Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
10 Biryanis per day - Mohan Babu

ఈ సంచికలో >> సినిమా >>

సంపూర్ణేష్‌బాబుకి అన్నీ తెలుసు

Sampoornesh Babu - Hrudaya Kaaleyam

‘హృదయకాలేయం’ అనే టైటిల్‌ అనౌన్స్‌ కాగానే అంతా షాక్‌ తిన్నారు ఇదేం టైటిల్‌ అని. అక్కడితో ఆ షాక్‌ ఆగలేదు. ఆ సినిమా హీరో సంపూర్ణేష్‌బాబు తన గురించి తాను ప్రొజెక్ట్‌ చేసుకున్న తీరు, సినిమా ట్రెయిలర్‌.. ఇవన్నీ తెలుగుప్రేక్షకులకు షాక్‌ ఇస్తూనే వున్నాయి. అయితే ఈ షాక్‌లలో చాలావరకు కామెడీ అయిపోతున్నాయి కూడా.

ట్రెయిలర్‌లో సంపూర్ణేష్‌బాబు చుట్టూ నడిచిన కామెడీని అందరూ ఫక్కున నవ్వుకుంటున్నారు, చాలామంది అతన్ని వెటకారం చేస్తున్నారు కూడా. అక్కడికేదో సూపర్‌స్టార్‌లా సంపూర్ణేష్‌బాబు తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని అందరూ అనుకుంటోంటే, ఇలాంటి కామెంట్స్‌ సంపూర్ణేష్‌బాబు ముందే ఊహించాడనే వార్త ఒకటి ఇంకా పెద్ద షాక్‌ ఇస్తోంది.

తనను చూసి అంతా నవ్వుకుంటారని తెలిసే, ‘హృదయకాలేయం’ సినిమాని సంపూర్ణేష్‌బాబు వెరైటీగా ప్లాన్‌ చేసుకున్నాడట. సినిమా కథ సీరియస్‌గానే వెళ్తుందిగానీ, చూసేవారికే నవ్వొస్తుందట. సినీ పరిశ్రమలో వింత పోకడలు, స్టార్‌ డమ్‌.. ఇవన్నీ ఈ సినిమాలో సెటైరికల్‌గా కన్పించనున్నాయట. తాను సీరియస్‌గా చేస్తున్నా ప్రేక్షకులు వెటకారంగా భావిస్తున్నారంటే.. అది అంతా తెలిసే సంపూర్ణేష్‌బాబు చేశాడంటే అతను తెలివైనోడే. 

మరిన్ని సినిమా కబుర్లు
Tamarind Rice - Bhaskara Bhatla