Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Sampoornesh Babu - Hrudaya Kaaleyam

ఈ సంచికలో >> సినిమా >>

భాస్కరభట్ల పులిహోరా మజాకా

Tamarind Rice - Bhaskara Bhatla

పులిహోర అంటే.. ఇంకేదో కహానీ కాదు. ఇది నిజంగానే అందరూ ఇష్టంగా ఆరగించే ఐటమ్‌ పులిహోర గురించే. సినీ గేయ రచయిత భాస్కరభట్ల రవికుమార్‌, పాటలతోనే కాదు, పులిహోరతోనూ ఫేమస్‌ అవుతున్నాడు. భాస్కరభట్ల ఇంట్లో తయారుచేసే పులిహోర చాలా ప్రత్యేకంగా వుంటుందట.

ఆ పులిహోర గురించి, భాస్కరభట్లకు అత్యంత సన్నిహితుడు, దర్శకుడు పూరి జగన్నాథ్‌కి బాగా తెలుసు. ఎందుకంటే, మంచి పులిహోర టేస్ట్‌ కావాలంటే, భాస్కరభట్లను రిక్వెస్ట్‌ చేసి మరీ, ఆయన ఇంటి నుంచి తెప్పించుకుంటాడట పూరి జగన్నాథ్‌. ఇప్పుడీ విషయం ఆనోటా, ఈ నోటా తెలుగు సినీ పరిశ్రమ అంతటా వ్యాపిస్తోంది.

సినీ ప్రముఖుల ‘ఇంటి వంటకాల’ గురించి భలే ఆసక్తికరమైన ప్రచారాలు జరుగుతుంటాయి. షూటింగ్‌ స్పాట్‌లో ఫ్రెండ్లీ వాతావరణంలో భాగంగా, కొందరు ఇంటి నుంచి తెప్పించిన వంటకాలతో, షూటింగ్‌ సిబ్బందిని ఖుషీ చేస్తుంటారు. నటీనటులు, దర్శక నిర్మాతలు వంటివారూ ఇంటి ఫుడ్‌ మీద ప్రత్యేకమైన ఆసక్తి చూపుతారు.

భాస్కరభట్ల పులిహోర.. పూరి జగన్నాథ్‌తోపాటు అతి కొద్ది మందికి మాత్రమే పరిమితమట.

మరిన్ని సినిమా కబుర్లు
Up Coming Movies in June and July