకు వెళ్తారు. భోజనం విషయంలో ప్రత్యేకశ్రద్ధను కలిగి ఉంటారు భోజనసౌఖ్యం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ముందంజ వేయగలుగుతారు. ప్రయత్నాలలో విజయం ఉంటుంది చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం కలదు. సమాజంలో మీ ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు మంచిపేరును కలిగి ఉంటారు. నూతన వస్తువులను కొనాలనే ఆలోచనను కలిగి ఉంటే మాత్రం వాయిదా వేసుకొనుట మంచిది. అనుకోని ఖర్చులను పొందుటకు అవకాశం ఉంది. అజాగ్రత్తగా ఉంటే మాత్రం అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది సంచారం చేయుట మూలాన ఇబ్బందులను పొందుతారు. మీయొక్క వ్యతిరేకులను ఇబ్బందిపెట్టే ఆలోచనలతో ముందుకు వెళ్ళుట చేత కొంత సంతోషాన్ని పొందుతారు. నూతన ప్రయత్నాలలో మీ ఆలోచనలను అమలుచేస్తారు ఫలితాలు అనుకూలంగా కలుగుటకు అవకాశం ఉంది.       

కన్యా రాశి
ఈవారం ఉద్యోగంలో తలపెట్టిన పనులను సకాలంలో పూర్తిచేయుట వలన ఉద్యోగస్థానంలో మంచిపేరును కలిగి ఉంటారు అలాగే అధికారుల వలన లాభంను పొందుటకు అవకాశం కలదు. రాజకీయవ్యహారాల పట్ల మాక్కువను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన లాభంను పొందుతారు ధనలాభం ఉంటుంది. మీ ఆలోచనలు సమాజంలో గౌరవాన్నితెచ్చేవిగా ఉంటాయి అలాగే వాటి మూలాన తోటివారు లాభంను పొందుతారు. అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం కలదు తగిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంభంలో ఆవేశాన్ని తగ్గించుకొనుట అలాగే అవతలి వారిఆలొచనలకు విలువ ఇవ్వడం మంచిపని. నిరుద్యోగులు బాగా కష్టపడుట మూలాన ఉద్యోగఅవకాశాలు కలుగుటకు అవకాశం ఉంది. అకారణంగా తిరుగుట మూలాన శ్రమను పొందుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. భోజనం విషయంలో ప్రత్యేకశ్రద్ధను కలిగి ఉంటారు. ఏవైనా నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుట మంచిది. అకారణంగా కలహములు కలుగుటకు అవకాశం ఉంది నిదానంగా ఉండుట మంచిది.   

తులా రాశి
ఈవారం మిశ్రమఫలితాలను కలిగి ఉంటారు జాగ్రత్తగా ప్రణాళిక చేయుట మూలాన లభంను పొందుతారు. మాటలను పొదుపుగా వాడుట చేసేపనిలో అందరిని కలుపుకొని వెళ్ళుట వలన పనులు ముందుకు సాగుతాయి. సమయానికి భోజనం చేయుట మూలాన అనారోగ్య సమస్యలు తగ్గుటకు అవకాశం కలదు. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి తలపెట్టిన పనులలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. నిరుత్సాహంను కలిగి ఉండుట వలన పనులలో వేగం తగ్గుటకు అవకాశం ఉంది. పెద్దల సూచనలను పాటించుట వారిచెప్పిన విధంగా నడుచుకొనుట మూలాన మేలుజరుగుతుంది. వ్యతిరేకుల పట్ల జాగ్రత్తగా ఉండుట అన్నివిషయాల్లో ఆచితూచి వ్యహరించుట ఉత్తమం. గృహలాభంను పొందుటకు అవకాశం కలదు ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. 

వృశ్చిక రాశి
ఈవారం ప్రతిపనిని నిదానంగా ఆలోచించి చేపట్టుట మంచిది. ఉత్సాహంను కలిగి ఉండి నూతన ఆలోచనలను చేస్తారు అప్రయత్నంగా ముందుకు వెళ్ళునప్పుడు జాగ్రత్త వహించుట మంచిది. అందరిలోను గుర్తింపును కోరుకుంటారు ఆశించిన విధంగా ఉండక పోవచ్చును. ఒక వార్తను వినుట మూలాన భాదను పొందుటకు అవకాశం కలదు మానసికంగా దృడంగా ఉండుట మంచి ఫలితాలను కలుగజేస్తుంది. మీయొక్క వ్యతిరేకుల మూలాన పనిభారంను పొందుటకు అవకాశంన్ కలదు. అకారణంగా ఇబ్బందులను పొందుతారు అనారోగ్య సమస్యలు వేదిస్తాయి తగిన జాగ్రత్తలు పాటించుట చేత కొంత ఉపశమనం ఉండుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో మీరు ఆశించిన విధంగా గుర్తింపు ఉండకపోవచ్చును సర్దుకుపోవడం ఉత్తమం. చేపట్టే పనులలో శ్రమను పొందుటకు అవకాశం కలదు నిదానంగా పూర్తిచేస్తారు. పెద్దల ద్వార మీరు లాభంను పొందుటకు అవకాశం కలదు వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకొనుట ఉత్తమం.        

