Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaakoolu by Sairam Akundi

ఈ సంచికలో >> శీర్షికలు >>

నవ్వుల జల్లు - జయదేవ్

ఈజిప్ట్ యాత్రికుడు: ఇంతకు ముందెన్నడూ, మిధిలానగరంలో, కెంపురంగు, నీలిరంగు ముత్యాలు చూడలేదే?
చీనా యాత్రికుడు : మొన్న సీతారాముల కళ్యాణం జరిగిందా! తలంబ్రాల ముత్యాలని ప్రజలకు పంచి పెడుతున్నారు, జనక మహారాజుగారు!!

దొరస్వామి శెట్టి : నేనూ ఒక మహానుభావుడన్న సంగతి, నిన్న తెలుసుకున్నాను!
కుమార స్వామి మొదలియార్ : ఎలా?
దొరస్వామి శెట్టి : త్యాగయ్య గారు, "ఎందరో మహానుభావులు... అందరికీ వందనములు" కీర్తన పాడిన సభలో నేనూ వున్నాను!!

సకల కళా పారంగతుడు - 1 : నాకు అరవై నాలుగు కళలూ వచ్చు!!
సకల కళా పారంగతుడు - 2 : నాకు అరవై ఐదు కళలొచ్చు!!
సకల కళా పారంగతుడు - 1 : ఔనా? ఆ అరవై ఐదవ కళ ఏమిటి?
సకల కళా పారంగతుడు - 2 : అవతలి వాడికంటే తాను ఒక మెట్టు అధికం అని చెప్పగలిగే ధైర్యం!!!

బుచ్చిరెడ్డి : "తిరిపెమునకిద్దరాండ్రా" అని పాడి, శ్రీనాధకవి, శివుడ్ని, తిట్టారా? పోగిడారా??
అచ్చిరెడ్డి : రెండూ కాదు. శివుడి మీద అసూయ! కవిగారికి ఒక భార్యే కదా? శివుడి కిద్దరు భార్యలాయె!!

సుందరయ్య : ఏం పిండి వంటలు తిన్నావేం? నీ నోరు అంతగా ఊరుతోంది, చొంగ కారుస్తున్నావ్?
శంకరయ్య : పిండి వంటలు తినలే! సుమతి శతకం చదివాను!!

కనక వల్లి : వనభోజనం భలే రుచికరంగా వుంది! నల పాకమా? భీమ పాకమా?
కర్పగ వల్లి : రెండూ కాదు! బెల్లం పాకం! మనం వుండేది చెరుకు తోటలో కదా!!


ముని పుంగవుడు : ఈ నదీ తీరాన కూర్చుని ఏమిటాలోచిస్తున్నావు నాయనా?
దానయ్య : ఆవలి గట్టుకు చేరే మార్గం గురించి!!
ముని పుంగవుడు : సర్వము త్యజించి భక్తి మార్గము నాశ్రయించు నాయనా! ఆ పరమేశ్వరుడే నిన్ను ఆవలిగట్టుకు చేరుస్తాడు!!
దానయ్య : అయ్య బాబోయ్! ఈ నది దాటి అవతలి గట్టు చేరడానికి అంత చెయ్యాలా?
ముని పుంగవుడు : ఓహో? నువ్వు ఆ ఆవలిగట్టు గురించి అడిగావా? ఐతే రెండు కాసులిచ్చి పడవెక్కు!

ముసుగు మనిషి : రేయ్ ద్వారపాలకా? కునుకు తీస్తున్నావే? నీ ఉద్యోగం ఏమిటీ? నువ్వు చేసే పనేమిటి?
ద్వార పాలకుడు : నువ్వెవడ్రా నన్నడగడానికి?
ముసుగు మనిషి : నేనేరా, మారువేషంలో వున్న రాజుని! ఒరేయ్ ఎవరక్కడ, ఈ ద్వారపాలకుడ్ని బంధించి బొక్కలో తోయండి!!

యమ ధర్మరాజు : దారి మల్లిస్తున్నావెందుకు చిత్రగుప్తా?
చిత్ర గుప్తుడు : తమరికి ఇంకొకసారి పరాభవమెందుకు యమధర్మ రాజా?
యమ ధర్మరాజు : సరేలే... ఎవరడ్డ మోచ్చారు?
చిత్ర గుప్తుడు : మార్కండేయులు వారు!! ఇటువేపొస్తున్నారు!!!
యమ ధర్మరాజు : ఐతే వెంటనే, వేరే దారిన వెళదాం పద!!

లంబు : హాయ్... నాయకా!!
ఘటోత్కచుడు : ఏమిరా, పొగరా? హై హై నాయకా అనక హాయ్ నాయకా అని పలకరిస్తున్నావ్??
జంబు : వీడు పొరుగుదేశం వెళ్ళి పెద్దచదువులు చదువుకొచ్చినప్పట్నుంచి, ఇదీ వరస నాయకా!!
మరిన్ని శీర్షికలు
chicken pulav