ధనస్సు రాశి
ఈవారం ఇష్టమైన వారిని కలుస్తారు అనుకూలమైన పనులను చేపడుతారు. ఆలోచనలు అధికంగా ఉండుట చేత ఆందోళన చెందుటకు అవకాశం కలదు. ప్రతిపనిలోను ఫలితంను ఆశించక పోవుట వలన మేలుజరుగుతుంది ఈ విషయంలో నిదానంగా వ్యవహరించుట మంచిది. మాటను పొదుపుగా వాడుట చేత కలహములను తగ్గించుకొనుటకు అవకాశం కలదు. చేపట్టిన పనులలో మొదలు ఉన్న ఉత్సాహం చివరివరకు ఉండకపోవచ్చును. కుటుంభసభ్యుల మద్య అ వగాహన అవసరం లేకపోతే మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. తలపెట్టినపనులలో ఆటంకాలు కలుగుటకు అవకాశం కలదు గట్టిగా ప్రయత్నం చేయుట పనులు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ధర్మసంభందమైన పనులలో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. విందులు వినోదాల పట్ల మక్కువను కలిగి ఉంటారు ఖర్చును పొందుటకు అవకాశం ఉంది.

మకర రాశి
ఈవారం నూతన ప్రయత్నాలను ఆరంభించుటకు అవకాశం ఉంది తలపెట్టిన పనులను సమయానికి పూర్తిచేస్తారు ఆర్థికపరమైన అభివృద్దిని కలిగి ఉంటారు అలాగే ధాన్యవృద్ది ఉండుటకు అవకాశం కలదు. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు మనోదైర్యంను కలిగి ఉండుట చేత పనులను ముందుకు కొనసాగిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండుట తగిన జాగ్రత్తలు పాటించుట ఉత్తమం. సమయానికి భోజనం చేయుట మంచిది. చర్చలలో ఆసక్తిని కలిగి ఉంటారు విధ్యాసంభందమైన ఆలోచనలు చేయుట మంచిది. వినొదములలొ పాల్గొంటారు మిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. అధికారుల మూలాన ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు నిదానంగా వ్యవహరించుట కోపాన్ని తగ్గించుకొనుట ఉత్తమం. అకారణంగా భయంను పొందుటకు అవకాశం కలదు పనిని ఆరంభించే ముందు పెద్దల సూచనలు పాటించుట మేలు. గతంలో చేసిన పనులకు సంభందించిన ఫలితాలు పొందుతారు.    

కుంభ రాశి
ఈవారం కొన్ని అనుకూలమైన ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో అనుకోకుండా సహాయంను పొందుటకు అవకాశం కలదు గతంలో మీరు చేసిన ఆలోచనలు ఫలిస్తాయి.  ఉత్సాహంను కలిగిఉండి నూతన పనులను చేపడుతారు. బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులలో ధనవ్యయం పెరుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. చేపట్టిన పనులలో అధికమైన శ్రమను పొందుతారు చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం కలదు బాగా ఆలోచించి చేపట్టుట వలన పనులు ముందుకు సాగుతాయి. అనారోగ్యం వలన సమస్యలు పొందుటకు అవకాశం కలదు తగిన జాగ్రత్తలు పాటించుట ఉత్తమం. సంతానం మూలాన ఆలాగే జీవితభాగస్వామి మూలాన చిన్న చిన్న ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు సర్దుకుపోవడం ఉత్తమం. మీయొక్క ఆలోచనలు తోటివారిని శ్రమకు గురిచేయుతకు అవకాశం కలదు. అందరిని కలుపుకొని పోవుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది.  

మీన రాశి
ఈవారం మీరు చేపట్టే పనులలో స్పష్టత వచ్చుటకు అవకాశం కలదు. ఇష్టమైన పనులలో ఒక అడుగు ముందుకు వేస్తారు నచ్చిన వారితో చర్చలు జరుపుటకు అవకాశం కలదు. గతంలో చేపట్టిన పనులలో ఏమైనా పూర్తికానివాటిని పూర్తిచేయుట మంచిది. అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు వాటిని నియత్రించే ప్రయత్నం చేయుట మంచిది. బంధుమిత్రులతో స్వల్ప విరోధములు కలుగుటకు అవకాశముంది. ఆర్థికపరమైన విషయాల్లో అభివృద్దిని కలిగి ఉంటారు ధనలాభంను కలిగి ఉంటారు. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. అనుకోని ఖర్చులను కలిగి ఉంటారు వాటిని నియత్రించుట మంచిది. క్రిందిస్థాయి వారి వలన లాభంను పొందుటకు అవకాశం కలదు వారిమూలన సహకారంను పొందుతారు. ప్రయ్నాలు చేయునప్పుడు జాగ్రతలు పాటించుట మంచిది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మంచిది.

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Pancharaamalu by Jayalakshmi Jampani